Trending:


పాండాలను చూసేందుకు ఈ ప్రదేశాలు బెస్ట్!

పాండాలు ఎంతో ముద్దుగా ఉంటాయి. అయితే అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. వీటిని చూడాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుందాం.


Instant Crab Biryani: పీతల బిర్యానీ.. ఇలా చేస్తే బోలెడు లాభాలు కలుగుతాయి!

Crab Biryani Recipe: పీతల బిర్యానీ ఆరోగ్యకరమైన ఆహారం. దీని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇందులో లభించే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ డిష్‌ను ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం.


Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు

Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. కారణం ఇదే..

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం.. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది. అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే మహిళ చేతులకి అందం వస్తుంది. అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లో విశ్వహిందూ పరిషత్ మాత్రుశక్తి… జిల్లా సమియోజ్యక సూర్య దేవర జ్యోతి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాడమాసంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు వేడుకను పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు పెట్టుకుని ఆనందంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చెట్టుకు పూజలు నిర్వహించి ఆ చెట్టు యొక్క కొమ్మలను ఒకచోటకు తీసుకొచ్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజ నిర్వహించి ఆ తర్వాత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రోలులో గోరింటాకును దంచుతారు. అలా దంచిన గోరింటాకు అక్కడున్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజులు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాడ మాసంలో గోరింటాకు పండుగను జరుపుకోవడంలో తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళలు అంటున్నారు. గోరింటాకు పండుగ నిర్వహించుకోవడంలో శాస్త్రీయంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మహిళలు అంటున్నారు. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులకి ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నీళ్లలో పని చేస్తుంటారు కాబట్టి వారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని మహిళలు తెలిపారు.


Tholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత.. ఈ రోజున ఈ పనులు చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

Tholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత.. ఈ రోజున ఈ పనులు చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో డబ్బే డబ్బు..


Spicy Coconut Powder: అన్నం, ఇడ్లీలోకి ఎండు కొబ్బరి మసాలా పొడి ఒక్కసారి చేసుకుంటే నాలుగు నెలలు నిల్వ ఉంటుంది

Spicy Coconut Powder: ఇడ్లీ, దోశ వంటి వాటితో ఏదో ఒక పొడిని పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో కాస్త పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని చల్లి తింటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము ఎండు కొబ్బరి మసాలా పొడి రెసిపీ ఇచ్చాను.


Phool Makhana Kheer: ఫూల్ మఖానా పాయసం..ట్రై చేసి చూడండి..!

Phool Makhana Kheer Recipe: ఫూల్ మఖానా పాయసం ఒక ప్రసిద్ధ భారతీయ డెజర్ట్. దీనిని లోటస్ సీడ్స్ తో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాలతో నిండి ఉంటుంది.


అంబానీ పెద్ద కోడలి పై నెటిజన్ల ప్రేమ.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత... స్పెషల్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే... ఆ రిసెప్షన్ లో.. నూతన వధూవరులు కాకుండా.... అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా అంబానీ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి రీసెంట్ గా గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. అనంత్- రాధికల పెళ్లికి ప్రపంచంలోని ప్రముఖ సెలబ్రెటీలు మొత్తం హాజరై సందడి చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే...


Foods To Avoid: బీపీ, షుగ‌ర్ వ్యాధిగ్రస్తులు ఈ ప‌దార్థాలు అసలు తినకూడదు..!

High Bp And Diabetes Foods To Avoid: డయాబెటిస్‌, అధిక రక్తపోటు ఉండే వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.


Astrology 18-7-2024: ఈ రాశుల వారికి ఆ విషయంలో తిరుగుండదు..!

