పిల్లలు పుట్టకూడదని మాత్రలు వేసుకుంటున్నారా?.. గుండెపోటు పక్కా!.. విస్తుగొలిపే నిజాలు..
Birth Control Risks: సాధారణంగా మహిళలు గర్భం రాకుండా కుటుంబ నియంత్రణ (Birth Control) పద్ధతులు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలా రకాల గర్భనిరోధక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని పద్ధతులపై ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి. డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని రకాల హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్‌ను (Hormonal contraceptives) వాడితే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ‘ది BMJ’ అనే జర్నల్‌లో ఈ స్టడీ ఫలితాలు పబ్లిష్ అయ్యాయి. ఇందులో భాగంగా దాదాపు ఇరవై లక్షల మంది మహిళల్ని పరిశీలించారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ కలిగిన గర్భనిరోధకాలు (Contraceptives) వాడేవాళ్లకి రిస్క్ ఎక్కువని తేల్చారు. స్టడీ ఏం చెబుతోంది?1996 నుంచి 2021 వరకు డెన్మార్క్‌లో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్ల మెడికల్ రికార్డులు స్టడీ చేశారు. అందులో ముఖ్యంగా హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడేవాళ్లపై ఫోకస్ పెట్టారు. అంటే కంబైన్డ్ ఈస్ట్రోజెన్-ప్రోజెస్టిన్ పిల్స్ (ఇవే చాలామంది వాడేది), వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచ్‌లు, ప్రోజెస్టిన్-ఓన్లీ పిల్స్, ఇంట్రా యుటెరైన్ డివైజ్‌లు (IUDs), ఇంప్లాంట్స్, ఇంజెక్షన్లు వంటి వాటన్నిటినీ స్టడీ చేశారు. అయితే రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లని, సైకియాట్రిక్ మెడిసిన్ లేదా హార్మోన్ థెరపీ తీసుకునేవాళ్లని ఈ స్టడీ నుంచి తప్పించేశారు. ఇస్కీమిక్ స్ట్రోక్, గుండెపోటు కేసులు రికార్డ్ చేశారు. వయసు, చదువు, హైబీపీ, డయాబెటిస్ లాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈస్ట్రోజెన్ ఉన్న గర్భనిరోధకాలతో రిస్క్ఈ స్టడీలో ఈస్ట్రోజెన్ ఉన్న గర్భనిరోధకాలు, ముఖ్యంగా వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచ్‌ల వల్ల రిస్క్ బాగా ఎక్కువని తేలింది. రిస్క్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కంబైన్డ్ ఈస్ట్రోజెన్-ప్రోజెస్టిన్ పిల్స్వీటి వల్ల స్ట్రోక్, గుండెపోటు రిస్క్ రెట్టింపు అయింది. అంటే ఈ పిల్స్ ఏడాది వాడితే 4,760 మంది మహిళల్లో ఒకరికి స్ట్రోక్, 10,000 మందిలో ఒకరికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. వెజైనల్ రింగ్స్, ఇతర గర్భనిరోధకాలువీటి వల్ల స్ట్రోక్ రిస్క్ 2.4 రెట్లు, గుండెపోటు రిస్క్ 3.8 రెట్లు పెరిగింది. అలాగే స్కిన్ ప్యాచ్‌ల వల్ల స్ట్రోక్ రిస్క్ 3.4 రెట్లు పెరిగింది. ప్రోజెస్టిన్-ఓన్లీ కాంట్రాసెప్టివ్స్ (పిల్స్, ఇంప్లాంట్స్, ఇంజెక్షన్లు) వంటి వాటితో రిస్క్ కొంచెం పెరిగినా, ఈస్ట్రోజెన్ ఉన్న వాటితో పోలిస్తే తక్కువే. ప్రోజెస్టిన్-ఓన్లీ IUDs ఒక్కటే రిస్క్ పెంచని గర్భనిరోధకాలుగా తేలాయి. అంటే ఇవి కాస్త సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలురిస్క్ తక్కువే అయినా, హార్మోన్ల గర్భనిరోధకాలు (హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్) రాసే ముందు డాక్టర్లు ఈ విషయాలను కూడా ఆలోచించాలని స్టడీ చెబుతోంది. అయితే ఎంతకాలం గర్భనిరోధకాలు వాడారనే దాన్ని బట్టి రిస్క్ మారలేదు. తక్కువ కాలం వాడినా, ఎక్కువ కాలం వాడినా రిస్క్ ఒకేలా ఉంది. ఈ రిస్క్‌లు చాలా తక్కువైనా, చాలామంది మహిళలు హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారు కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే అని స్టడీ చేసినవాళ్లు అంటున్నారు. స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన థెరిస్ జోహన్సన్ మాట్లాడుతూ.. రోజుకి లక్షల మంది మహిళలు ఈ గర్భనిరోధకాలు వాడుతున్నారు కాబట్టి, రిస్క్‌లను జాగ్రత్తగా అంచనా వేయడం చాలా ముఖ్యం అని అన్నారు. ఇది కేవలం అధ్యయనం మాత్రమే. అంటే ఇది డైరెక్ట్‌గా ఆయా ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతుందని అని చెప్పలేం. కానీ కొన్ని హార్మోన్ల గర్భనిరోధకాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయనే వాదనలకు మరింత బలం చేకూరింది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.
