MANGAL GURU YUTI: 12 ఏళ్ల తర్వాత వృషభంలో కుజుడు-గురువు కలయిక వేళ ఈ 6 రాశుల వారికి తిరుగనేదే ఉండదు..!

Mangal Guru Yuti 2024 జ్యోతిష్యం ప్రకారం, వృషభ రాశిలో కుజుడు(అంగారకుడు), గురు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా, కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవి.. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...

Mangal Guru Yuti 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. అదే సమయంలో ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ఇవి రాశిచక్రాలు, మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో దేవ గురువు 12 ఏళ్ల తర్వాత వృషభంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే జూలై మాసంలో కుజుడు(అంగారకుడు) కూడా 12 సంవత్సరాల తర్వాత అంటే జూలై 12వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం 7 గంటలకు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో గురు, కుజుడి కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగులు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గురుడు, కుజుడి కలయిక వల్ల ప్రయోజనాలు కలగనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి(Aries)..

ఈ రాశికి అధిపతి అయిన కుజుడు మేషం నుంచి నిష్క్రమించి వృషభంలో ప్రవేశించి.. గురువుతో కలయిక జరపడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

వృషభ రాశి(Taurus)..

ఈ రాశి వారికి గురుడు, కుజుడి కలయిక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వీటన్నింటి వల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ కుటుంబంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారు 12 ఏళ్ల తర్వాత వృషభంలో గురుడు, కుజుడి కలయిక జరగడంతో శుభ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీరు మరింత బలోపేతం అవుతారు. వ్యాపారులకు అధిక లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మంచి లాభాలొస్తాయి. మీ కుటుంబంలో వ్యక్తులతో సమన్వయం పెరుగుతుంది. మీ ప్రేమ సంబంధాలు బలంగా మారతాయి.

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి కుజుడు, గురుడు రెండు గ్రహాల కలయిక వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. ఈ రాశి నుంచి పదో స్థానంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది. ఈ కాలంలో వ్యాపారులు గణనీయమైన లాభాలను సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభించొచ్చు. మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు. దీంతో మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మీ తండ్రితో మీ సంబంధం మరింత బలపడుతుంది.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి నుంచి ఏడో స్థానంలో గురువు, కుజ గ్రహాల కలయికతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు.

మకర రాశి(Capricorn)..

ఈ రాశి నుంచి గురు, కుజ యుతి పంచమ స్థానంలో జరగనుంది. ఈ కాలంలో వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగొచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరొచ్చు. మీకు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమం లభించే అవకాశం ఉంది.

Read Latest Astrology News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-09T08:00:34Z