పిల్లల కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? బెస్ట్ ఆప్షన్స్, తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే..!

Investments: పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారి పేరుతో పెట్టుబడులు పెడుతుంటారు. పిల్లల చదువు, పెళ్లి, కెరీర్‌ కోసం ముందు నుంచే మనీ సేవ్‌ చేస్తుంటారు. వివిధ రకాల ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అయితే మైనర్ల పేరు మీద మనీ ఇన్వెస్ట్‌ చేసే ముందు, పేరెంట్స్ కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోక తప్పదు.

* మైనర్ పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చా?

18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్లు హోల్డ్‌ చేయలేరు. అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి తరఫున ఇన్వెస్ట్‌మెంట్స్‌ మెయింటెన్‌ చేయవచ్చు. పెట్టుబడులు పిల్లలవి, కానీ బిడ్డకు 18 సంవత్సరాలు వచ్చే వరకు గార్డియన్‌ వాటిని పర్యవేక్షిస్తారు.

* గార్డియన్‌ రోల్

తల్లిదండ్రులు సాధారణంగా నేచురల్‌ గార్డియన్స్‌. వారు లేకపోతే, కోర్టు నియమించిన గార్డియన్‌ అవసరం. ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి పిల్లల భర్త్‌ సర్టిఫికెట్‌, పిల్లలతో గార్డియన్‌ రిలేషన్‌ తెలిపే ప్రూఫ్‌ అవసరం. గార్డియన్ బ్యాంక్ వివరాలు, పాన్ కార్డ్, KYC డాక్యుమెంట్స్‌ కూడా అందజేయాలి. అకౌంట్‌ పిల్లల పేరు మీద మాత్రమే ఉంటుంది, జాయింట్‌ అకౌంట్‌ కాదు. దీనికి నామినీలు కూడా ఉండకూడదు. బిడ్డకు 18 ఏళ్లు నిండినప్పుడు, అకౌంట్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. ఆ టైమ్‌లో పాన్ కార్డ్, KYC డాక్యుమెంట్లు అందించాలి. అకౌంట్‌ సిగ్నేచర్‌ అప్‌డేట్‌ చేయాలి, భవిష్యత్తు లావాదేవీల కోసం సొంత బ్యాంకు అకౌంట్‌ని లింక్ చేయాలి.

* పిల్లల కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు

- సుకన్య సమృద్ధి యోజన (SSY)

ఈ ప్రభుత్వ పథకంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరిట అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. కుటుంబంలో ఇద్దరు కుమార్తెలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అమ్మాయి చదువు లేదా పెళ్లి కోసం పొదుపు చేయవచ్చు. ఈ అకౌంట్‌పై మంచి వడ్డీ రేటు ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్లు నిండే వరకు ఫండ్స్‌ లాక్‌ అయి ఉంటాయి. లేదా 18 ఏళ్లు నిండాక విద్య వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు.

- గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్

బంగారు ఆభరణాలను కొనడానికి బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్స్‌(SGB)లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇవి ప్రభుత్వ మద్దతుగల బాండ్లు. అవి వడ్డీని అందిస్తాయి, మెచ్యూరిటీ సమయానికి మార్కెట్‌ రేటుకు గోల్డ్‌ యూనిట్లు అమ్ముకోవచ్చు. అలానే గోల్డ్ ETFలు, గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్‌ కూడా ఫిజికల్‌ గోల్డ్‌కి మంచి ఆల్టర్నేటివ్‌. వీటిని గార్డియన్‌ కంట్రోల్‌ చేయాలి.

- స్టాక్స్

మైనర్లు గార్డియన్‌ ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల పేరు మీద 3-ఇన్-1 అకౌంట్‌ (సేవింగ్స్‌, డీమ్యాట్, ట్రేడింగ్) తెరవవచ్చు. డెలివరీ బేస్డ్‌ ఈక్విటీ పెట్టుబడులు మాత్రమే అలో ఉంటుంది. ఇంట్రాడే లేదా డెరివేటివ్స్ ట్రేడింగ్ ఉండదు. బిడ్డకు 18 ఏళ్లు నిండినప్పుడు, వారి పేరు మీద కొత్త అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.

- మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ అనేది మైనర్లకు మరొక ఆప్షన్‌, వీటిని గార్డియన్‌ నిర్వహిస్తారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్, స్కూల్ ID లేదా పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లు అవసరం.

- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

మైనర్ కోసం సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల పెట్టుబడితో PPF అకౌంట్‌ తెరవవచ్చు. పిల్లల ప్రయోజనం కోసం మాత్రమే విత్‌డ్రా చేయాలి. బిడ్డకు 18 ఏళ్లు నిండినప్పుడు కంట్రోల్‌ పొందడానికి ఒక ఫారమ్ సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

2025-06-09T16:09:34Z