2025-02-15T09:58:52Z
ఆ గ్రహ మార్పుతో ఈ రాశులవారు శృంగారంలో రెచ్చిపోతారు.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి!
శుక్ర గ్రహం ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్నున్నప్పుడు తప్పకుండా శృంగార భావనలను, సుఖ సంతోషాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషభ రాశిలో ఉన్న గురువుతో పరివర్తన చెందినందువల్ల శుక్ర గ్రహం కొన్ని రాశుల వారికి భారీగా సుఖ సంతోషాలను అనుగ్రహించే అవకాశం ఉంది. ఈ శుక్రుడు కొన్ని రాశులవారి మనసుల్లో ప్రేమ భావనలను రేకెత్తించడంతో పాటు ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు ప్రేరేపించే అవకాశం ఉంది. శుక్రుడు అనుగ్రహించే రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు. మకరం. కొత్త ప్రేమికులు, కొత్త దంపతులు ఈ సమయంలో ప్రేమ యాత్రలకు ప్లాన్ చేసుకునే పక్షంలోహ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. వృషభంఈ రాశిలో ఉన్న గురువుతో లాభ స్థానంలో ఉచ్ఛలో ఉన్న శుక్రుడు పరివర్తన చెందడం వల్ల ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు బాగా అవకాశం ఉంది. ఈ నెల 14 మొదలుకుని ఈ నెలాఖరు వరకు వీరు ఎప్పుడు ప్రేమ యాత్రలు చేసినా గరిష్ఠ స్థాయిలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఈ రాశివారు ప్రేమ యాత్రలకు ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్లడం మంచిది. కొత్త దంపతులు కూడా సరికొత్తగా ప్రేమ యాత్రలు చేయడం దాంపత్య జీవితానికి మేలు చేస్తుంది. మిథునంఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ప్రేమ భావనలు, శృంగార భావనలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. వీరు కొండ ప్రాంతాలను, హిల్ స్టేషన్లను తమ ప్రేమ యాత్ర లకు ఎంపిక చేసుకోవడం వల్ల బాగా ఆనందం పొందుతారు. ఈ నెల 14 నుంచి నెలాఖరు వరకు వీరికి ప్రేమ వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంది. ప్రేమ యాత్రల సందర్భంగా ప్రేమ భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కర్కాటకంఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్ర సంచారం జరుగుతుండడం, అది లాభ మస్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరికి ప్రేమ యాత్రలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుక్రుడితో పాటు, గురువు అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తున్నందువల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఈ రాశివారు తమ ప్రేమ యాత్రకలు, విహార యాత్రలకు జల, జలపాత ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం వల్ల అన్ని విధాలుగానూ ఉపయోగం ఉంటుంది. కన్యఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరు చేసే ప్రేమ యాత్రలు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతాయి. ప్రేమికుల మధ్య, యువ దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెంపొందుతాయి. ఈ రాశివారు ఈ నెలాఖరులోగా రెండు మూడుసార్లు ప్రేమ యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి చెందినవారు సాధారణంగా కొండ ప్రాంతాలకు, ఎత్తయిన ప్రాంతాలను వెళ్లడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ధనుస్సుఈ రాశివారికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో సంచారం చేస్తున్నశుక్రుడు తప్పకుండా ప్రేమ యాత్రలకు అవకాశం కలిగిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శృంగార సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు ప్రేమ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశివారు తీర ప్రాంతాలను, అటవీ ప్రాంతాలను తమ ప్రేమ యాత్రలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠ స్థాయిలో హ్యాపీగా గడపడం జరుగుతుంది. మకరంఈ రాశిలో మూడవ స్థానం ఉన్న శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెంద డం వల్ల ఈ రాశికి చెందిన ప్రేమికులు, కొత్త దంపతులు అనేక పర్యాయాలు ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ నెల 14 నుంచి వీరి ప్రేమ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ యాత్రల విషయంలో ఈ రాశివారు సరికొత్త, వినూత్న ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వీరు జల పాతాలు, లోయ ప్రాంతాలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠంగా సుఖ సంతోషాలు పొందగలుగుతారు.
