TRIKONA RAJA YOGAM శని ప్రభావంతో ఏర్పడనున్న కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం...! ఇందులో మీ రాశి ఉందా...

Trikona Raja Yogam జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది జూన్ 17వ తేదీన రాత్రి 10:48 గంటలకు శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పరచనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి.

Trikona Raja Yogam జ్యోతిష్యశాస్త్రంలో కేంద్ర త్రికోణ రాజ యోగం అనేది అత్యంత ముఖ్యమైన యోగాలలో ఒకటి. ఏదైనా ఒక గ్రహం ఒక గ్రహంలో (ఒకటో, నాలుగో, ఏడో లేదా పదో స్థానంలో ఉన్నప్పుడు), త్రికోణం (ఒకటో, ఐదో, 9వ స్థానంలో)లో లగ్నం లేదా చంద్రుని రాశిలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. ఈ కేంద్ర త్రికోణ రాజ యోగం సమయంలో కొందరికి అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇదిలా ఉండగా గ్రహాలన్నింటిలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శని దేవుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేసేందుకు సుమారు రెండున్నరేళ్ల సమయం తీసుకుంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికి తన సొంత రాశి అయిన కుంభరాశిలో నివాసం ఉన్నాడు. రాబోయే 2 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేసి, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పరచున్నాడు. ఈ సమయంలో ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి శని తిరోగమనం, కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ సంపద, ఆస్తులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మళ్లీ కొత్త పని చేయడానికి అవకాశం పొందుతారు. ఇందులో కూడా మీరు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి.

Saturn Retrograde in Aquarius కుంభంలో శని తిరోగమనంతో ఈ 4 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!

వృషభ రాశి (Taurus)..

ఈ రాశి వారికి శని దేవుడు ఏర్పరిచే కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. మీ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఉద్యోగులు ఈ కాలంలో మంచి ప్రమోషన్ పొందొచ్చు. మీకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు జీవితంలో చాలా లాభాలను పొందుతారు. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయొచ్చు.

మిధున రాశి(Gemini)..

కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి విశేష ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేయొచ్చు. ఈ ప్రయాణాలు మీకు ఫలవంతంగా అనిపిస్తాయి. శని దేవుని అనుగ్రహంతో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు విదేశాలకు వెళ్లడంలో విజయం సాధిస్తారు. శని తిరోగమనం వల్ల ఈ రాశి వారికి ధన లాభం కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ యోగం కారణంగా మంచి ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీకు నచ్చిన ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది.

ఈ 4 రాశుల వ్యక్తులపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం..! ఇందులో మీ రాశి ఉందా..

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి శని దేవుడు ఏర్పరిచే కేంద్ర త్రికోణ రాజ యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. వ్యాపారులకు ఏదైనా మంచి ఒప్పందాలు ఖరారు కావొచ్చు. కోర్టు సంబంధిత కేసుల్లో మీరు మంచి సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం వల్ల మీకు ధన లాభం కూడా కలుగుతుంది. వ్యాపారులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు.

మకర రాశి (Capricorn)..

ఈ రాశి వారికి శని తిరోగమనం, కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ ఆస్తికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ఎక్కువ డబ్బును పొదుపు చేస్తారు. ఈ కాలంలో మీ సుఖాలు పెరుగుతాయి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-05-26T06:15:57Z dg43tfdfdgfd