కొబ్బరి ఉత్పత్తులను ఏ రకంగా తిన్నా కూడా శరీరానికి బోలెడు బెనిఫిట్స్ అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పోషకాలు సమృద్ధిగా ఉన్న కాయ. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె విలువైనవి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, సహజ ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా కొబ్బరిని ఏ రకంగా చూసుకున్న కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు. కొబ్బరితో కలిగే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
కొబ్బరి నూనెతో చాలా మంది ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు. దంత క్షయం, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను కలిగించే బాక్టీరియాను కొబ్బరి నూనెను పుక్కిలించి తగ్గించుకోవచ్చు. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్, కొవ్వు సమృద్ధిగా ఉండి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కొబ్బరిలో ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడానికి, DNA నష్టం జరగకుండా కాపాడతాయి.
కొబ్బరి నూనెలోని సమృద్ధిగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కీమోథెరపీ వల్ల కలిగే కణాలు చనిపోకుండా కాపాడే అవకాశం ఉంది కూడా. కొబ్బరిలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వయస్సుతో పాటు కలిగే ఎముకల నష్టం నుంచి రక్షిస్తుంది. చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తారు. స్టైల్ కోసం యువతలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…
2025-06-09T16:40:57Z