రాశిఫలాలు 10 జూలై 2024:ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో మిధునం, కన్యతో సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం..!

horoscope today 10 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ యోగం, గణేశుడి ఆశీస్సులతో మిధునం, కన్యతో సహా ఈ 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

horoscope today 10 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో లక్ష్మీ నారాయణ యోగం, రవి యోగం వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈరోజున పూరీలో హీరా పంచమి వేడుకలు జరగనున్నాయి. మరోవైపు కొన్ని రాశుల వారికి వినాయకుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు అక్కడికి వెళ్లడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారు మీ నుండి కొంత లోతైన ప్రయోజనం పొందాలని భావిస్తున్నందున కుటుంబ సభ్యులెవరికీ వాగ్దానాలు చేయొద్దు. విద్యార్థులు తమ పరీక్షలను లక్ష్యంగా చేసుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు.ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారిలో వ్యాపారులు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొన్ని కార్యాలయంలో కొన్ని కొత్త బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఈరోజు మీకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యాపారంలో సోదరులు, సోదరీమణుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు బలహీనంగా భావించొద్దు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారులు ఈరోజు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. అది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది.ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు కోపంతో పెద్ద తప్పు చేస్తారు. కానీ తర్వాత అదే చర్య మీకు సమస్యగా మారుతుంది, కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి ఇతరులకు మేలు చేయండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు సాగాలి. అప్పుడే మీ పని విజయవంతం అయినట్లు అనిపిస్తుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో మీ తండ్రి నుండి సలహా తీసుకోవచ్చు.ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు తమ ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ సాయంత్రం కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకమైన ఫలితాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలి. మీ పనిలో కొన్ని ఈరోజు పూర్తి కావొచ్చు. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండాలి. మీరు సాయంత్రం కొన్ని శుభ కార్యాలలో పాల్గొనవచ్చు.ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు స్నేహితుల నుంచి వ్యాపారం గురించి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపార నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఈరోజు మీరు కొన్ని ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మీ మాటలను నియంత్రించుకోవాలి. అప్పుడే మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం తీసుకోవచ్చు. వీటిలో ఏదైనా మీకు సహాయకరంగా ఉండొచ్చు. విద్యార్థులకు ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి. కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే అది ఈరోజుతో ముగుస్తుంది.ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఉద్యోగులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారులు ఎలాంటి పనుల్లో జాప్యం చేయకూడదు. మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఇందులో చాలా రంగాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు బంధువుల నుండి డబ్బు, ఆస్తులు పొందే అవకాశం ఉంది.ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించి ఏదైనా న్యాయపరమైన వివాదాలుంటే, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. లేదంటే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ పాత తీర్మానాలలో కొన్నింటిని నెరవేర్చడానికి మీ మనస్సును ఏర్పరచుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-09T19:02:27Z dg43tfdfdgfd