ప్రేమకు నిర్వచనం ఉషాపరిణయం

స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకునచ్చావ్‌, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ లైనప్‌ చాలా దర్శకుడిగా కె.విజయభాస్కర్‌ ఏంటో చెప్పడానికి. మనసుల్ని బరువెక్కించే ప్రేమకథల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు కె.విజయభాస్కర్‌. ఆయన నుంచి వస్తున్న మరో క్యూట్‌ లవ్‌స్టోరీ ‘ఉషాపరిణయం’. విజయభాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌, తెలుగమ్మాయి తాన్వి ఆకాంక్ష ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

కె.విజయభాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భావోద్వేగాలతో కూడిన సరికొత్త ప్రేమకథ ఇదని, సినీప్రేమికులకు ఈ సినిమా విందుభోజనంలా ఉంటుందని, ప్రేమకు తానిస్తున్నే నిర్వచనమే ఈ సినిమా అని దర్శక,నిర్మాత కె.విజయభాస్కర్‌ తెలిపారు. సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిశోర్‌, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్‌, చక్రపాణి, రజిత, బాలకృష్ణ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ ముత్యాల, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌.

2024-07-08T21:31:17Z dg43tfdfdgfd