పెరుగు నుంచి కొబ్బరి నూనె వరకు.. ఇవి మీ స్కిన్ ను ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి..

ఎండాకాలంలో శారీరక సమస్యలే కాదు చర్మ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. వేడెక్కడం, చెమట, చర్మంపై దద్దుర్లు, మొటిమల ప్రమాదం పెరుగుతుంది.

 

ఋతువులు మారుతున్న కొద్దీ.. మన చర్మంలో కూడా మార్పులు వస్తాయి. అందుకే ప్రతి సీజన్ మారుతున్న కొద్దీ.. చర్మ సంరక్షణ దినచర్యలో కూడా మార్పులు చేసుకోవాలి. ఎండాకాలంలో శరీర ఆరోగ్యంతో పాటుగా చర్మ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వేడి, చెమట, చర్మపు దద్దుర్లు, మొటిమల ప్రమాదాన్ని పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

గంధం

గంధం చర్మ సంరక్షణకు సహాయపడే ఉత్తమమైన వాటిలో ఒకటి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఎన్నో విధాలుగా రక్షించడానికి సహాయపడుతుంది. మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు వంటి ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇందుకోసం గంధం, రోజ్ వాటర్ ను బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. దీనివల్ల ముఖం ఎర్రబడే ప్రమాదం తగ్గుతుంది. చర్మంపై నల్లని మచ్చలను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

దోసకాయ

కీరదోసకాయ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కీరదోసకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. కీరదోసకాయ రసాన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసం, దోసకాయలను కలిపి వాడితే చర్మ సమస్యలు తొలగిపోతాయి. 

 

పెరుగు

చర్మ సంరక్షణకు పెరుగు బాగా సహాయపడుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ ఉన్నా నల్లటి వలయాలను పోగొడుతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. అలాగే చర్మం రంగును మారుస్తుంది. ఇందుకోసం ముందుగా రెండు టీస్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు పూర్తిగా పోతాయి. 

 

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో నారింజ పండు చర్మ సౌందర్యం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నారింజ తొక్కలో కూడా ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. నారింజ తొక్క మొటిమలను తగ్గించడానికి, నల్లని మచ్చలను, జిడ్డుగల చర్మాన్ని తొలగించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా నారింజ పొడిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలిపి పేస్టులా తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో కడిగేయాలి. వడదెబ్బకు గురైన ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. కొబ్బరి నూనె చర్మంపై ముడతలను తొలగించడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరినూనె, ఆముదం రెండింటినీ కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు పోతాయి.

2023-05-26T07:46:17Z dg43tfdfdgfd