ఏసి నుంచి వచ్చే నీరు వేస్ట్ కాకుండా మొక్కలకి పోయొచ్చా, దీని వల్ల మొక్కలు పెరుగుతాయా, వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

నీరు చాలా విలువైనది. దీనిని కాపాడుకోవడం అందరి బాధ్యత. కానీ, కొంతమంది దీనిని అంతగా పట్టించుకోరు. వృథా చేస్తుంటారు. అలా కాకుండా ఏసి నుంచి వచ్చే నీటిని కూడా ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

ఏసీలు ఇప్పుడు చాలా మంది వాడుతుంటారు. దీని నుంచి ఎంతో కొంత నీరు వేస్ట్‌గా బయటికొస్తుంది. దీనిన కొంతమంది అలానే వేస్ట్ చేస్తారు. మరికొంతమంది దీనిని పొదుపుగా వాడతారు. అసలు దీన్ని ఎలా వాడుకోవాలనే ఆలోచనలో ఒకటే చెట్లకి ఆ నీటిని వాడడం. అదేంటి ఆ నీటిని వాడొచ్చా, చెట్లకి పోయొచ్చా, వీటి వల్ల ఏమవుతుంది, నీటిని నిజంగానే సేవ్ చేసినట్లవుతాందా తెలుసుకోండి.ఎయిర్ కండిషనర్ నీటి లక్షణాలు

ఎయిర్ కండిషనర్ నీరు గాలి శీతలీకరణ ప్రక్రియ ఫలితంగా ఉంటుంది. వెచ్చని, తేమతో కూడిన గాలి ఎయిర్ కండిషనర్ చల్లని కాయిల్స్ గుండా వెళ్లినప్పుడు తేమ ఘనీభవించి నీరుగా సేకరిస్తుంది. ఈ నీరు స్వేదనజలంలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఖనిజాలు, ఇతర మలినాలు లేకుండా ఉంటుంది.

మొక్కలకి వాడితే

ఎయిర్ కండిషనర్ నీటి ప్రధాన లక్షణాలలో ఒకటి లైమ్ స్కేల్ లేకపోవడం. లైమ్ స్కేల్‌ నేలలో, మొక్కల వేళ్ళపై పేరుకుపోతుంది. దీర్ఘకాలిక సమస్యల్ని సృష్టిస్తుంది. ఎయిర్ కండిషనర్ నీటిలో పోషకాలు లేకపోయినా, నేలలో ఉన్న ఖనిజాలను కరిగించి, మొక్కల వేర్లు వాటిని శోషించడానికి అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి, ఈ నీటిని వాడొచ్చు.

వచ్చే సమస్యలు

ఎయిర్ కండిషనర్ నీరు నేలకు అదనపు పోషకాలు అందించదు.

నేలపోషకాలు తక్కువగా ఉంటే, ఈ నీటిని ప్రత్యేకంగా ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు ఉపయోగం ఉండకపోవచ్చు. స్వేదనజలంలానే ఎయిర్ కండిషనర్ నీటిలో కాయిల్స్, ఎయిర్ కండిషనర్ అంతర్గత భాగాల నుండి వచ్చే మలినాలు, దుమ్ము, అచ్చులు, లోహాల వ్యర్థాలు ఉండొచ్చు.

ఇవి పేరుకుపోతే కొన్నిసార్లు మొక్కలకి హానికరం కావొచ్చు.

ఎలా వాడొచ్చు

పోషకాల కొరతని బ్యాలెన్స్ చేయడానికి ఎయిర్ కండిషనర్ నీటిలో తక్కువ మొత్తంలో కుళాయి నీరు, ద్రవ ఎరువులు కలపడం మంచిది. ఈ ప్రక్రియ మొక్కలకి అవసరమైన ఖనిజాలను అందుకునేలా చేస్తాయి. వీటిని వాడేముందు వడపోయడం మంచిది. దీని వల్ల వ్యర్థాలు తగ్గుతాయి. తాగునీటికి ఉపయోగించే వాటిలాంటి ఓ సాధారణ ఫిల్టర్‌ని నీటి నాణ్యతని మెరుగ్గా చేయడానికి వాడొచ్చు.

మొక్కల్ని గమనించడం

ఈ నీరు పోసినప్పుడు మొక్కల్ని గమనించాలి. నీరు మొక్కలకి పడుతుందో లేదో గుర్తించాలి.

మొక్కలు పసుపు రంగులోకి మారినా, సరిగ్గా పెరగకపోయినా నీటిని వాడొద్దు.

ఈ నీటిని వాడడం వృథా కాకుండా చూసుకోవడమే. కానీ, వాడే ముందు గమనించాలి.

2025-06-10T01:23:28Z