2025-02-15T11:13:55Z
ఈ యువతి టాలెంట్ వేరే లెవెల్.. కుంచెతో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రావ్య..!
పేపర్ పై సాధారణమైన బొమ్మలు గీయాలంటేనే ఎంతో సాధన చేస్తే కానీ చాలా కష్టం. అలాంటిది ఒక మనిషి రూపాన్ని గీయడం అంటే మాటలు కాదు. అట్లాంటిది ఫోటోలో కనిపిస్తున్న చిన్న పుట్టుమచ్చను కూడా పోనీయకుండా బొమ్మలను అద్భుతంగా గీస్తుంది ఈ యువతి. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ మీద ఉన్న బొమ్మను చూస్తే కలర్ జిరాక్స్ తీసుకున్నట్టే ఉంటున్నాయి. ఇంత అద్భుతమైన బొమ్మలు వేయడమే కాకుండా ఈ బొమ్మల ద్వారా సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది శ్రావ్య. మంచిర్యాల జిల్లా బలరావ్ పల్లి గ్రామానికి చెందిన శ్రావ్య డిగ్రీ వరకు చదువుకుంది. శ్రావ్యకి చిన్న వయసు నుండే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. కాలి సమయం దొరికిందా పెన్సిల్ పేపర్ పట్టి బొమ్మలు గీస్తూ ఉంటుంది. సరదాగా ఆమె వేసిన బొమ్మలు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. శ్రావ్య ఏకలవ్యుడిలా ఎవరూ తనకు నేర్పకుండానే స్వతహాగా ఆర్ట్ వేయడం నేర్చుకుంది. అలా నాలుగేళ్ళు పెన్సిల్ తో సాధన చేసి చివరికి సాధించింది. ఇప్పుడు ఎవరి ఫోటో ఇచ్చినా చకచకా అచ్చు గుద్దినట్టే గీసేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడానికి అమ్మ నాన్న ఆదర్శం అని శ్రావ్య తెలిపింది. నాన్న సమల వెంకటేష్, ఎలక్ట్రిషియన్ గా పని చేస్తారు.. అమ్మ లక్ష్మి ఇంటివద్దే ఉంటుంది. నాన్న బొమ్మలు గీసేవాడు, అమ్మ కార్టూన్ బొమ్మలు గీసేది. అలా వాళ్ళను చూసి నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగిందని శ్రావ్య తెలిపింది. గంటల తరబడి బొమ్మలు వేస్తూ ఉన్నా వారు నుండి వచ్చే సహకారం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రుల నుండి అంతటి సహకారం ఉంది కాబట్టే తాను ఆర్టిస్ట్ గా రాణించగలుగుతున్నానని శ్రావ్య తెలిపింది. శ్రావ్య పలు రకాల ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్, గ్రాఫైట్, చార్కోల్, పెయింటింగ్, పాస్టర్స్, ఆయిల్ పెయింటింగ్, కంకరచుల, ఇలా వివిధ రకాలుగా ఆర్ట్ వేస్తుంది. వీటితో పాటు వాల్ పెయింటింగ్ కూడా వేస్తుంది. దీనికి ఫోటో డిజైనింగ్, సింగిల్ డబుల్, ఫ్యామిలీ ఇలా ఫోటోను బట్టి ఉంటుందని తెలిపింది శ్రావ్య. శ్రావ్య లోకల్ 18 తో మాట్లాడుతూ భవిష్యత్తులో ఆర్టిస్ట్ రాణించాలనేది తన లక్ష్యమని తెలిపారు. అంతే కాకుండా ఆర్ట్ విషయంలో ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. చిన్నారులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటానని.. దీనిని త్వరలో ప్రారంభిస్తానని అంటోంది. శ్రావ్య తో మీ ఫోటోలను బొమ్మ గీయించుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి సంప్రదించండి. 7674037711
2025-02-15T13:44:15Z
Fake Eggs: నకిలీ గుడ్లు తింటున్నారా బకెట్ తన్నేయడం పక్కా.. కొనేముందే ఇలా గుర్తించండి!
