ఖర్జూరాలని ఇలా తింటే గుండెకి చాలా మంచిది..

ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని నెయ్యిలో నానబెట్టి నెల రోజుల పాటు తింటే అద్భుత లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఖర్జూరాలు, నెయ్యి.. ఈ రెండు కూడా విడివిడిగా ఎన్నో అద్భుత గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే, వీటిని విడివిడిగా కాకుండా నెయ్యిలో ఖర్జూరాలని నానబెట్టి తింటే అదనపు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యం ఉదయం పూట ఖాళీ కడుపుతో నెల రోజుల పాటు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలని తింటే చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..ఖర్జూరాల్లోని పోషకాలు..

ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో..విటమిన్స్మినరల్స్పోషకాలుఫైబర్ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి.

​నెయ్యిలో నానబెట్టి తీసుకుంటే..​

 • నెయ్యిలో నానబెట్టి ఖర్జూరాలు తీసుకుంటే అదనపు పోషకాలు అందుతాయి.
 • ఖర్జూరాల్లో విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, ఎ1 లు ఉంటాయి.
 • వీటితో పాటు ఖర్జూరంలో కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.
 • ఖర్జూరాలని నెయ్యిలో నానబెట్టి తినడం వల్ల అవన్నీ అందుతాయి.

శక్తి..

ఖర్జూరాల్లో గ్లూకోజ్, శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఖాళీ కడుపుతో తింటే మన శరీరానికి శక్తినిచ్చి అలసటని తగ్గిస్తాయి.వీటితో పాటు..బీపిని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.

జీర్ణక్రియ..

నేడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ జీర్ణక్రియ. జీర్ణ సమస్యలు రావాడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే, మంచి హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే ఆ సమస్యలు దూరమవుతాయి. ఏం జరుగుతుందంటే..నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే..పేగుల కదలిక సరిగ్గా ఉంటుంది. జీర్ణక్రియ మెరగువుతుంది. పేగు ఆరోగ్యం మెరుగు పడుతుంది.

గుండెకి..

 • ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియం మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
 • ఖర్జూరాల్లోని పొటాషియం బీపిని కంట్రోల్ చేస్తుంది.
 • మెగ్నీషియం కంటెంట్ గుండె కండరాల సపోర్ట్‌ని ఇస్తుంది.
 • ఖర్జూరాన్ని రెగ్యులర్‌గా తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 • గుండె సమస్యలు రావు.

ఎముకల ఆరోగ్యానికి..

 • ఖర్జూరాల్లోని కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
 • ఇవి ఫూచర్‌లో ఎముకల సమస్యలు రాకుండా చేస్తాయి.
 • ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
 • ఖర్జూరాలతో పాటు నెయ్యిని కలిపి తీసుకుంటే ఎముకల సాంద్రతకి చాలా మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-09T09:59:41Z dg43tfdfdgfd