Trending:


జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను చూడాల్సిందే!

లోయలు చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రపంచంలో అందంగా ఉండే వ్యాలీల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాలీల దగ్గర ప్రకృతి రమణీయంగా ఉంటుంది.


Chegodilu Recipe: చేగోడీలు ఇలా చేస్తే అసలు వదిలిపెట్టరు..!

Chegodilu Recipe In Telugu: చేగోడీలు రుచికరమైన స్నాక్‌. వీటిని మార్కెట్‌లో ఎక్కువగా కొంటూంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇదీ కోసం కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. చేగోడీలను టీతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది.


ఒంటెలపై పెళ్లి ఊరేగింపు.. ఈ పెళ్లికొడుకు ఎంట్రీ మామూలుగా లేదు..!

పెళ్లిళ్ల సమయంలో వరుడు హెలికాఫ్టర్ లో లేదా.. లగ్జరీ కారులోనే ఊరేగింపుతో రావడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. అయితే బీహార్ జలోర్ లోని బావ్త్రా గ్రామంలో జరిగిన ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లిలో ఊరేగింపు ఒంటెల బండిపై జరిగింది. వరుధు మాత్రమే కాదు.. వారి బంధువులూ ఒంటెల బండిపై వధువు ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి వరుడు ఒంటెపై ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చాడు. ఇలా ఒంటెల బండ్లపై ఊరేగింపుగా వరుడి బంధువులు రావడం చూసి.. స్థానికులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఆ పెళ్లి వేడుకను అందరూ తిలకించారు. నిజానికి వరుడు ఇలా ఒంటెల బండిపై ఎంట్రీ ఇస్తాడని.. వధువు తల్లి దండ్రులు కూడా భావించలేదంట. ఖరీదైన ఖారులోనో.. లేక రైళులోనే వస్తారని అందరూ అనుకున్నారు. అయితే తాము వినూత్నంగా ఈ వేడుకను జరుపుకోవాలని ఇలా ఒంటె బండిపై వచ్చినట్లు వరుడి తండ్రి వగ్తా రామ్ దేవాసి లోకల్ 18తో చెప్పారు. జలోర్ జిల్లాలోని బావ్త్రా నుంచి వలేరా వరకు వరుడు రాజు సంప్రదాయ ఊరేగింపు జరిగింది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఊరేగింపు కారుల్లో వెళ్తుంది, కాని పాత సంస్కృతి, ఆచారాలను సజీవంగా ఉంచడానికి రైకా సమాజం ఈ ఊరేగింపును అద్భుతంగా నిర్వహించిందని వరుడి బంధువులు తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారం అలంకరించిన ఒంటెలు.. ఒంటె బండ్లతో సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో సుమారు నలభై నుంచి యాభై ఒంటెలను ఉపయోగించారు. వరుడితో పాటు.. వారి బంధువులు కూడా వాటిపైనే ప్రయాణం చేశారు.


నెలాఖరులో శుక్ర సంచారం, శుభవార్తలు అందే సమయం..!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, సౌక్యం, వైభవం, ఐశ్వర్యం, ఆనందానికి సంబంధించిన ఫలితాలు ఇస్తుందని చెపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తులు వారి జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు విలాసాలను పొందుతారంట. జూలై 07న శుక్రుడు కటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక జూలై 31 న, శుక్రుడు సింహరాశిలో, సూర్యుని రాశిలోకి ప్రవేశిచనున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెపుతున్నారు. అంతేకాదు వారి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం పొందుతారంట. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కలలు కూడా నిజం అవుతాయని పండితులు అంటున్నారు. శుక్రుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం: వృషభ రాశి వారు సింహరాశిలో శుక్రుని సంచారం వల్ల చాలా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రాశి నుండి నాల్గవ ఇంట ఉంటాడు. జాతకం యొక్క నాల్గవ ఇల్లు జీవితం యొక్క సుఖాలు, విలాసాలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. వాహన, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో సంబంధాలు బలపడతాయి. మిథునం: శుక్రుని సంచారం మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం విషయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరికి సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. సింహం: శుక్రుని సంచారం మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు పెద్ద పని చేయాలనుకున్నా, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమికులకు అనుకూల సమయంలో.. వివాహం వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉత్తీర్ణులు అవుతారు. కన్య: ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాదు మీ వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగుల హోదా, జీతం పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. మకరం: శుక్రుని సంచార ప్రభావం పని విస్తరణలో పురోగతిని ఇవ్వడమే కాకుండా సామాజిక హోదా మరియు ప్రతిష్టను పెంచుతుంది. ఈ కాలంలో మకర రాశి వారు రాజకీయ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆశించిన పనులు పూర్తవుతాయి. కుంభం: శుక్ర సంచారం కుంభ రాశికి కూడా మేలు చేస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం పండితుల వ్యక్తిగత అభిప్రాయం.. న్యూస్ 18తెలుగు దీనిని ధృవీకరించడం లేదు)


బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

ఉదయాన్నే కాఫీ తాగ‌డంతోనే చాలామందికి రోజు ప్రారంభం అవుతుంది. కొంద‌రైతే పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగేందుకు ఇష్టపడతారు. ఈ బ్లాక్ కాఫీ తాగ‌డం లాభ‌మా? న‌ష్ట‌మా? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


మహిళా నృత్య కళాకారిణికి అపూర్వ గౌరవం.. ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించిన యునెస్కో..!

పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా.. కళ, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ చౌనృత్యం ఈ జిల్లా సంప్రదాయాలలో ఒకటి. పురూలియా నటి మౌషుమి చౌదరి దీనిని ప్రపంచ ఖ్యాతికి తీసుకు వెళ్లారు. రకరకాల మాటలకు, అవమానాలకు ఆమె భయపడలేదు. సమాజం ముందు ధైర్యంగా నిలబడి.. తన ప్రతిభను చూపింది. దీంతో అందరూ ఆ అద్భుత ప్రతిభకు దాసోహం అయ్యారు.. నేడు దేశ విదేశాల్లో ఆమె డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.మౌసుమీ జీవిత కథను ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ గుర్తించింది....


పాండాలను చూసేందుకు ఈ ప్రదేశాలు బెస్ట్!

పాండాలు ఎంతో ముద్దుగా ఉంటాయి. అయితే అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. వీటిని చూడాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుందాం.


అలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకునే రాశుల వారు వీళ్లే.. కొంచెం కష్టమే..

మన జీవితంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అమ్మ ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఆప్యాయతతో వడ్డించే భోజనం, ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసే సపర్యలు, కష్టం వచ్చినప్పుడు చెప్పే ధైర్యం.. ఇలా ఎన్నో సందర్భాల్లో అమ్మ మనకు తోడునీడలా ఉంటుంది. పెరిగి పెద్ద అయిన తరువాత పెళ్లి చేసుకోవడం సహజం. అయితే కొందరు మగవాళ్లు తమ జీవితంలోకి అమ్మ లాంటి వ్యక్తి భార్యగా రావాలని కోరుకుంటారు. భార్య కూడా తల్లిలా ప్రేమానురాగాలు చూపాలని భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. తల్లి లక్షణాలు భార్యలో ఉండాలని కోరుకునే రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి మగవారు, తల్లిలా ఇంటిని చక్కగా మెయింటెన్ చేసే వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరు చిన్నప్పుడు అమ్మ ఇంటిని చక్కబెట్టే విధానాన్ని దగ్గరి నుంచి చూస్తారు. ఆ ప్రభావంతో పెద్దయ్యాక పరిశుభ్రత, ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. భార్య కూడా ఇలాంగే ఉండాలనుకుంటారు. సురక్షితమైన, ప్రేమపూర్వక సంబంధం కోసం తమ మాతృమూర్తి లక్షణాలను బెంచ్‌మార్క్‌గా భావిస్తారు. వృషభంవృషభరాశి వారు అమ్మానాన్నల మాదిరిగా గొప్ప ప్రేమను చూపే భాగస్వామి తమ జీవితంలోకి రావాలని కలలు కంటారు. వీరు చిన్నప్పుడు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా నిశితంగా గమనించే అలవాటు ఉంటుంది. తల్లిదండ్రుల సంబంధాలను పరిశీలిస్తుంటారు. చాలా విషయాల్లో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అమ్మను ఎమోషనల్ సపోర్ట్‌గా భావిస్తారు. తమకు కాబోయే భార్యలో దయాగుణం ఉండాలనుకుంటారు. సున్నిత మనస్తత్వం, శ్రద్ధ వహించే మహిళలను ఇష్టపడతారు. కర్కాటకంకర్కాటక రాశివారు తమ కుటుంబ సభ్యులు చూపే ఆప్యాయతను మించిన ఆనందం మరోటి ఉండదని భావిస్తుంటారు. తమ జీవితంలో వచ్చే భార్య తల్లిలాగా ప్రేమను పంచాలని అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశివారికి తమ తల్లులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వారితో స్నేహంగా మెలుగుతారు. ఈ ప్రత్యేకమైన చొరవతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటారు. అందుకే అమ్మతో మంచిగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఈ రాశివారు తమ బాల్యంలో తల్లులతో ఉన్న అనుబంధం, పెంపకం, అలాంటి వాతావరణాన్ని తిరిగి అందించే భాగస్వాములను కోరుకుంటారు. ఇంట్లో ఓదార్పును, ప్రేమను పంచే ఇల్లాలు ఉండాలనుకుంటారు. మేషంబాల్యంలో తల్లులు తమ పట్ల చూపిన శ్రద్ధ, అంకితభావం గురించి మేషరాశివారు ఆలోచిస్తుంటారు. స్కూల్ హోంవర్క్‌లో తల్లి చేసే సహాయం, లంచ్ బాక్స్‌లను సిద్ధం చేయడంలో తల్లిచూపిన శ్రద్ధను గుర్తుకు తెచ్చుకుంటారు. మేషరాశివారు తమ తల్లులను బాగా ఆరాధిస్తారు. బాల్యంలో తల్లులు చేసిన విధంగా తమ జీవిత భాగస్వాములు ఉండాలని, అదేవిధంగా సేవ చేయాలని కోరుకుంటారు. భార్యకు ఎమోషనల్ సపోర్ట్ అందించాలనుకుంటారు. ఇంటి పనులను విభజించుకుని పని భారం తగ్గించాలనుకుంటారు. ఎందుకంటే ఇంటి సంరక్షణ భారం పూర్తిగా ఏ జీవిత భాగస్వామిపైనా ఉండదని వారు భావిస్తారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


అటవీ ప్రాంతంలో అకాడి సంబురం.. వన దేవతలకు ఆదివాసుల ప్రత్యేక పూజలు..

ఆదిలాబాద్ జిల్లా... పచ్చని చిక్కని అడవులకు పెట్టింది పేరు. అంతే కాదు ఆ అడవులే ఆటపట్టుగా జీవించే ఆదివాసి గిరిజనుల ఖిల్లా కూడా. ఇక్కడి ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. యేడాది పొడవునా ఇక్కడి గిరిజనులు ఏదో ఒక పండుగను, వేడుకను జరుపుకుంటుంటారు. అందులో ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ అకాడి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం వానాకాలంలో ఈ అకాడి పండుగను జరుపుకోవడం ఆదివాసి గిరిజనుల ఆచారం. తర తరాల నుండి అనాదిగా వస్తున్న ఆచారాల...