Fake Eggs: గుడ్లు (Eggs) ఆరోగ్యానికి చాలా మంచివి. దీంట్లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి. అందుకే ఎగ్స్‌ను సూపర్ ఫుడ్ అంటారు. రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గుడ్లలో ఉండే హైక్వాలిటీ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటివన్నీ బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి, మజిల్ పవర్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ మధ్య చాలా ప్రాంతాల్లో నకిలీ గుడ్లు (Fake Eggs) అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి తింటే డేంజర్లో పడ్డట్లే. ఇవి ఒరిజినల్ ఎగ్స్‌లానే ఉంటాయి. చూడగానే వాటిని గుర్తించడం చాలా కష్టం. అయితే కొన్ని తేడాల ద్వారా వీటిని ఐడెంటిఫై చేయవచ్చు. గుడ్డు పెంకు ఆకారంసాధారణ గుడ్లతో పోలిస్తే నకిలీ గుడ్డు పెంకు మెరుస్తుంటుంది. వాటి షేప్ యూనిఫార్మ్‌గా ఉంటుంది. పెంకుపై గోటితో తడితే.. ప్లాస్టిక్ లాంటి శబ్దం వస్తుంది.* క్రాక్ టెస్ట్‌నిజమైన గుడ్లను పగలగొట్టినప్పుడు స్ట్రాంగ్ టెక్చర్ ఉన్న, బాగా ఏర్పడిన పచ్చసొన కనిపిస్తుంది. అదే నకిలీ గుడ్లలో (Fake Eggs) అయితే, రబ్బరు లేదా అతి గట్టిగా ఉండే పచ్చసొన ఉంటుంది. తెల్లసొన కన్‌సిస్టెన్సీ తేడాగా అనిపిస్తుంది. వాసననిజమైన గుడ్లను పగలగొడితే.. నీచు వాసన వస్తుంది. అదే నకిలీవైతే ప్లాస్టిక్ లేదా కెమికల్ స్మెల్ ఉంటుంది.* వాటర్ టెస్ట్‌ఒరిజినల్ ఎగ్స్‌ను నీళ్లలో వేస్తే, ఫ్రెష్ ఎగ్స్ మునుగుతాయి, పాడైపోయినవి తేలుతాయి. కానీ నకిలీవి అయితే ఎలా ఉన్నా ఆర్టీఫీషియల్ కంపోజిషన్ వల్ల పూర్తిగా మునిగి పోతాయి. కుకింగ్ బిహేవియర్‌ఉడికించిన తర్వాత కూడా ఎగ్‌వైట్ నీరులా కారుతుందంటే అది నకిలీ గుడ్డు (Fake Eggs). అలాగే గిలకొట్టినప్పుడు పచ్చసొన చాలా సులభంగా ఎగ్ వైట్‌తో కలిసిపోతుంది. నేచురల్ ఎగ్‌లో అయితే అంత ఈజీగా మిక్స్ కాదనే విషయం తెలిసిందే. ఫేక్ ఎగ్స్ చాలా డేంజర్నకిలీ గుడ్లను (Fake Eggs) తింటే ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. టాక్సిక్ కెమికల్స్ కారణంగా ఇబ్బందులు తప్పవు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. వీటిలో ఉపయోగించే బెంజోఫీనోన్ వంటి రసాయనాలు నర్వస్ సిస్టమ్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. తెలియకుండా వీటిని తింటూ ఉంటే, లివర్, కిడ్నీ చెడిపోతాయి. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలుఫేక్ ఎగ్స్ (Fake Eggs) ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మకం ఉండే వెండర్స్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. కుదిరితే దగ్గర్లో ఉండే ఫామ్స్ నుంచి నేరుగా తెచ్చుకోవడం మంచిది. గుడ్ల రంగు, సైజు, ఆకారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత క్రాక్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసి చూడాలి. ఎప్పటికప్పుడు వీటిపై అవగాహన పెంచుకోవాలి. మీ చుట్టుపక్క ఇలాంటి ఘటనలేమైనా వెలుగులోకి వచ్చాయేమో వార్తల ద్వారా తెలుసుకోవాలి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.
