చందమామ (Moon) చాలా అందంగా ఉంటుంది. కానీ మన ఫోన్లలో ఉండే కెమెరాలతో జాబిల్లి అందాలను బంధించలేం. పరిశోధకులు పెద్ద పెద్ద కెమెరాలతో చంద్రుని అందాలను క్యాప్చర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆస్ట్రోఫోటోగ్రాఫర్లు (Astrophotographers) వివిధ యాంగిల్స్‌లో జాబిల్లి ఫోటోలు తీస్తుంటారు. తాజాగా ప్రముఖ కుర్దిష్ ఆస్ట్రోఫోటోగ్రాఫర్ దర్యా కవా మిర్జా (Darya Kawa Mirza), చంద్రున్ని అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఈ ఫోటోల్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా జాబిల్లి మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఇమేజ్‌లు చాలా స్పష్టంగా ఉన్నాయి. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అవుతున్నాయి.
ఇవి తాను తీసిన అత్యంత క్వాలిటీ ఫోటోలు అని మిర్జా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించకుండా తీసిన ఈ పిక్చర్స్‌లో చంద్రుడి ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇంత క్లియరెస్ట్, షార్పెస్ట్ మూన్ ఫోటోలు ఇంతకు ముందు ఎప్పుడూ తీయలేదని ఆయన చెప్పారు.
* ఎంతో కష్టం
ఈ ఫోటోలను తీయడానికి కంప్యూటర్‌ను ఉపయోగించలేదు. చంద్రుడు నాలుగు దశలుగా కనిపించేటప్పుడు వీటిని క్యాప్చర్ చేశారు. వీటిని తీయడానికి మిర్జా చాలా కష్టపడ్డారు. నాలుగు రోజులు నిరంతరం చంద్రుడిని గమనిస్తూ ఫోటోలు తీశారు. ఈ ఫోటోల సైజు 708 గిగాబైట్లు (708GB). రిజల్యూషన్ 159.7 మెగాపిక్సెల్స్. ఇంత పెద్ద సైజు కాబట్టి, ఆ ఫోటోలు చాలా క్లియర్‌గా ఉన్నాయి.
* పెద్ద టెలిస్కోప్
మిర్జా చాలా పెద్ద టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ ఫోటోలు తీశారు. ఆ టెలిస్కోప్ పేరు స్కైవాచర్ ఫ్లెక్స్‌ట్యూబ్ 250P డాబ్సోనియన్. ఈ టెలిస్కోప్‌ను స్థిరంగా ఉంచడానికి NEQ 6ప్రో అనే ఈక్వేటోరియల్ మౌంట్ డివైజ్‌ను ఉపయోగించారు. చంద్రుడి ఉపరితలంలోని ఖనిజాలను చూడటానికి కెనన్ EOS 1200D అనే కెమెరాను, చిన్న చిన్న వివరాలను చూడడానికి ZWO ASI 178mc అనే కెమెరాను ఉపయోగించారు.
* నెటిజన్ల కామెంట్స్
ఫోటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, "చంద్రుడు చూడడానికి ఒక ఫ్లాట్ డిస్క్‌లా ఉంది, దాని మీద కొండలు ఉన్నాయి." అని రాశారు. ఈ ఇమేజ్‌లను చూసిన నెటిజన్లు, తమ అభిప్రాయాలను కామెంట్లలో చెబుతున్నారు. ఫోటోలు ఆశ్చర్యపరిచాయని కామెంట్లు రాశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఈ ఫోటోల గురించి చాలా చర్చ జరిగింది. కొంతమంది ఈ ఫోటోల్లోని రంగులు చంద్రుడి మీద ఉన్న లోహాలు లేదా ఖనిజాల వల్ల వచ్చాయని అనుకున్నారు. కానీ మరొకరు అది నిజం కాదని చెప్పారు. మన కళ్లు చూసే రంగులు అసలు రంగులకు అచ్చంగా ఉండవన్నారు. మనం చూసే వస్తువుల రంగులను మెదడు కొంచెం మార్చి చూపిస్తుందని, అందుకే జాబిల్లి ఉపరితలం మనకు కనిపించేలా ఉండకపోవచ్చని విశ్లేషించారు.
2024-09-05T02:02:04Z dg43tfdfdgfd