Meat banned city: ప్రపంచంలో పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించిన పట్టణం ఇది, మనదేశంలో ఉన్న ఈ ఊరి గురించి తెలుసుకోండి

Meat banned city: ఏదైనా గ్రామంలో శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఉంటారు, కానీ మాంసాహారులే లేని గ్రామం ఒకటుంది. అది కూడా మనదేశంలోనే ఉంది. ఇది ఎక్కడుందో తెలుసుకోండి.


వర్షాకాలంలో పొరపాటున కూడా ఈ వెజిటేబుల్స్ తినకండి.. కాదంటే అనారోగ్యం తప్పదు..!

ఆకుకూరల్లో పాలకూర, ఆవాలు, కొత్తిమీర వంటి కూరగాయలు ఉంటాయి. వర్షాకాలంలో, మట్టి మరియు సూక్ష్మక్రిములు ఈ కూరగాయలకు సులభంగా అంటుకుంటాయి, ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన డాక్టర్ కపిల్ త్యాగి ప్రకారం, తేమ కారణంగా, ఈ కూరగాయలలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఇది సంక్రమణకు కారణమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెపుతున్నారు. ఇక క్యాప్సికమ్ లో విటమిన్ సి మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. కానీ వర్షాకాలంలో దానిని వినియోగించడం మంచిదికాదంట. క్యాప్సికమ్ సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను త్వరగా పెంచుతుంది.. ఇది సంక్రమణకు కారణమవుతుంది. ఇది కాకుండా దాని బాహ్య ఉపరితలంపై పురుగుమందులు కూడా ఉన్నాయి. ఎంత కడిగినా వాటిని పూర్తిగా తొలగించలేము. ఇది కడుపు సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంట. వంకాయ పోషకాలు అధికంగా ఉండే కూరగాయ.. కానీ వర్షాకాలంలో దీనిని తినడం హానికరం. వంకాయలో తేమ ఎక్కువగా ఉండటం, బ్యాక్టీరియా ఉండటం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అదనంగా, వంకాయ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వర్షాకాలంలో ఇప్పటికే చల్లబడుతున్న వాతావరణంలో ఆరోగ్యానికి హానికరం. కాలీఫ్లవర్, క్యాబేజీ వర్షాకాలంలో సులభంగా అనారోగ్యాన్ని సృష్టిస్తాయి. చిన్న చిన్న కీటకాలు, బ్యాక్టీరియాలు దాగి ఉండేలా ఈ కూరగాయల ఆకృతి ఉంటుంది. అంతేకాక ఈ కూరగాయలు వండడానికి సమయం పడుతుంది.. సరిగ్గా వండకపోతే ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వర్షాకాలంలో ఈ కూరగాయలను తినడం వల్ల కడుపు సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. డాక్టర్ కపిల్ త్యాగి ప్రకారం... వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, వంకాయ, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలకు ఈ సీజన్లో దూరంగా ఉండాలి. వర్షాకాలాన్ని ఆస్వాదించండి.. కానీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.


Breastfeeding: పాలిచ్చే తల్లులు తీపి ఎక్కువ తింటే పిల్లలకు షుగర్ వస్తుందా?

Breastfeeding: ప్రెగ్నెన్సీ సమయం నుంచి పాలిచ్చే దాకా తల్లీ తీసుకునే ఆహారం ప్రభావం శిశువు మీద ఉంటుందట. అదెలాగో తెల్సుకోండి.


Parenting | సాయం చేయనిద్దాం.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పరుద్దాం

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.


మొటిమలకు చక్కని పరిష్కారం.. అదిరిపోయే చిట్కాలు మీ కోసం..

చాలామంది అందాన్ని దెబ్బతీసే కామన్ స్కిన్ ప్రాబ్లమ్‌ మొటిమలు. పింపుల్స్ వస్తే త్వరగా తగ్గవు. వాటిని గిల్లితే మచ్చలు పడి మరింత ఇబ్బందిగా మారతాయి. అందుకే వీటిని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఇందుకు ఇంటర్నెట్ టిప్స్ పాటించడం మానేసి వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొటిమల నివారణ, వాటికి చెక్ పెట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన క్రీమ్స్ ఏవో ‘ఇండియా టుడే’కు వివరించారు ఢిల్లీకి చెందిన...


తిరుమల లడ్డు తయారీలో అన్యమతస్తులు ... నిజమెంత..? అసలు వీటిని ఎవరు, ఎలా తయారుచేస్తారు..!

Tirumala : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకారప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా. అందువల్లే శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డును నైవేద్యంగా పెట్టడమే కాదు భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్. శ్రీవారిని దర్శించుకునేవారు తప్పుకుండా లడ్డును రుచిస్తుంటారు... ఇంటికి పట్టుకెళ్లి బంధువులకు, స్నేహితులకు అందిస్తుంటారు. ఇలా స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు...


ఈ ఇండోర్ మొక్కలతో ఇల్లు సువాసనభరితం!

కొన్ని ఇండోర్ మొక్కలు ఇంటిని సువాసనభరితంగా మారుస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


జుట్టుకు నెయ్యి రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

నెయ్యి వ‌ల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నెయ్యి తిన‌డం వ‌ల‌్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నెయ్యిని జుట్టుకు రాయ‌డం వ‌ల‌్ల ఏం అవుతుంద‌ని చాలా మందికి సందేహం ఉంటుంది. అందుకే నెయ్యితో జుట్టుకు ఏమైనా ప్రయోజనం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.