2025-02-15T04:28:48Z
యాలకులు కొనడం మానేయండి.. ఇలా ఇంట్లో కుండీలోనే పెంచుకోండి
మనలో చాలా మందికి ఇంటి పెరట్లో, టెర్రస్ పైన, గార్డెన్‌లో పూల మొక్కలు, క్రోటాన్స్, మనీ ప్లాంట్స్ పెంచుకోవడంతో పాటు కూరగాయలు, ఇతర పండ్ల మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది. అయితే మసలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు ఇంట్లో, పెరట్లో పెంచవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే సుగంధ ద్రవ్యాల్లో యాలకుల మొక్కలు ఇంటి ఆవరణలోనే పెంచువచ్చు. మీరు మార్కెట్ నుండి మొక్కలను తీసుకురావడం ద్వారా యాలకులను పెంచవచ్చు. ఇది కాకుండా మీరు విత్తనాల సహాయంతో మొక్కలను కూడా సులభంగా పెంచవచ్చు. మంచి నర్సరీ నుండి విత్తనాలు కొనండి, లేకుంటే మీ శ్రమ వృధా అవుతుంది. మార్కెట్ నుండి తెచ్చిన విత్తనాలను ఒక చెంచా నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచండి. తరువాత ఒక గిన్నె సిద్ధం చేసుకోండి. మీ కుండ చాలా పెద్దదిగా లేదా చాలా చిన్నదిగా ఉండకూడదు. 20 రూపాయలకు, మీకు సరైన సైజులో ఒక ప్లాస్టిక్ కుండ లభిస్తుంది. ఒక కుండలో సగం ఎర్ర మట్టి , సగం నల్ల మట్టి కలపండి. తరువాత ఈ మట్టికి కోకోపీట్ , ఆవు పేడ కలపండి. ఈ వస్తువులన్నింటినీ బాగా కలపండి. నేలపై నీటిని చల్లండి. తరువాత విత్తనాలను మట్టిలో వేయండి. మొక్కలు మొలకెత్తడానికి 5 నుండి 7 రోజులు పట్టవచ్చు. మొక్క మొలకెత్తిన తర్వాత వాటిని పాడు చేయవద్దు. ఉదయం , సాయంత్రం నీటిని పిచికారీ చేయాలి. 30 నుండి 40 రోజుల తర్వాత మొక్కలు బాగా మొలకెత్తుతాయి. ప్రతి ఉదయం 2 నుండి 3 గంటలు యాలకుల మొక్కను ఎండలో ఉంచడం ముఖ్యం. మొక్కలు మొలకెత్తిన తర్వాతే కుండను ఎండలో ఉంచాలి. విత్తనాలు నేలలో ఉన్నంత కాలం, వాటిని ఎండలో ఉంచకూడదు, నీడలో ఉంచాలి. యాలకుల మొక్క ఫలాలు కాసేందుకు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే యాలకులుగా మారేందుకు ఆ టైం తీసుకుంటుంది. ఈ సమయంలో మీరు మొక్కను ఎండిపోకుండా, చనిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
2025-02-15T03:29:02Z