Sun Transit Effect | ప్రత్యక్షదైవం సూర్య భగవానుడు ప్రతి మాసం ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. తప్పనిసరిగా ఏడాదిలో 12 రాశుల్లోకి వెళ్లి వస్తుంటాడు. అందుకే జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి విశేష స్థానమే ఉన్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహం గౌరవం, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో.. కొన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఈ నెల 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దాని కారణంగా మూడురాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనున్నాడని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ రాశులేంటో ఓసారి తెలుసుకుందాం రండి..!
మీన రాశి : సూర్యుడి సంచారం వల్ల మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఆత్మవిశ్వవాసం పెంపొందడంతో పాటు శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. పెళ్లికాని వారికి అనుకూలమైన సమయం. పెళ్లికి ప్రతిపాదనలు వచ్చే సూచనలున్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియనున్నారు. మీనరాశిలో జన్మించిన వారంతా ఈ సమయంలో కష్టపడితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండనున్నది. వీరికి సమాజంలో ప్రశంసలు పొందుతారు.
ధనస్సు రాశి : సూర్యుడి సంచారంతో ధనస్సు రాశి వారికి సైతం శుభ ఫలితాలున్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త ఇంటితో పాటు వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశాలున్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. ధనస్సు రాశిలో పుట్టిన వారికి.. మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశం కారణంగా అత్తామామల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయి. ఫలితంగా కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఇప్పుడు పోటీ పరీక్షలకు హాజరవుతే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి : ఈ రాశి వారికి కూడా సూర్యుడి సంచారంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. నిరుద్యోగులు ఎట్టకేలకు శుభవార్త వింటారు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగం కల నెరవేరుతుంది. ఇక విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్న వారి.. కల సైతం సాకారముతుంది. వ్యాపారాల్లో జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెడితే.. మంచి లాభాలను పొందగలుగుతారు.
2025-03-13T01:06:00Z