జుట్టును ఒత్తుగా మార్చే బయోటిన్ రిచ్ ఫుడ్స్‌!

ఒత్తైన జుట్టును అందర్నీ ఆకర్షిస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక్కడ చెప్పిన ఆహారాలు తింటే జుట్టు బలంగా, నల్లగా మారుతుంది.


Litchi Fruit: లిచీ పండ్ల గింజ‌ల‌ను ప‌డేయ‌కండి.. దీని వల్ల కలిగే లాభాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు..!

Litchi Fruit Seeds: లిచీ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పండు మాత్రమే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఆషాఢమాసంలో.. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరాల్సిందే..

అమ్మవారి నవరత్రి పూజలను ఎక్కువగా మనం దసరా నవరాత్రుల్లో చూస్తుంటాం.. కానీ కరీంనగర్, జిల్లా నగునూర్ గ్రామంలో ఉన్న శ్రీ పరివార సమేత దుర్గ భవాని అమ్మవారికి మాత్రం ఆషాఢం మాసంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాడ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కళలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్రబృందంతో కలిసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ శారదాపీఠం వారి ఆధ్వర్యంలోని వాళ్ళ సలహా సూచనల ప్రకారమే నిర్మించి దుర్గ దేవి అమ్మ వారితో పాటు సరస్వతి, గాయత్రి, ఎల్లమ్మ తల్లి పార్వతి దేవి.. ఇలా అందరు దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆషాఢ మాసం నవరోతోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాతులవుతున్నారన్నారు ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు..ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు. ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని కోరుకున్న వారికి కొంగుబంగారంగా అమ్మవారు కరుణిస్తున్నారని ఈ అమ్మవారి ఉత్సవాలు 15 రోజులు జరుగుతాయని గురు పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు పూజారులు తెలిపారు..


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. కారణం ఇదే..

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం.. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది. అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే మహిళ చేతులకి అందం వస్తుంది. అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లో విశ్వహిందూ పరిషత్ మాత్రుశక్తి… జిల్లా సమియోజ్యక సూర్య దేవర జ్యోతి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాడమాసంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు వేడుకను పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు పెట్టుకుని ఆనందంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చెట్టుకు పూజలు నిర్వహించి ఆ చెట్టు యొక్క కొమ్మలను ఒకచోటకు తీసుకొచ్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజ నిర్వహించి ఆ తర్వాత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రోలులో గోరింటాకును దంచుతారు. అలా దంచిన గోరింటాకు అక్కడున్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజులు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాడ మాసంలో గోరింటాకు పండుగను జరుపుకోవడంలో తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళలు అంటున్నారు. గోరింటాకు పండుగ నిర్వహించుకోవడంలో శాస్త్రీయంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మహిళలు అంటున్నారు. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులకి ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నీళ్లలో పని చేస్తుంటారు కాబట్టి వారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని మహిళలు తెలిపారు.


Mustard Oil: ఆవనూనెతో వండితే ఏమవుతుంది.. కలిగే లాభాలు ఇవే !

Mustard Oil Benefits: ఆవనూనె భారతీయ వంటల్లో ఉపయోగించే నూనెలో ఒకటి. దీని వంట్లో ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ నూనెల కంటే ఆవనూనెతో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


కొత్తిమీర జ్యూస్‌తో ఈ స‌మ‌స్య‌లు మాయం!

కొత్తిమీర వంటకాలకు రుచిని, సువాసనను అందిస్తుంది. కొత్తిమీర‌లో ఔష‌ధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త‌మీర‌ను జ్యూస్ చేసుకొని తాగ‌డంతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.


Toe Ring: పాదాలకున్న రెండో వేలికే మెట్టెలను పెట్టుకుంటారు ఎందుకు? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు మెట్టెలు పెట్టుకోవడం సహజం. మెట్టెలు పెట్టుకుంటే ఆ స్త్రీకి పెళ్లయినట్టు అందరూ గుర్తిస్తారు. మెట్టెలు కేవలం పెళ్లయిందని చెప్పడానికే అనుకోకండా. దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది.


ఈ రాశుల వారికి కూతురంటే పంచప్రాణాలు.. బిడ్డను యువరాణిలా చూసుకుంటారు!

తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారి కోసం జీవితాన్ని ధారపోస్తారు. బంగారు భవిష్యత్తును అందించడానికి చాలా కష్టపడతారు. అయితే కుటుంబంలో అమ్మాయి పుడితే, సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటారు. ముఖ్యంగా తండ్రి కుమార్తెలను గారాబం చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం తమ కూతురిని యువరాణిలా చూసుకుంటారు. బిడ్డపై వీరు చూపించే ప్రేమ, కేరింగ్ అనంతమైనదిగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం) మకరం : మకరరాశి తండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై లోతుగా ఆలోచిస్తుంటారు. కూతురి కోసం ఇంట్లో అనువైన వాతావరణం కల్పిస్తారు. పిల్లలు ఆనందంగా జీవించడమే తమ లక్ష్యంగా భావిస్తారు. తమ పేరెంట్స్ తీర్చలేని ఆకాంక్షలు, కోరికలను వారు తమ పిల్లలకు తీర్చే సాధనంగా భావిస్తారు. బిడ్డల కలలను నిజం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారిని ప్రతి విషయంలోనూ ప్రశంసిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కుంభం : కుంభరాశి తండ్రులు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తారు. అలాగే వారి వ్యవహార శైలి చమత్కారంగా ఉంటుంది. వీరు తమ కుమార్తెలను మహరాణులుగా భావిస్తారు. వారికి సకల వసతులు కల్పిస్తారు. కూతుర్ల పట్ల అమితమైన ప్రేమ, అనురాగం ప్రదర్శిస్తుంటారు. ఆడ పిల్లలను ఇంటికి లక్ష్మీదేవీగా, కుటుంబానికి ఆశీర్వాదంగా భావిస్తారు. వారికి విలువైన జీవిత పాఠాలు చెబుతూ తెలివితేటలను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహం : సింహరాశి వారు జీవితంలో స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవిత భాగస్వామితో పాటు పిల్లల పట్ల ప్రేమానురాగాలు చూపుతారు. కుమార్తెలతో సరదాగా కబుర్లు చెబుతూ సంతృప్తి పొందుతారు. ఎంత బిజీగా ఉన్నా వారితో గడపడానికి సమయం కేటాయిస్తారు. కుమార్తెలను వారు తమ జీవితాలకు వెలుగుగా భావిస్తారు. వారికి ఏ లోటు లేకుండా అన్నీ ఇస్తారు. సింహ రాశివారికి ఆటలు, పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి లేకపోయినా తమ కూతుర్లను అలరించడానికి, వారి ఎదుగుదల కోసం ఈ అభిరుచులను అలవాటు చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటకం : ఈ రాశివారు తండ్రి అయినప్పుడు ఆనందం, ఉత్సాహం అవధులు లేకుండా ఉంటుంది. పిల్లలు పుట్టిన తరువాత వారిని ఎలా పెంచాలనే దానిపై అనేక రకాల ఆలోచనలు చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలని నిరంతరం కష్టపడుతుంటారు. కుమార్తెల విషయంలో మరింత ప్రత్యేక దృష్టిసారిస్తారు. వారిని రాజకుమారిలా చూసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటారు. బిడ్డలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తారు. కర్కాటకరాశి వారు అమ్మాయి ఆత్మగౌరవాన్ని పెంచడానికి కృషి చేస్తారు. భిన్నమైన అభిరుచులను అలవాటు చేసుకునేలా పిల్లలను ఉత్సాహపరుస్తారు. వారికి వ్యక్తిత్వం, గౌరవ మర్యాదల పట్ల అవగాహన కల్పిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


Constipation Tips: మలబద్ధకం సమస్యను నూటికి నూరు శాతం తగ్గించే 5 అద్భుత చిట్కాలు

Constipation Tips: మలబద్ధకం సమస్యను నూటికి నూరు శాతం తగ్గించే 5 అద్భుత చిట్కాలు


Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

Curry Leaves : కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే ఏంచక్కా తింటారు. అవేంటో తెలుసుకోండి.


మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు

మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు ఏడాదికిపైగా ఇండియన్ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి మరో 8 రోజుల్లో ఒలింపిక్స్​ (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Trending News: ప్రపంచంలోనే మరో వింత.. ఈ పెన్ను ఎంత రాసినా ఇంక్ అయిపోదు..

సాధారణంగా పెన్నంటే కొన్ని రోజులకు ఇంక్ అయిపోతుంది. కానీ ఈ ఇన్ఫెనీయం పెన్నులో 80 సంవత్సరాల పాటు ఇంక్ అయిపోదు. ఇంకు కూడా అవసరం లేని పెన్ను ఒకటి ఉందని మనకు ఇంత వరకు తెలీదు. అదేంటీ ఇంక్ లేకుండా పెన్ ఎలా రాస్తుందా అనుకుంటున్నారా..? దాని వివరాలు చూసేయండి మన లోకల్ 18లో.శ్రీకాకుళం జిల్లా సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉండే పెన్ హాస్పిటల్ ఉంది. రూ.13,150 విలువ చేసే పెన్ను ఇక్కడ ఉంది. ఇందులో విశేషం ఏమిటి అనుకుంటున్నారా..? ఈ పెన్ను ఎంత సేపు రాసిన ఇంక్ అవ్వదు....


Instant Crab Biryani: పీతల బిర్యానీ.. ఇలా చేస్తే బోలెడు లాభాలు కలుగుతాయి!

Crab Biryani Recipe: పీతల బిర్యానీ ఆరోగ్యకరమైన ఆహారం. దీని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇందులో లభించే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ డిష్‌ను ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం.


Raashi Khanna | టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఒంపులు చూస్తే పిచ్చెక్కాల్సిందే

raashi khanna, raashi kahanna pics, raashi khanna latest photoshoot, raashi khanna photoshoot. raashi khanna bikini, raashi khanna instagram, rashi khanna red dress pics, rashi khanna photos


Hair Tonic : రోజు రాత్రి ఈ హెయిర్ టానిక్‌ రాస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది..

Hair Tonic : జుట్ట రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఓ టానిక్ హెల్ప్ చేస్తుంది.


మీ పుట్టిన తేది ఇదే అయితే.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. టెన్షన్ పెరుగుతుంది