Rasi Phalalu:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్యనిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జూలై 18, 2024 గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేషం (Aries):మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. రొమాంటిక్ లైఫ్‌లో ఎలాంటి భయాందోళనలు లేదా అనుమానాలు పెట్టుకోకుండా పార్ట్నర్‌ను నమ్మాలి. నేడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది, కెరీర్ గ్రోత్‌కు బాటలు పడతాయి. ఆఫీసులో ఏవైనా గొడవలు ఉంటే, మీరు న్యూట్రల్‌గా ఉండాలి. మీరు కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు వస్తే బాధపడొద్దు. ఈ రోజు మీ మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి. మీ కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. మీ అదృష్ట సంఖ్య 25, అనుకూలమైన రంగు పసుపు. ఈరోజు ఇత్తడి గిన్నె అదృష్టాన్ని సూచిస్తుంది. వృషభం (Taurus):మీ రిలేషన్‌షిప్‌లో ఏవైనా గొడవలు ఉంటే, ఇద్దరూ అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలి. డీప్ లవ్, రొమాన్స్ వంటి ఫీలింగ్స్‌ను ఎంజాయ్ చేస్తారు. అనవసర ఆలోచనలు వదిలేసి ముందుకు సాగండి. ఈరోజు ఆఫీసు చర్చల్లో, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమావేశంలో చురుకుగా పాల్గొని, అధికారులకు సహకరించాలి. మీరు చిన్న విషయాలకు ఆత్మసంతృప్తి పొందకూడదు, ఇంకా మోటివేట్ అవ్వాలి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో లాభాల కోసం చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మీ కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి. మీ శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించుకోండి. ఈ రోజు మీ కుటుంబంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. మీ అదృష్ట సంఖ్య 52, అనుకూలమైన రంగు వెండి. ఈ రోజు తలపాగాను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మిథునం (Gemini):ఈ రోజు మీ సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయి. ప్రేమ విషయంలో భాగస్వామిపై అనవస అంచనాలను వదిలేసి ప్రాక్టికల్‌గా ఉండాలి. మీ కెరీర్‌ గ్రోత్‌ బాగుంటుంది. కొత్త అవకాశాలు, ఆలోచనలతో విజయాలు అందుకుంటారు. టీమ్ వర్క్‌ సరిగా చేయాలి. మీ కొత్త వ్యాపారాన్ని సరికొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలి. మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపితే, వారితో బంధాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 11, అనుకూలమైన రంగు ఊదా. ఈరోజు ప్యాక్ చేసిన సామాను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కర్కాటకం (Cancer):ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌లో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇది మీ జీవిత భాగస్వామితో డీప్ కనెక్షన్, సరైన అవగాహనను పెంపొందిస్తుంది. రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీ ప్రియమైన సహవాసాన్ని ఆస్వాదిస్తారు. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్‌లో సహనం, పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. సహోద్యోగులతో కలివిడిగా ఉండాలి. మీ కొత్త వ్యాపార సంస్థలో లాభాలు వస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శారీరక, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల అవసరాలు, భావోద్వేగాలకు విలువ ఇవ్వాలి. మీ అదృష్ట సంఖ్య 13, అనుకూలమైన రంగు చార్‌కోల్ గ్రే. ఈరోజు తేనెటీగను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. సింహం (Leo):ఈ రోజు సంబంధంలో మీ వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచుకోవాలి. నేను, నాకు అనే భావన విలేసి మనం అనే భావన బలంగా ఉందని భాగస్వామికి అర్థమవ్వాలి. లవ్, రిలేషన్‌లో ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ప్రియమైన వారితో ప్రస్తుత క్షణాలను ఆస్వాదిస్తారు. అయితే అనవసర ఎక్స్‌పెక్టేషన్స్ మంచివి కావు. మీ కెరీర్ గ్రోత్‌ ప్లానింగ్‌ను నమ్మాలి. ఈరోజు మీ ఆఫీస్ సహోద్యోగులకు సరిగా ప్రవర్తించాలి. అహంకారాన్ని వదిలి యూనిటీకి విలువ ఇవ్వాలి. ఇది మీ కొత్త బిజినెస్ వెంచర్‌కు ప్లస్ అవుతుంది. పెద్ద కలలు కనండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. ఈ రోజు మీ కుటుంబంతో సామరస్యంగా గడపాలి. మీ అదృష్ట సంఖ్య 23, అనుకూలమైన రంగు లేత గోధుమరంగు. ఈ రోజు బ్లాక్ కలర్ కర్టెన్‌ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కన్య (Virgo):ఈ రోజు రిలేషన్స్‌లో మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలంగా మారుతుంది. మీ ఫీలింగ్స్ వారితో షేర్ చేసుకోండి. ప్రేమించే వారితో కొత్త అనుభవాలు, జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, కెరీర్‌లో సవాళ్లను స్వీకరించాలి. ఆఫీస్ రాజకీయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోవద్దు, గొడవలకు దూరంగా ఉండాలి. మీ విజయాలను వేడుకగా జరుపుకునే సమయం ఇది. మీ కొత్త బిజినెస్ వెంచర్‌ డెవలప్ అవుతుంది. మీ ఆరోగ్యం గురించి ఏవైనా ఆందోళనలు లేదా ఒత్తిడి ఉంటే దూరం చేసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబంతో ప్రేమగా ఉండాలి. మ అదృష్ట సంఖ్య 12, అనుకూలమైన రంగు తెలుపు. ఈరోజు బూడిద రంగు పక్షిని చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. తుల (Libra):ఈ రోజు మీ రిలేషన్‌లో అనవసర ఎక్స్‌పెక్టేషన్స్ వదిలేసి, భాగస్వామిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. మీ మనసుకు సంబంధించిన విషయాల్లో క్లారిటీ ముఖ్యం. మీ భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడుతూ, వారితో అనుబంధాన్ని మరింతగా పెంచుకోండి. మీ సామర్థ్యాలు, ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. ఆఫీస్ పనుల్లో సక్సెస్ అవుతారు. వర్క్ ప్లేస్‌లో అందరితో కలసి మెలసి ఉండాలి. మీ క్రియేటివిటీని పెంచుకోవడానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. మీ ఎమోషన్స్‌పై శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వేడుకలు జరుపుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 6, అనుకూలమైన రంగు పింక్. ఈరోజు డైమండ్ రింగ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. వృశ్చికం (Scorpio):మీ రిలేషన్‌షిప్‌లో అనవసరమైన వివాదాలను దూరం చసుకుంటూ, సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ప్రియమైన వ్యక్తితో అనుబంధాన్ని మరింతగా పెంచుకుంటారు. భాగస్వామితో మంచి రొమాంటిక్ టైమ్ గడుపుతారు. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు. కెరీర్‌లో పాజిటివ్ మార్పులు లైన్‌లో ఉన్నాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. మీ ప్రత్యేకతలు, ఆలోచనలపై నమ్మకం పెంచుకొని కెరీర్ గ్రోత్‌కు ప్రయత్నాలు చేయండి. మీ టాలెంట్‌ను నమ్మండి. మీ కొత్త బిజినెస్ వెంచర్ సక్సెస్ బాటలోనే ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీలో కొందరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ అదృష్ట సంఖ్య 44, అనుకూలమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజు పచ్చని తోటను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. ధనస్సు (Sagittarius):ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌లో నమ్మకం, విధేయత ముఖ్యం. ఇవి మీ జీవిత భాగస్వామికి భద్రతకు భరోసా ఇస్తాయి. వారితో కనెక్షన్ మరింత పెంపొందిస్తాయి. ప్రేమించే వారికి స్వేచ్చ ఇవ్వాలి. మనసుకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలి. కొత్త అనుభవాలను అన్వేషించే ప్రయత్నాలు చేయాలి. మీ కెరీర్‌లో అనవసర అటాచ్‌మెంట్‌లు