ఓరమ్మా నువ్వు : పసుపు నీళ్లతో స్నానం చేస్తే త్వరగా పెళ్లి
సాధారణంగా పసుపు నీటిని శుద్ది చేసేందుకు ఉపయోగిస్తారు. ఏదైనా అవసౌచం వచ్చినప్పుడు శుద్దికి పసుపు నీటిని వాడుతారు. ప్రతి శుభ కార్యానికి ముందు కావలసిన వస్తువు పసుపే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా పసుపు ఉపయోగం మరొకటి ఉందని ప్రముఖ జ్యోతిఫష్యురాలు నిధి చౌదరి తెలిపారు. త్వరగా పెళ్లి కావాలంటే రోజు పసుపు నీటితో స్నానం చేయాలంటూ నిధి మరోసారి వైరల్ అయ్యారు. ఇప్పటికే బ్లౌజ్ లేకుండా లైవ్ లోకి ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ కాగా.. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీశాయి.
జ్యోతిష్యురాలు నిధి చౌదరి మళ్లీ వైరల్ అవుతున్నారు. గతేడాది బ్లౌజ్ లేకుండా లైవ్ లోకి రావడంతో ట్రోల్ అయిన ఆస్ట్రాలజిస్ట్ .. ఇప్పుడు పెళ్లి విషయంలో కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లికాని వారు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న తరుణంలో.. త్వరగా పెళ్లి కావాలంటే ఏంచేయాలో జ్యోతిష్యురాలు నిధి ఏం చేయాలో చెప్పారు. పెళ్లికాని వారు పసుపు నీటితో స్నానం చేస్తే వివాహ ఘడియలు ముందుకొస్తాయని తెలిపారు. నిధి చౌదరి ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసిన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, నిధి చౌదరి రోజూ స్నానపు నీటిలో “ఏక్ చుట్కీ హల్దీ” (చిటికెడు పసుపు) కలిపితే త్వరగా జీవిత భాగస్వామి లభిస్తాడని కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా రుజువైందన్నారు. ఈ చిట్కా పెళ్లి కావడానికి . విజయవంతమైన పరిష్కారంగా ఆమె పేర్కొన్నారు
ఆప్కీ షాదీ హోనే మేం అగర్ దేరీ హో రహీ హై, ... ఔర్ ఆప్ హర్ తరీకే సే ప్రిపేర్ హైన్ షాదీ కర్నే కే లియే....ఆప్ అనేది రెమెడీ కో ఫాలో కర్ సక్తే హై (మీరు ఉన్నప్పటికీ మీ వివాహం ఆలస్యం అవుతుంటే ఈ పరిహారాన్ని అనుసరించవచ్చు)" అని నిధి చౌదరి చెప్పారు. ఈ విషయంపై ట్విట్టర్ వినియోగదారు ఆమెకు కొన్ని ప్రశ్నలు సంధించారు. "మీరు ఈ రెమెడీని ప్రయత్నించారా .. పరీక్షించారా?," అని ఒక ట్విట్టర్ వినియోగదారు అడిగారు. మరొకరు చమత్కరించారు: "పసుపు ఎందుకు? గోబర్ తన మంత్ర ప్రభావాన్ని కోల్పోయిందా?" ఫ్యాషన్ స్టైలిస్ట్ , ఉత్పత్తి సమీక్షలు చేసే యూట్యూబర్‌తో సహా జ్యోతిష్యంపై తనకున్న పట్టును పక్కనపెట్టి నిధి చౌదరి చాలా టోపీలు ధరించింది. అయితే గతేడాది బ్లౌజ్ ధరించకుండా లైవ్ లోకి వచ్చిన వీడియో ట్రోల్ అయింది.
©️ VIL Media Pvt Ltd. 2023-05-23T11:28:02Z dg43tfdfdgfd