Numerology: ఆందోళన పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలను జోడించండి.మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ నంబర్ ద్వారా మీ జూలై 18 2024 ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. Number 1: ఈ రోజు సీనియర్ మద్దతు పనిని సులభతరం చేస్తుంది. ఇంట్లో బయట ఆనందం, శాంతి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రశాంతత ఉంటుంది. మీ వ్యాపారంలో లాభిస్తుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. చెడు సహవాసాన్ని నివారించండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. చెల్లించడం సులభం. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఇంటి లోపలా, బయటా ఆనందం దొరుకుతుంది. Number 2: ఈరోజు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆందోళన ,ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. వ్యాపారం బాగుంటుంది. ప్రజల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం,సహాయం పొందుతారు. ధనం పొందేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. లగ్జరీ వస్తువులపై పెద్ద ఖర్చు ఉండవచ్చు. Number3: ఈ రోజు మీరు కుటుంబ ఆందోళనలతో ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. ఉత్సాహం,ఆనందం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి సమయం భావోద్వేగాల ప్రభావంతో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవద్దు. తెలివైన ఉపయోగం లాభాలను పెంచుతుంది. ఆదాయం మిగిలి ఉంటుంది. అలసట చెందుట. Number 4:ఈ రోజున కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. మీరు మీ పనిలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సమయం అనుకూలంగా ఉంటుంది. సోమరితనం ఆపడానికి ప్రయత్నించండి. శారీరక నొప్పి వచ్చే అవకాశం ఉంది. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆందోళన మరియు ఉద్రిక్తత ఉంది. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండండి. Number5: ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. సంతోషం ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించండి. లాభం పెరుగుతుంది. ఈ సంఖ్యలో ఉన్న వ్యక్తులు స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త స్నేహితులను పొందండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. తొందరపాటుతో నష్టపోయే అవకాశం ఉంది. శరీర నొప్పిని నివారించండి. Number 6: ఈ రోజు ఆందోళన,ఉద్రిక్తత ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ వ్యక్తులు వారి పనిలో పనిభారాన్ని కలిగి ఉండవచ్చు. ఆదాయంలో కచ్చితంగా ఉంటుంది. రోజంతా అనుకూలంగా ఉంటుంది కానీ బాధ్యతల నిర్వహణలో కొంత ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనిలో శ్రమ, మళ్లింపు, ఒత్తిడి ఉండవచ్చు. పనిలో గురుతర బాధ్యతల భారం పెరుగుతుంది. Number7: వృత్తి, వ్యాపారాలలో ఈరోజు ఆశించిన పురోగతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పనిలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. Number8: ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఇష్టమైన బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కుటుంబ పెద్దల ద్వారా సులభంగా పరిష్కరించబడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఒకట్రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా వస్తాయి. అనారోగ్యం నుండి కొంత ఉపశమనం పొందుతారు. Number 9: ఈరోజు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. చాలా కెరీర్లు మరియు ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. బంధువుల నుంచి ఇబ్బందులు ఉంటాయి.. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Love Breakup Tips: మీకు బ్రేకప్‌ అయ్యిందా? లవ్‌ ఫెయిల్‌ నుంచి బయటపడే మార్గాలు ఇవే!

Love Breakup Tips: మీకు బ్రేకప్‌ అయ్యిందా? లవ్‌ ఫెయిల్‌ నుంచి బయటపడే మార్గాలు ఇవే!


Jaggery Tea : బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదని తాగుతున్నారా..

Jaggery Tea : కొంతమంది పంచదార బదులు బెల్లం వాడతారు. దీంతో టీ చేసుకుని తాగుతారు. దీని వల్ల లాభాలున్నాయో లేదో తెలుసుకోండి.


Aloo Jeera: ఆలూ జీరా.. ఇలా కేవలం 20 నిమిషాల్లో ఎంతో రుచికరంగా తయారు చేసుకోండి..

Aloo Jeera Recipe: బంగాళదుంపతో వివిధ కూరలు వండుకోవచ్చు. దీంతో రుచి కూడా బాగుంటుంది. అయితే, బంగాళదుంప, జిలకర్ర వేసుకుని తయారు చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ రిసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కట్టిపడేసిన కాకతీయం

కట్టిపడేసిన కాకతీయం బషీర్​బాగ్, వెలుగు: ప్రముఖ నాట్యగురువు పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి నృత్య రూపకంతో ఆకట్టుకున్నారు. కాకతీయుల కళా వైభవం, రుద్రమదేవి పరామక్రమాన్ని తెలియజేస్తూ బుధవారం రవీంద్రభారతిలో ‘కాకతీయం పార్ట్– 3’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. శివోహం, వీరరుద్రాయ, శివ తాండవం అంశాలు హైలెట్​గా నిలిచాయి. రుద్రమదేవి పాత్ర పోషించిన పద్మజారెడ్డిని మ...


రాశిఫలాలు 18 జూలై 2024: ఈరోజు బ్రహ్మ యోగం వేళ తులా, మిధునంతో సహా ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు..!

horoscope today 18 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం వేళ మిధునం, తులా రాశులతో సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


జీవితంలో గోప్యంగా ఉంచాల్సిన విషయాలు..జాగ్రత్త!

ప్రస్తుత ఇంట‌ర్నెట్ యుగంలో వ్యక్తిగత విష‌యాలు కొన్ని తెలియ‌కుండానే ప‌బ్లిక్ లైఫ్‌లో షేర్ అవుతున్నాయి. దీనికి మ‌న అజాగ్ర‌త్త కూడా ఒక కార‌ణ‌మే. అందుకే మ‌నం జీవితంలో కొన్ని విష‌యాల‌ను కచ్చితంగా ప్రైవేట్‌గానే ఉంచాలి. అవేంటో చూద్దాం.


Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:-అనుకోకుండా బంధువులతో గొడవలు...


పిల్లలు ఏడుస్తున్నట్లు కల వస్తే అర్థమేంటి..?

ప్రతిరోజూ మనకు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు అయితే మనకు అసలు ఎలాంటి సంబంధం లేనివిగా ఉంటాయి. తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు కూడా కలలో కనిపిస్తూ ఉంటారు. ఆ రోజు మనం చూసిన సినిమా ప్రభావమో, జరిగిన సంఘటనల ప్రభావం కూడా మన కలలపై ఆధారపడి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకి మన జీవితంతో కొంత సంబంధం ఉంటుంది. ప్రతి కల మీ జీవితంలో రాబోయే సంఘటనను సూచిస్తుంది. లేదా గత సంఘటనలను సూచిస్తుంది. ఈ కలల వివరణ మనకు భిన్నంగా ఉండవచ్చు. చాలా సార్లు మన కలలో...


