Shani Transit 2025 | న్యాయానికి అధిపతి అయిన శనైశ్చరుడు ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించాడు. దాదాపు 2027 వరకు అదే రాశిలో ఉంటాడు. అన్నిగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం కావడంతో ఆయన సంచారంతో మీనరాశిపై ప్రభావం చాలాకాలం పాటు ఉంటుంది. శని ఓ వ్యక్తికి అతని కర్మ ఆధారంగా శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే ఆయనను కర్మఫలదాదా అని పిలుస్తుంటారు. జాతకంలో శని స్థానం శుభప్రదంగా ఉంటే.. ఉద్యోగంలో రాణిస్తారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. శని రాశిచక్ర మార్పు పలు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. మీనరాశిలో 2027 వరకు శని సంచరించనున్న నేపథ్యంలో పలు రాశులవారిని అనుగ్రహించనున్నాడు. పెట్టుబడులు, ప్రణాళికాల్లో శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులవారెవరో చూద్దాం..!
శని మీన రాశిలో ఉండటం వల్ల వృషభ రాశిచక్రంలోని వ్యక్తులు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ వ్యాపార ప్రణాళికలన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. వ్యాపార నిర్ణయాలలో స్థిరత్వం ఉంటుంది. నిలిచిపోయిన పనిలో పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో ఏదైనా కోర్టు కేసు నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఉద్యోగం చేస్తున్న చోట రాణిస్తారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది.
మకర రాశి వారి ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశాలున్నాయి. పిల్లల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. పోటీ పరీక్షలకు ప్రయత్నిస్తున్న రాశిచక్ర జాతకులు విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారం విషయంలో.. కెరీర్‌లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస అవకాశాలున్నాయి. అయితే, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పెరగడంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
శని దేవుడు ఆశీస్సులు కుంభరాశి వారిపై ఉంటాయి. విద్యపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి సమయం. ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. పదోన్నతి అవకాశాలు ఉంటాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల సంబంధాలు మెరుగుపడతాయి. మార్కెట్‌లో రాకుండా పోయిన డబ్బులు తిరికి అనుకోకుండా మీ చేతికి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో పనులన్నీ విజవంతం అవుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి.
“Guru Asta | గురువు అస్తమయం.. ఈ రాశులవారికి ఇక తిరుగేలేదు..!”
“Kaalsarpa Yogam | రాహు, కేతువుల సంచారంతో కాలసర్ప యోగం..! ఈ నాలుగు రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!”
“Samsaptak Raja Yogam | అత్యంత శక్తివంతమైన సంసప్తక రాజ్యయోగం..! అదృష్టమంటే ఈ రాశులవారిదే..!”
2025-06-09T12:30:18Z