పెద్దలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా నలుగురిలో తమను తిడితే ఏలాగో అనిపిస్తుంది.చాలా మంది పేరెంట్స్ తప్పు చేస్తే చాలు ఎక్కడున్నామని చూడకుండా చెడా మడా పిల్లల్ని తిట్టేస్తుంటారు. కానీ ఇది మీ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసా?
ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎంతో ఆరాట పడుతుంటారు. ఇందుకోసం పిల్లలకోసం ఎంత కష్టమైనా చేస్తుంటారు. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని, వారు సరైన మార్గంలో నడవాలని చిన్నప్పటి నుంచే వారిని క్రమశిక్షణతో పెంచుతుంటారు.
కానీ ఈ క్రమశిక్షణ అప్పుడప్పుడు హద్దులు దాటుతూ ఉంటుంది. పిల్లలు ఎదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఒక్కోసారి ఎక్కడలేని కోపాన్ని చూపిస్తూ ఉంటారు.
అందరి ముందూ కోపంతో ఊగిపోతుంటారు. ఒక్కోసారి అయితే ఎవ్వరున్నారని కూడా చూడకుండా వారిపై చేయి చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడకి గురై ఆరోగ్యం దెబ్బతింటుందని ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పిల్లలు ఏదైన తప్పు చేస్తే అందరి ముందు కొట్టడం, అరవడం మంచిది కాదు అనే విషయాన్ని పేరెంట్స్ గ్రహించక పోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లల్లో పెరుగుతున్న డిప్రెషన్..
'ది జర్నల్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్'లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. అందరి ముందు పిల్లలపై అరవడం కానీ, కొట్టడం కానీ చేస్తే వారు ఒత్తిడికి లోనై డిప్రెషన్ లోకి వెళ్తారు. అలాగే పిల్లలు నిరాశ నిస్పృహలకు లోనైన లక్షణాలు కూడా వారిలో కనిపిస్తాయి.
అరిస్తే ఆత్మవిశ్వాసం కోల్పొతున్నారు....
పిల్లలపై అరవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని చైల్డ్ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. బాల్యంలో పిల్లలను ఎక్కువగా తిడితే వారిలో ఆత్మవిశ్వాసం ఉండదు. దీనివల్ల ఆ పిల్లవాడు తన స్నేహితులతో కూడా సరిగ్గా మాట్లాడలేడు.
షాక్ లోకి వెళ్తున్నారు
పిల్లల్ని తల్లి దండ్రులు తిట్టడం కానీ వారిపై గట్టి గట్టిగా అరవడం కానీ చేసే వాళ్లు షాక్ లోని వెళ్లే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనస్తత్వవేత్తల ప్రకారం.. పిల్లలపై అరవడం లేదా వారు పెద్ద శబ్దం విన్నప్పుడు ఒక్కోసారి వారి మెదడు స్తంభించి పోతుంది. కార్టిసాల్, ఆడ్రినలిన్ హార్మోన్లను పెంచే మెదడులోని భాగాలను ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది.
పిల్లలు కోపిస్టిగా మారే అవకాశం ఉంది...
పిల్లల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. దీని వల్ల వారు తొందరగా బాధకు గురై.. వాని చిన్ని మనస్సు గాయపడుతుంది.
ఇలాంటి పరిస్థితిలో బహిరంగ ప్రదేశంలో,అందరి ముందు వారిని తిట్టడంతో వారికి ఒక్కసారిగా కోపం వస్తుంది. దీంతో వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది.
బంధం బలహీనపతుంది...
మీరు మీ పిల్లలను ఇతరుల ముందు తిట్టడం, కొట్టడం లేక వారిపై అరవడం చేయడం వల్ల వారు మిమ్మల్ని చెడుగా భావించే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా మీతో సురక్షితంగా ఉండలేమని కూడా అనుకుంటారు. మీ పైన నమ్మకం పోయి మీ బంధం బలహీన పడే అస్కారం ఉంటుంది.
2024-09-04T07:55:21Z dg43tfdfdgfd