Astro: ఈ రాశుల వారు డైమండ్ రింగ్ పెట్టుకుంటే ఆ కష్టాలు తప్పవు.. ఎందుకంటే..?

కొన్ని రత్నాలు జ్యోతిష్కులను సంప్రదించిన తరువాత మాత్రమే ఉపయోగించాలి.. తద్వారా అవి మీ జాతకంలో ఆ గ్రహాలను బలోపేతం చేస్తాయి. ఇది కాకుండా, రత్నాన్ని ఉపయోగించేటప్పుడు, అది మీకు సరైనదా కాదా అని ఎలా గుర్తించాలో కూడా మీరు తెలుసుకోవాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం వజ్రం సంపదకు.. శ్రేయస్సుకు చిహ్నమైన శుక్రుడికి సంబంధించినదిగా భావిస్తారు. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక, మీన రాశుల వారు వజ్రాభరణాలు వాడకూడదు. కన్యా, తుల వారికి వజ్రం చాలా ఉపయోగపడే రత్నం. ఈ రాశి వారు వజ్రాభరణాలను ఉపయోగిస్తే అదృష్టం, శ్రేయస్సు లభిస్తుంది. తులా రాశి వారు సమతుల్యత మరియు సామరస్యానికి ప్రసిద్ది చెందారు. ఈ రాశివారు వజ్రపు ఉంగరం ధరించడం వల్ల.. వాటి స్థాయిని మరింత పెంచుతాయి. తులారాశి వజ్రాలను ఉపయోగిస్తే, మధ్యవర్తిత్వం వహించి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం మరింత పెరుగుతుంది. వజ్రాన్ని బంగారం లేదా వెండి ఉంగరంలో ఉంచి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఉంగరాన్ని ధరించడానికి శుక్రవారం పవిత్రమైనదిగా భావిస్తారు. హోదా కోసం లేదా మీ సంపదను ఎవరికైనా చూపించడానికి వజ్రాన్ని ఉపయోగిస్తుంటే.. అస్సలు ఆపని చేయకండి. అది మీకు హాని కలిగిస్తుంది. డైమండ్ నగలను 21 ఏళ్ల తర్వాత వాడాలి. మీరు వజ్రాన్ని ఉపయోగిస్తుంటే మరియు అది మీకు సరైనదా కాదా అని ముందు గుర్తించాలి. దీనిని ధరించిన 20-25 రోజుల్లో డైమండ్ వేర్ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు చెడు పరిస్థితిని ఎదుర్కొంటే.. వజ్రం మీకు అనుకూలంగా లేదని అర్థం. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే వజ్రాభరణాలు వాడకూడదు. వజ్రం ఎప్పటికీ చెడిపోదు. (గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష పరిజ్ఞానంపై ఆధారపడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. న్యూస్ 18 తెలుగు దీనికి హామీ ఇవ్వదు.)


Most Expensive Water Bottle: ఆ వాటర్ బాటిల్ ఖరీదు 50 లక్షలు, ఎందుకంత ఖరీదో తెలుసా

Most Expensive Water Bottle: ఆ వాటర్ బాటిల్ ఖరీదు 50 లక్షలు, ఎందుకంత ఖరీదో తెలుసా


Bread Omelette: స్ట్రీట్ ఫూడ్‌ స్టైల్‌లో బ్రెడ్‌ ఆమ్లెట్‌ తయారీ విధానం!!

Bread Omelette Recipe: బ్రెడ్‌ ఆమ్లెట్‌ పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన డిష్‌. ఈ అద్భుతమైన వీధి ఆహారం. దీని తయారు చేయడం ఎంతో సులభం. బ్రెడ్‌ ఆమ్లెట్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. దీని బ్రేక్‌ ఫాస్ట్‌గా కూడా తినవచ్చు.


మొక్కజొన్న తింటే ఏమవుతుందో తెలుసా?

వర్షంలో వేడి వేడి మొక్క జొన్నపై నిమ్మరసం, ఉప్పు, కారం జల్లి తింటుంటే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో సాయంత్రం అయితే చాలు.. రోడ్డు పక్కనున్న బండి దగ్గర నిలబడి కాల్చిన మొక్కజొన్నను తింటుంటారు. కానీ మొక్కలను జొన్నలను తింటే ఏమౌతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా...


Skin Care: 40 ఏళ్లలో కూడా 18 ఏళ్లలా చర్మం బిగుతుగా మారాలంటే.. ఈ ఒక్క చిన్న పనిచేయండి చాలు

