విశాఖలో గంగమ్మ తల్లికి మత్స్యకారులు ఘనంగా పూజలు నిర్వహించారు. సముద్రంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఏప్రిల్ 14 నుండి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరు. జూన్ 15 చేపల వేటకు వెళ్లే ముందు మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు తమను చల్లగా కాపాడు, తిరిగి వచ్చేలా చూడమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా గంగమ్మ తల్లికి పూజలు చేసి సముద్రంలోకి వేటకు వెళ్తే తమను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తుందని మత్స్యకారులు అంటున్నారు. తాము ఎక్కడికి వెళ్లినా గంగమ్మ తల్లి తోడు ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల వేటకు వెళ్తామని చెబుతున్నారు.
ఇప్పటికే మత్స్యకారులు బోట్లు అన్ని సిద్ధం చేసుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత బోటు సముద్రంలోకి వేటకు వెళ్తుంది. అమ్మవారిని దర్శించుకుని వెళితే మత్స్యకారులకు మత్స్య సంపద పెరిగి వారి జీవనానికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని, మత్స్యకారులకు అపారమైన నమ్మకం. అందుకే క్రమం తప్పకుండా ప్రతి ఏటా అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేస్తారు.
ఇది కూడా చదవండి: కొండపై నుంచి వందల ఏళ్లుగా జలధార... నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీనే
గంగమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత సంవత్సరం అంతా కూడా తమకు ఎటువంటి భయంకరమైన తుఫానులు కూడా రావని అంటున్నారు. తీరం పక్కనే తాము జీవితం సాగిస్తూ ఉంటాము. ఎక్కువగా తుఫాను వచ్చినా, సునామీలు వచ్చినా ముందుగా తమ ప్రాణాలు కోల్పోతామని అంటున్నారు. అందువలన సునామీ ఉగ్రరూపం దాల్చకుండా, వేటకు వెళ్లిన తమ మత్స్యకారులు సురక్షితంగా బయటకు రావాలని ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లికి పూజలు చేస్తామని అంటున్నారు.
ఇది కూడా చదవండి: బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు ఇవే... మీరూ చూసెయ్యండి మరి
గంగమ్మ తల్లి గుడికి వెళ్లి ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసిన తర్వాత వేటకు వెళ్లి చేపలు తెస్తారని అంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తామని అంటున్నారు.
2025-06-10T12:57:54Z