Chanakya Niti గొప్ప తత్వవేత్త, ఆర్థిక వేత్త అయిన ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సులభంగా, సంతోషకరంగా మార్చుకునేందుకు అనేక సూత్రాలను వివరించారు. తాను రచించిన చాణక్య నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల గురించి స్పష్టంగా వివరించారు. ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, డబ్బు, వ్యాపారంతో సహా ఇంకా అనేక విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్యుని మార్గాలను, మాటలను, అలవాట్లను పాటిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సులభంగా రాణించొచ్చు. ఈ నేపథ్యంలోనే తన నీతి శాస్త్రంలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల గురించి, మహిళలు ఇష్టపడే అలవాట్ల గురించి, తమ జీవితాన్ని సంతోషంగా మార్చుకునేందుకు మగవారు ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలనే వివరించారు. ఈ సందర్భంగా ఒక స్త్రీ సంతోషంగా ఉండాలంటే పురుషుడు ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి...
మహిళలను గౌరవించే మగవారి పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారని మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ తన జీవిత భాగస్వామి తనను గౌరవించాలని కోరుకుంటుంది. అందుకే అలాంటి మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు అలాంటి పురుషుల మాటలను స్త్రీలు కచ్చితంగా వింటారు.
చాణక్య నీతి ప్రకారం, మహిళలు నిజాయితీగా, నమ్మకంతో ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే మహిళలకు అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు. నిజాయితీగా ఉండే వారు ఎల్లప్పుడూ సన్మార్గంలోనే నడుస్తారు. అలాంటి వ్యక్తులు తప్పు చేయరని చాలా మంది నమ్ముతారు. అందుకే ఇలాంటి వ్యక్తులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి మగవారితో తాము కలిసుంటే ప్రపంచాన్ని సైతం సులభంగా గెలవొచ్చు అని భావిస్తారు. అంతేకాదు తమ జీవితం ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉంటుందని ఫీలవుతారు.
Mysterious Temple ఈ గుడి లోపలికి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే... ఎందుకో తెలుసా...
ప్రశాంతంగా ఉండే వారిని..
మన ప్రవర్తనతో మనం ఎవరినైనా సులభంగా గెలవవొచ్చు. ఇదే విషయం చాణక్య నీతిలో ప్రస్తావించబడింది. మహిళలు సాధారణంగా సున్నితమైన స్వభావం ఉండే మగవారిని ఇష్టపడతారు. అదే విధంగా ప్రశాంతంగా ఉండే వారిపై ఎక్కువ మోజు పెంచుకుంటారు. ఇలాంటి వ్యక్తులను త్వరగా ప్రేమిస్తారు.
ధైర్యంగా ఉండే వారిని..
ధైర్యవంతులైన మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ధైర్యవంతులైన మగాళ్లు తమను ఎలాంటి ఆపద నుంచి అయినా రక్షిస్తారని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా వారికి ఏదైనా అవసరమైనప్పుడు ఏ మాత్రం వెనకడుగు వేయకూడదని చాణక్యుడు వివరించారు.
పురుషులు తను ప్రేమించిన అమ్మాయిని మెప్పించాలంటే, తమ భాగస్వామిని ఆకర్షించాలంటే ఈ నాలుగు లక్షణాలను అలవర్చుకోవాలి. వీటిని పెంపొందించుకోవడం ద్వారా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
and
2023-05-24T10:09:25Z dg43tfdfdgfd