ఛార్మినార్ దగ్గర మల్బరీ క్రీమ్ బౌల్ రుచి చూశారా..? లేదంటే తప్పకుండా చూడండి

Dastagir Ahmed, News18, Hyderabad

భాగ్యనగరం అంటే ఓ ముత్యాల నగరంగా చెప్పుకోవచ్చు. గొప్ప సంస్కృతి, వారసత్వం, రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. రంజాన్ (Ramzan) సందర్భంగా, ఓల్డ్ సిటీ వీధులు రంగురంగుల లైట్లతో అలంకరించబడి ఉంటాయి. సిటీ మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా మారుతుంది. ప్రజలు షాపింగ్ చేయడానికి, నోరూరించే రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి మార్కెట్‌లకు తరలివస్తారు. ఐకానిక్ చార్మినార్ హైదరాబాద్ (Hyderabad) ‌కు గుండెకాయ లాంటిది. చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్ సాంప్రదాయ దుస్తులు, గాజులు, నగలు, సెంట్లకు ప్రసిద్ధి చెందింది. రంజాన్ లాంటి ప్రత్యేక రోజుల్లో అయితే మార్కెట్ అర్థరాత్రి వరకు తెరిచి ఉంటుంది. పప్పు, సుగంధ ద్రవ్యాలు, మాంసం వంటకాలు, ప్రసిద్ధ హలీమ్ ‌తో సహా వివిధ రకాల ఆహార పదార్థాలను ఇక్కడ టేస్ట్ చేయొచ్చు.

ఇక, నిత్యం సందడిగా ఉండే హైదరాబాద్‌ నగరంలో కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే, కొన్ని ప్రదేశాలలో దొరికే డిష్, రుచి ప్రపంచంలో మరెక్కడా దొరకదని చెప్పుకుంటుంటారు ఫుడ్ లవర్స్. ఉదాహరణకు హైదరాబాద్ బిర్యానీ సిటీ మొత్తం హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికినా కొన్ని చోట్ల బిర్యానీకి ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది.

ఇది చదవండి: బంగారమ్మ మురుకులకు ఫిదా అవ్వాల్సిందే..!

అలాంటిదే ఈ మల్బరీ క్రీమ్ బౌల్ కూడా. హైదరాబాద్ ‌లో ని ప్రముఖ జ్యూస్ బార్ ‌లు అందించే స్వీట్ క్రీమ్ బౌల్స్ ‌లో దాదాపుగా మొత్తం మల్బరీలను జోడించి బెస్ట్ టేస్ట్ అందిస్తారు. ఇక్కడకి వచ్చే కస్టమర్లు అక్టోబర్ నుండి నవంబర్ వరకు, మార్చి నుండి మే వరకు కాలానుగుణ ఈ స్పెషల్ డ్రింక్ ఆర్డర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. జ్యూసి కలర్, టెక్స్చర్, ఫ్లేవర్ ‌తో కూడిన రిచ్, సెమీ ఫ్రోజెన్ మిల్క్ బేస్ డ్రింక్ వేసవి నుండి వింటర్ వరకు హైదరాబాద్ ‌లో ఏ రోజు అయినా ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

2023-05-26T02:27:02Z dg43tfdfdgfd