వయసు పెరిగే కొద్దీ రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. చాలా సాధారణం. ఈ పరిస్థితిలో, చాలా మంది ఖరీదైన సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తారు. కానీ దాని వల్ల ఉపయోగం లేదు. బదులుగా, క్రమం తప్పకుండా యోగా చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మం మెరుస్తూ అందంగా ఉండటమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత కూడా మెరిసే చర్మం కావాలంటే, ఏ యోగాసనాలు మీకు సహాయపడతాయో తెలుసుకోవాలి. సేకరించిన చిత్రాలు. చర్మాన్ని మెరిసే యోగాలు: గ్రేటర్ నోయిడాలోని జేపీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో యోగా టీచర్ అగం మిశ్రా మాట్లాడుతూ, చర్మం కాంతివంతంగా మరియు అందంగా ఉండాలంటే, క్రమం తప్పకుండా వరుణ ముద్రను సాధన చేయాలని చెప్పారు. ఇది చర్మాన్ని అందంగా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది. సేకరించిన చిత్రాలు. వరుణ ముద్రా ఆసనం చేసే విధానం: ముందుగా సుఖాసన భంగిమలో కూర్చోవాలి. ఈ స్థితిలో మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. రెండు చేతులు తొడల మీద ఉంటాయి. చేతి వేళ్లు నిటారుగా ఉంటాయి, బొటనవేలు మాత్రమే చిటికెన వేలును తాకుతుంది. రెండు చేతివేళ్లు ఒకదానికొకటి తాకుతాయి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉన్న తర్వాత, విశ్రాంతి తీసుకోండి. హిందూ మతంలో వరుండేవ్‌ను నీటి దేవుడు అంటారు. అందుకే ఈ యోగాసనాన్ని 'జల్ ముద్ర' అని కూడా అంటారు. వరుణ్ ముద్ర చర్మానికి మేలు చేస్తుంది: వరుణ్ ముద్రను రోజుకు మూడుసార్లు 15 నిమిషాల పాటు సాధన చేయాలని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై మచ్చలను తొలగిస్తుంది. చాలా సార్లు తక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చర్మంపై ప్రభావం చూపుతుంది. వరుణ ముద్ర సెల్యులార్ స్థాయిలో కణజాలం కణాలను రీహైడ్రేట్ చేస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం యొక్క బయటి పొరలో ఎక్కువ నీరు ఉండదు. ఫలితంగా, ఇది కఠినమైనదిగా కనిపిస్తుంది. వరుణ ముద్ర శరీరం అంతటా నీటి ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫలితంగా రఫ్ స్కిన్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ మాయిశ్చరైజేషన్‌లో సహాయపడుతుంది. అంతేకాకుండా, వరుణ ముద్ర శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.


ఈ నేచురల్ సప్లిమెంట్లతో నిత్య యవ్వనంగా!

కొన్ని నేచురల్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


హిమాలయన్ పింక్ సాల్ట్‌ రాళ్లకు భలే డిమాండ్.. కారణం ఇదే..

హిమాలయన్ పింక్ సాల్ట్‌ అంటే అందరికీ తెలుసు. ఈ రాళ్లకి ఆకట్టుకునే రంగు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన సముద్రపు ఉప్పుగా హిమాలయన్ పింక్ సాల్ట్‌ పాపులర్‌ అయింది. ఇది తింటే సాధారణ ఉప్పు కంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తోంది. ఈ హిమాలయ పింక్ సాల్ట్ విశాఖలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పెద్ద పెద్ద ఉప్పు రాళ్లు తీసుకువచ్చి విశాఖలో పంజాబ్ కి చేసిన కొంతమంది యువకులు అమ్మకాలు చేస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ కంటే నేచురల్ గా ఈ రాళ్లు మంచివి అని నగరవాసులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. పాకిస్థాన్‌లోని హిమాలయాల దిగువ ప్రాంతంలో లభించే ఈ అన్‌ప్రాసెస్డ్ సాల్ట్‌ అని కూడా అంటారు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సాల్ట్‌ను వంటలో ఉపయోగిస్తారు. అయితే సహజ సౌందర్యాన్ని పెంపొందించే సామర్థ్యం కూడా ఈ ఉప్పుకు ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. పంజాబ్ నుంచి విశాఖ తీసుకువచ్చి ఇక్కడ పింక్ సాల్ట్ కేజీ రూ.100 , బ్లాక్ సాల్ట్ కేజీ రూ. 150 అమ్మకాలు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. నగరంలో అనేక సెంటర్లో ఈ రాళ్లు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. హిమాలయన్ పింక్ సాల్ట్ బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ కాబట్టి దీనికి అంత డిమాండ్ , ధర కూడా ఎక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు. దూర ప్రాంతాల నుండి తీసుకురావడం వలన రవాణా ఖర్చులతో కేజీ రూ.100 అమ్మకాలు చేస్తున్నామని అంటున్నారు. ఈ హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌తో జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి అని అంటున్నారు. హిమాలయన్ పింక్‌ సాల్ట్‌లో మినిరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన, అందమైన దంతాలను తయారవుతాయి అని అంటున్నారు. మౌత్ వాష్‌లో ఉపయోగించినప్పుడు దుర్వాసన లేకుండా చేస్తుంది అని అంటున్నారు.


అమ్మ ప్రేమను మించింది లేదు.. కుమారుడికి కాలేయం దానం చేసిన తల్లి..!

మాతృప్రేమ కంటే గొప్పదేది విశ్వంలో లేదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ.. అనుదినం కాపాడే తొలి రక్షకురాలు తల్లి. మాతృప్రేమకు మరొకటి సాటి రాదనే విషయం మరోసారి రుజవైంది. తన కుమారుడి ప్రాణం నిలబెట్టేందుకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడింది. కుమారుడికి లివర్ దానం చేసిన మరోసారి జన్మనిచ్చింది.


కిచెన్ లో నిమ్మకాయ ఇలా మాత్రం వాడకూడదు.. ఎందుకో తెలుసా?

ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. మనం దానిని ఆహార పదార్థంగా మాత్రమే కాదు... చాలా రకాల వస్తువులను క్లీన్ చేయడానికి కూడా వాడేస్తూ ఉంటాం. చాలా రకాల వస్తువులపై పడిన మొండి మరకలను కూడా నిమ్మకాయ ఈజీగా తొలగించేస్తుంది. అంతేకాకుండా.. నిమ్మకాయలో ఉండే స్పెషల్ వాసన కూడా.. మంచి క్లీనింగ్ ఏజెంట్ గా మనకు ఉపయోగపడుతుంది. అయితే.. ఇదే నిమ్మకాయను.. కొన్ని చోట్ల మాత్రం అస్సలు వాడకూడదట. అది కూడా కిచెన్ లోనే.. అది కూడా శుభ్రం...