SHANI TRANSIT IN 2024: శని, బుధ గ్రహాల ప్రభావంతో ఈ 6 రాశులకు అన్నింటా విజయాలే..!

Shani Transit in 2024 జ్యోతిష్యం ప్రకారం, శని, బుధ గ్రహాలు పరస్పరం వీక్షించుకుంటే కొన్ని రాశుల వారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ మేధస్సుతో సులభంగా బయటపడతారని, అంతేకాదు అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Transit in 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలన్నింటిలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శని దేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా శని దేవుడు బుధుడితో కలయిక జరిపినా లేదా ముఖాముఖి వచ్చినా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సింహ రాశిలో బుధుడు సంచారం చేయనున్నాడు. దీంతో కుంభ రాశిలో శని దేవుడితో వీక్షణ ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సందర్భంగా ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి శని, బుధ గ్రహాల ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కార్యాలయంలో మీకు ప్రమోషన్ కూడా అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

వృషభ రాశి(Taurus)..

ఈ రాశి నుంచి చతుర్థి, దశమ స్థానంలో బుధుడు, శని ముఖాముఖిగా చూసుకోవడం వల్ల ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు ఏవైనా సమస్యలుంటే, అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి నుంచి శని, బుధ గ్రహాలు ఎనిమిదో స్థానం నుంచి ముఖాముఖి చూసుకోవడం వల్ల కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా, సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచి ఫలితాలొస్తాయి.

సింహ రాశి(Leo)..

ఈ రాశి నుంచి శని, బుధుడి పరస్పర వీక్షణ వల్ల సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఆరోగ్య పరంగా అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ మనసులో కోరికలు నెరవేరుతాయి.

తులా రాశి(Libra)..

ఈ రాశి నుంచి బుధుడు, శని ముఖాముఖి ఐదో స్థానం నుంచి జరగనుంది. ఈ కాలంలో వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ ప్రతిభను చూపుతారు. ఉద్యోగులకు హోదాతో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి(Sagittarius)..

ఈ రాశి నుంచి బుధుడు, శని గ్రహాల ముఖాముఖి వీక్షణ వల్ల ధనస్సు రాశి వారు ఏ ప్రయత్నం చేసినా అందులో మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణం మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Astrology News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-03T06:07:12Z dg43tfdfdgfd