HOROSCOPE TODAY 26 MAY 2023 ఈరోజు వృషభరాశి ప్రత్యేక లాభాలు..! మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

horoscope today 26 May 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...

horoscope today 26 May 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే కర్కాటకంలో చంద్రుడు ఉన్నంత సమయం అంగారకుడితో కలిసి ఉంటాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో చంద్ర మంగళ యోగం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపలేరు. ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు కొన్ని శారీరక సమస్యలు ఉండొచ్చు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. మీరు ఈరోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెడితే, రాబోయే కాలంలో మీకు రెట్టింపు లాభం వస్తుంది. వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలొస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలొస్తాయి. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు తులసి చెట్టుకు నిత్యం నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

ఈ 4 రాశుల వ్యక్తులపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం..! ఇందులో మీ రాశి ఉందా..

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. జీవనోపాధి విషయంలో పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఈరోజు మీరు కొందరు కొత్త వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవచ్చు. ఈరోజు అకస్మాత్తుగా మీరు పెద్ద మొత్తాన్ని లాభాలు పొందొచ్చు. ఈ కారణంగా మీరు మీ పిల్లల బాధ్యతను పూర్తి చేయగలుగుతారు. ఈ కారణంగా వారు సంతోషంగా ఉంటారు. కొత్త సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఏదైనా పొరపాటు చేస్తే మీ శత్రువులు పెరుగుతారు. ఈరోజు మీరు మంచి బహుమతులు పొందొచ్చు. ఈరోజు పిల్లల ఆందోళన నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించండి.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల గురించి టెన్షన్‌లో ఉంటారు. ఈరోజున మీ కుటుంబం యొక్క ఆనందం, శాంతిని కొనసాగించడానికి, మీరు మీ శత్రువుల మాయలను అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ బంధువుల నుంచి డబ్బు పొందుతారు. ఈ కారణంగా మీకు కీర్తి పెరుగుతుంది. ఈరోజు మీరు మీ అవగాహనతో తీసుకున్న నిర్ణయంలో కచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు ఊహించని లాభాలొస్తాయి. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగం గురించే చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మీకు సీనియర్ల సహాయం అందుతుంది.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం పెరుగుతుంది. ఈరోజు విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనే ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడటం వలన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆలోచనలు, ప్రణాళికల గురించి చర్చిస్తారు.

ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభ ప్రదంగా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే, ఈరోజు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారం ఈరోజు బాగుంటుంది. మీ పనుల్లో జాప్యం ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు మీకు మానసిక అశాంతి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు శివ చాలీసా పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ కుటుంబసభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు ఉపాధ్యాయులతో మరింత సహకారం అవసరం. ఈరోజు ఉద్యోగులకు పురోగతికి మంచి లాభాలొస్తాయి. ఈరోజు మీరు ప్రేమ వ్యవహారాలలో విజయం పొందొచ్చు. సామాజిక, రాజకీయ ఖ్యాతి పెరగొచ్చు. ఈరోజు మీ వ్యాపారం బాగా సాగుతుంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

Surya Shani Gochar 2023 సూర్యుడు, శని సంచారంతో ఈ 4 రాశుల కష్టాలన్నీ తొలగిపోతాయి..! ఇందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి చాలా మద్దతు పొందుతారు. ఈరోజు మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మీ సోదరుల నుండి సలహా తీసుకోవచ్చు. మీరు సీనియర్ల సహాయం అందుతుంది. మీ పెండింగ్ పనులు వేగవంతమవుతాయి. ఈరోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోకండి. మరోవైపు ఆర్థిక సంక్షోభం పెరిగే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా లాభాలొస్తాయి. మీరు మీ డబ్బును ఏదైనా స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టినట్లయితే, దాని వల్ల మీరు కచ్చితంగా లాభాలను పొందుతారు. ఈరోజు మీరు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు మీ బంధువుల నుండి బహుమతిని పొందొచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. సామాజిక కోణంలో చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీ ఇంటి బయట విచారణ ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు తమ పనుల గురించి బయటికి వెళ్లొచ్చు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు గోమాతకు రోటీని తినిపించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు మీకు మహిళా అధికారి సహకారం లభిస్తుంది. ఈరోజు కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు ఎవరినైనా లోన్ కోసం అడిగితే, అది సులభంగా లభిస్తుంది. అయితే ఈరోజున మీరు దుబారాకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు పెట్టుబడులు పెడితే శుభ ప్రదమైన ఫలితాలొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఈరోజు అనేక పనులు ఒకేసారి చేయాల్సి రావడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. ఈరోజు మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. దాని నుంచి మీరు కచ్చితంగా దాని ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ తండ్రి సహాయంతో మీ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీరు లాభదాయకమైన ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం పొందుతారు. మీకు గృహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు సోమరితనంగా ఉండకూడదు. పిల్లల ప్రవర్తన వల్ల ఇబ్బందులు తలెత్తొచ్చు. మీరు వివాదాలకు దూరంగా ఉండాలి.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు శివ జప మాల పఠించాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-05-25T18:15:28Z dg43tfdfdgfd