చెప్పులు లేకుండా నడిస్తే ఏమౌతుందో తెలుసా?

కొంతమంది చెప్పులతో నడిస్తే.. ఇంకొంత మంది షూస్ వేసుకుని నడుస్తున్నారు. ఏదేమైనా నడక మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చెప్పులు, షూస్ కాకుండా వట్టి కాళ్లతోనే నడిస్తే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుకునే ఉంటారు. అయితే బూట్లు లేదా చెప్పులు ధరించకుండా నేలపై నడవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా నడిచే పద్ధతిని గ్రౌండింగ్ అని కూడా అంటారు. ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి శక్తితో కనెక్ట్ అయి శరీరం విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరించగలరని నమ్ముతారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

కాళ్లు బలోపేతం 

చెప్పులు లేకుండా నడిస్తే మన పాదాల కండరాలు, స్నాయువులు బలోపేతం అవుతాయి. అలాగే దిగువ వీపుకు కూడా మద్దతు లభిస్తుంది. చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు మన పాదాల స్థానం మెరుగ్గా ఉంటుంది. ఇది చీలమండలపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే తుంటి, మోకాళ్లు, వెనుక భాగంలో నొప్పి కలగదు. 

 

ఒత్తిడి తగ్గింపు 

గ్రౌండింగ్వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే మన మెదడు ఉత్తేజకరంగా మారుతుంది. ఇది స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గిస్తుంది. పాదాల కింద ప్రకృతిని అనుభూతి చెందడం వల్ల మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

 

ఇంద్రియ నరాలు సక్రియం

మనం బూట్లు  లేదా చెప్పులు వేసుకుని నడిచినప్పుడు మన పాదాల ఇంద్రియ నరాలు తక్కువ చురుగ్గా ఉంటాయి. కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాల ఇంద్రియ నరాలు సక్రియం అవుతాయి.  అలాగే మన శరీరం మరింత అప్రమత్తంగా ఉంటుంది.

మంచి నిద్ర

చెప్పులు లేకుండా నడవడం వల్ల మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మన శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది. అలాగే హాయిగా, ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే మంచి నిద్ర కోసం గ్రౌండింగ్ సాధన చేయండి. 

 

చెప్పులు లేకుండా కాళ్లకు గాయాలు కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

నడకను మెల్లగా మొదలు పెట్టండి. ఎందుకంటే పాదాలు మృదువుగా ఉంటాయి. అలాగే మీ పాదాలు బూట్లు లేకుండా నడవడానికి అలవాటు పడతాయి.

రోజుకు 10 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేయండి. ఉన్నపాటుగా చెప్పులు లేకుండా ఎక్కువ సేపు నడవకండి. గాయాలు అవుతాయి. 

పరిశుభ్రమైన ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవండి. మురికి ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.

కాళ్లను బలోపేతం చేయడానికి రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. దీంతో మీ పాదాల కండరాలు బలపడతాయి. 

2023-11-19T04:38:05Z dg43tfdfdgfd