లేదా అంచనాలను లైట్ తీసుకోవాలి. అప్పుడే అవకాశాలు సహజంగా బయటపడతాయి. మీ సహోద్యోగుల పట్ల దయ, అవగాహనతో ఉండాలి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో సక్సెస్ అవుతారు. మీ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోగ్య పరంగా.. సానుకూల మార్పులు, సెల్ప్‌ కేరింగ్‌పై దృష్టి పెట్టాలి. మీ స్నేహితుల గురించి ఆలోచిస్తారు, మీరు గతంలో వారితో ఎంత క్లోజ్‌గా ఉన్నారో గుర్తుచేసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 7, అనుకూలమైన రంగు బంగారం. ఈరోజు మెటాలిక్ బ్రూచ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మకరం (Capricorn):నేడు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మీ రిలేషన్‌షిప్‌లో ప్రస్తుతం చాలా కేర్ చూపించాలి. పార్ట్నర్‌ఫై ప్రేమ కురిపిస్తూ వారికి దగ్గరవ్వండి. వారిని కంట్రోల్ చేయాలనే ఆలోచన వదిలేయండి. ఇది మీ కెరీర్‌లో గ్రోత్, వ్యాపార విస్తరణకు మంచి సమయం. ఆఫీస్ రాజకీయాలకు వీలైనంత దూరం పాటించండి, మీ సొంత పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ కొత్త బిజినెస్ వెంచర్ గురించి అంచనాలకు మించి ఆలోచించాలి. కొత్త ఆలోచనలు వృద్ధికి బాటలు వేస్తాయి. మీ శరీర అవసరాలను వినండి. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే డైలీ రొటీన్, అలవాట్లు ఫాలో అవ్వండి. మీ కుటుంబ సభ్యులతో సహనం ముఖ్యం. వారితో అవగాహన పెంచుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 80, అనుకూలమైన రంగు ఆరెంజ్. ఈరోజు పెద్ద హ్యాండ్‌బ్యాగ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కుంభం (Aquarius):ఈ రోజు మీ రిలేషన్‌షిప్ పార్ట్నర్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో డీప్ కనెక్షన్‌తో, గుర్తుండిపోయే క్షణాలను పెంపొందించుకోవాలి. మీ కోసం మీరు సమయాన్ని వెచ్చించాలి. మనసుకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించాలి. మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని స్వీకరించి, మీ బాటలో ముందుకు వెళ్లండి. కెరీర్‌ పరంగా మీ తెలివి, ప్రత్యేకతలు మీకు ప్లస్ పాయిట్ అవుతాయి. మీ ఆఫీస్‌లో అందరితో సామరస్యంగా ఉండాలి, వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి. అందరితో కలసి మెలసి ఉండండి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో స్ట్రాంగ్ కనెక్షన్స్, బలమైన నెట్‌వర్కింగ్‌ను నిర్మించుకోవాలి. ఫీల్డ్‌లో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడి లేదా ఆందోళనలను వదిలించుకోవాలి. ఇందుకు యోగా లేదా మెడిటేషన్ వంటివి చేయవచ్చు. మీ సోషల్ సర్కిల్‌లో నమ్మకంగా ఉండాలి, అందరితో అవగాహన పెంచుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 10, అనుకూలమైన రంగు బ్లూ కలర్. ఈరోజు ఫోటో ఎగ్జిబిట్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మీనం (Pisces):మీ రిలేషన్‌షిప్‌లో అంతా ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో కలిసి వేడుకలు జరుపుకుంటారు. వారితో మీ ప్రేమ, కనెక్షన్‌ మరింత పెరుగుతాయి. ప్రేమించిన వారితో ఓపెన్‌గా మాట్లాడాలి. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోవాలి. మీ సహోద్యోగుల భావోద్వేగాలు అర్థం చేసుకోవాలి. వారిపై కనికరంతో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ కొత్త వ్యాపారంలో వృద్ధికి సరికొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. మీ కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని క్రియేట్ చేయండి. మీ అదృష్ట సంఖ్య 18, అనుకూలమైన రంగు టాన్. ఈరోజు జనపనార బుట్టను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Today Horoscope In Telugu: జూలై 18 రాశిఫలాలు - ఈ రాశులవారు ఇతరుల సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా ఉంటారు

