Remedies for Mars | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. ఇతరుల కోసం పోరాడే మరియు లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని ఇస్తాడు. శక్తి, ఉత్సాహం, కోపం, ఉద్రేకం, దూకుడికి సంకేతం. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే.. కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ గ్రహం స్థానం మారిన సమయంలో అది మన జీవితంలో అనేక అంశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కుజుడు జూన్ 7న సింహరాశిలోకి ప్రవేశించాడు. జులై 28 రాత్రి 8.11 గంటల వరకు సింహరాశిలోనే సంచరిస్తాడు. సింహరాశి అగ్ని మూలకం.
కుజుడు కూడా అగ్ని ఆధిపత్య గ్రహం. కాబట్టి యాదృశ్చికం చాలా ఉగ్రంగా, ప్రభావంతంగా ఉండనున్నది. ఈ గ్రహసంచారం కారణంగా దాదాపు 12 రాశులపై ప్రభావం పడనున్నది. కానీ, మినరాశి మినహా మిగతా అన్నిరాశులపై ప్రతికూల ప్రభావం పడే సూచనలున్నాయి. ఈ సమయంలో కోపం పెరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు, తగాదాలు, ఆరోగ్య సమస్యలు, అగ్ని సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. కుజగ్రహం శాంతికి పలు పరిహారాలు పాటిస్తే కొంత వరకు దుష్ప్రభావాలు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఏ రాశుల వారిపై కుజుడి ప్రభావం ఉండబోతుంది? పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..!
మేషరాశి జాతకులు ఈ సమయంలో తమ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అశాంతిని దరి చేరనీయకూడదు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ తర్వాత బెల్లం, పప్పు దానం చేయాలి. దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో ముందుకుసాగుతారు.
వృషభ రాశి జాతకులు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలున్నాయి. మంగళవారం రోజున పప్పుధాన్యాలను, ఎరుపురంగు వస్త్రాలను దానం చేయాలి. దాంతో కుజగ్రహం శుభ ప్రభావం ఉంటుంది. కుటుంబ వాతావరణంలో సామరస్యం పెరిగి ఉద్రిక్తతలు తగ్గుతాయి.
మిథునరాశి జాతకులు వాక్కు, ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందులుపడే అవకాశాలున్నాయి. హనుమంతుడిని ఎర్రటి పువ్వులతో పూజించి.. ఆపై రాగి పాత్రలను దానం చేయాలి. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది, వాక్కు బాగుంటుంది.
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో భయపడడంతో పాటు అభద్రతా భావానికి గురవుతారు. శివలింగాన్ని నీటితోపాటు ఎర్ర చందనంతో అభిషేకించాలి. ఈ పరిహారంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
సింహరాశిలోనే కుజుడు సంచరిస్తున్నందున దాని ప్రభావం ప్రత్యక్షంగా, తీవ్రంగానే ఉంటుంది. కుజ గ్రహం అనుగ్రహం కోసం మంగళ మంత్రాన్ని జపించాలి. ఎర్ర పప్పుధాన్యాలను దానం చేయాలి. దాంతో నాయకత్వ నైపుణ్యాలను పెంచుతుంది. అలాగే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ సమయంలో వృత్తి, ఆరోగ్యం విషయంలో ఆందోళనలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. శివుడికి అభిషేకం చేయించాలి. మంగళవారం హనుమంతిడిని పూజించాలి. దాంతో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పని చేసే చోట స్థిరత్వం ఉంటుంది.
వైవాహిక జీవితంలో అసమతుల్యత లేదంటే ఉద్రిక్తతలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కుజగ్రహ శాంతి కోసం రక్తాన్ని దానం చేయండి. ఈ పరిహారం సంబంధాలలో సామరస్యాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది.
కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. కాబట్టి ఈ గ్రహ ప్రభావం రాశిజాతకులపై లోతుగా ఉంటుంది. గ్రహశాంతి కోసం ఐదు మంగళవారాలు బెల్లం, రాగిని దానం చేయాలి. దాంతో ఆకస్మిక ప్రమాదాల నుంచి బయటపడుతారు. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మంగళవారం శివాలయంలో ఆలయంలో ఎర్రటి పువ్వులు అర్పించి.. రుద్రాభిషేకం చేయించాలి. దాంతో చట్టపరమైన, ఆస్తి సంబంధిత విషయాల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.
కుజుడి ప్రభావం కారణంగా కోర్టు కేసులు, వివాదాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఎర్ర చందనం తిలకం ధరించి.. మంగళ మంత్రాలను జపించాలి. దాంతో వివాదాల నుంచి ఉపశమనం కలుగుతుంది. నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కోపం, అశాంతి కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతుంది. మంగళవారం ఎర్ర మిరపకాయలు, పప్పులు దానం చేయండి. ఈ పరిహారంతో మీకు మానసిక ప్రశాంతతను లభిస్తుంది. స్థిరత్వం సాధిస్తారు.
కుజగ్రహ సంచారంతో మీనరాశి వారిపై తక్కువగానే ప్రభావం ఉంటుంది. అయితే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు శివాలయాన్ని దర్శించాలి. అలాగే హనుమంతుడిని దర్శనం చేసుకోవాలి. రక్తదానం చేస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే, భయాలన్నీ తొలగిపోతాయి.
2025-06-10T03:33:06Z