పాలు లేని గ్రామాలుండొచ్చు.. మద్యం లేని పల్లెలు లేవు

దుబ్బాక, జూలై 8 : ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక మద్యం సీసాలపైనా ఎర్రటి అక్షరాలతో హెచ్చరిక ఉన్నప్పటికీ ఇదేమి మందుబాబులు పట్టించుకోవడం లేదు. పాలు లేని గ్రామాలైన ఉండోచ్చు కానీ మద్యం లేని పల్లెలు లేకపోవడం గమనార్హం. పాల కంటే లిక్కరు తాగేందుకు మందుబాబులు ఆసక్తి చూపిస్తున్నారు. అన్నం లేకున్నా.. అప్పులు చేసైనా ..మందు వాసన చూడకుండా ఉండలేమని మద్యానికి వ్యసనపరులుగా మారుతున్నారు. రోజురోజుకూ గ్రామాల్లో మద్యానికి బానిసలుగా మారి అప్పులపాలవుతున్నారు. గతంలో పట్టణాల్లో మాత్రమే మద్యం దుకాణాలు ఉండేవి. ఇప్పుడు పల్లెల్లో సైతం బెల్టు దుకాణాలు వెలిశాయి. పాలు అందుబాటులో లేకున్నా… మద్యం మాత్రం మారుమూల పల్లెలో సైతం లభిస్తుంది.

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం విక్రయం. ప్రజా ఆరోగ్యాన్ని మరిచి ప్రభుత్వ ఖజానకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా నూతన మద్యం పాలసీలు ప్రవేశపెడుతున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. మద్యం విక్రయాలను ప్రోత్సహించేందుకు ఆబ్కారి శాఖ అధికారులు నిబంధనలను పక్కన బెడుతున్నారు. జనాభా ఆధారంగా వైన్సు దుకాణాలతోపాటు బార్‌లను పెంచేశారు. గతంలో మండలకేంద్రాల్లో మాత్రమే మద్యం లభించేది. ఇప్పుడు పల్లెల్లో మద్యం సీసాలకు కొదవలేకుండా పో యింది. బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వైన్స్‌ నిర్వాహకులు గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో మద్యం బాటిళ్లు డెలివరీ చేస్తూ.. విక్రయాలు జోరుగా నిర్వహిన్నారు. కిరాణ దుకాణాల్లో, కల్లు దుకాణాల్లో మద్యం సీసాలు విక్రయిస్తున్నారు.

2024-07-08T18:45:52Z dg43tfdfdgfd