Saturn Retrograde in Aquarius జూన్ మాసంలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. జ్యేష్ఠ మాసంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చెందనుంది. 17 జూన్ 2023 రాత్రి 10:48 గంటలకు తిరోగమన దిశలో రవాణా ప్రారంభించనున్నాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 గంటల వరకు వ్యతిరేక దిశలోనే సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశిచక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...
సింహ రాశి(Leo)..
ఈ రాశి నుంచి శని దేవుడు ఏడో స్థానం నుంచి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని చాలీసా పఠించాలి. శనివారం రోజున హనుమంతుని ఆలయంలో సింధూరం సమర్పించాలి. నల్లని నువ్వులను లేదా గొడుగులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
కన్య రాశి (Virgo)..
ఈ రాశి నుంచి శని దేవుడు ఆరో స్థానం నుంచి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభ ఫలితాలొస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీరు కోరుకున్న చోటు సీటు లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు అప్పులను సైతం తిరిగి చెల్లిస్తారు.
ధనస్సు రాశి (Sagittarius)..
ఈ రాశి నుంచి శని దేవుడు మూడో స్థానం నుంచి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మతం, తత్త్వశాస్త్రం జ్యోతిష్యశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు మంచి కీర్తిని పొందొచ్చు. ఈ సమయంలో మీరు గురువు అనుగ్రహాన్ని పొందుతారు.
ఈ 4 రాశుల వ్యక్తులపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం..! ఇందులో మీ రాశి ఉందా..
కుంభ రాశి (Aquarius)..
ఇదే రాశిలో శని తిరోగమనం చెందడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలొస్తాయి. కోర్టు సంబంధిత విషయాల్లో మీరు మంచి విజయం సాధించొచ్చు. ఈ కాలంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
and