ఈ కారణాల వల్లే కూరలు, పచ్చళ్ళలో ఆవాలు వేస్తారు

ఆవాలని మనం రెగ్యులర్‌గా వంటల్లో వేస్తాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

పచ్చళ్ళు, కూరలు, చారు.. ఇలా ఏ వంటైనా వంటల్లో చాలా మంది ఆవాలని వేస్తారు. వీటిని అలా అయినా వేస్తారు. లేదంటే ఆవాలని పిండిలా చేసి దాన్నైనా వాడతారు. దీనికి కారణం.. రుచి మాత్రమే కాదు. ఆవాల్లోని గొప్ప గుణాలు. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి. గుండె ఆరోగ్యం..

ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ పెరుగుతుంది. వీటన్నింటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఆవనూనెతో లాభాలు..​ ​

దగ్గు జలుబు..

ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని తగ్గించడంలో ఆవాలు ముందుంటాయి. అందుకే, రెగ్యులర్‌గా ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలున్నా దూరం పెట్టొచ్చు.

క్యాన్సర్..

ఆవాల్లో కొన్ని గుణాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. దీంతో కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్..

ఆవాల్లో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి కాలేయ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయి.

ఎముకల ఆరోగ్యం..

ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, కచ్చితంగా రెగ్యులర్‌గా వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకోండి.

చర్మ, జుట్టు ఆరోగ్యానికి..

ఆవాల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్ మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-04T06:36:56Z dg43tfdfdgfd