Daily Horoscope for july 18th 2024 మేష రాశి ఈ రోజు మీకు టెన్షన్‌తో కూడిన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. కుటుంబ సభ్యులు మీ నుంచి ఎక్కువ ఆశిస్తారు. వృషభ రాశి వృషభ రాశి వారి వైవాహిక జీవితం బావుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుని అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కొత్త వాహనం కొనుగోలు...


Monsoon Diet: వర్షాకాలంలో ఈ పప్పులు అస్సలు తినకూడదు...!

మనం రోజూ తినే పప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు , మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని పప్పులలో మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ , ఇనుముతో సహా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా, అనేక వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. మరోవైపు పప్పు తినడం వల్ల కూడా చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. అయితే అనుభవజ్ఞుడైన వైద్యుడు బిశ్వజిత్ సర్కార్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ఎలాంటి పప్పులు తినకూడదు అన్న విషయలు వివరించారు, అనేక ఇళ్లలో కందిపప్పు తినడం కనిపిస్తుంది. కానీ ఈ పప్పు జీర్ణం కావడం కష్టం. అందుకే తేమతో కూడిన వాతావరణంలో ఈ పప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. రాజ్మా దాల్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.. రాజ్మా తినడం వల్ల శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. అయితే, వర్షాకాలంలో అధికంగా తింటే రాజ్మా తినడం ప్రమాదకరం. చనగపప్పు అందరికీ ఇష్టమే. అయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పప్పును వర్షాకాలంలో తినకూడదు. ఎందుకంటే అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. గ్యాస్, ఉబ్బరం ఆమ్లత్వం ఏర్పడవచ్చు.


ఈ రాశుల వారికి పెళ్లంటే పుట్టెడు భయం

ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాం. అందులోనూ కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదన్న సామేతా పెద్దలు అంటుంటే వినే ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి చేసుకునే వారిపై ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. ఇది సహజం. అందులోనూ ఒక ఏజ్ లో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి పెళ్లి అంటే చాలా భయం. అందుకే పెళ్లి పేరు చెప్పగానే...


మీ పార్ట్‌నర్ పదే పదే ఇలా చేస్తున్నారా.. అయితే, మిమ్మల్ని నట్టేట ముంచినట్టే!

భార్యాభర్తలు, ప్రేమికులు ఇలా ఎవరైనా సరే వారి రిలేషన్‌షిప్ కాపాడుకోవాలంటే పూర్తి అవగాహనతో ఇద్దరూ కష్టపడాలి. కష్టాలు వచ్చినా, గొడవలు జరిగినా విడిపోవాలనే ఆలోచన రాకూడదు. కానీ ఈ రోజుల్లో కొంతమంది చిన్న విషయాలకే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. పార్ట్‌నర్ తమకు నచ్చినట్లు ఉండకపోతే ఇతరులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లవ్, రిలేషన్‌షిప్, దాంపత్య బంధంలో భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని లేదా చీట్ చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే.. అందంగా కనిపించడానికి ఖర్చు చేయడంచీట్ చేసేవారు ఎన్నడూ లేని విధంగా చాలా ఖరీదైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆ ఖర్చులతో భర్త లేదా భార్యకు ఆందోళన కలిగిస్తారు. డబ్బు ఎందుకు ఖర్చు చేశారో చెప్పరు. అబద్దాలు చెబుతున్నట్లు ఈజీగా తెలిసిపోతుంది. కేవలం స్నేహితులతో సమయం గడపడానికి కొత్త బట్టలు, ఫ్యాన్సీ ఐటెమ్స్ కొనరు. అందుకే ఎవరినో ఆకర్షించడానికి వాళ్లు ఇలా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్‌ మార్పుచీట్ చేసేవారు పార్ట్‌నర్‌తో మాట్లాడరు. కమ్యూనికేట్ కావడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మాట్లాడేటప్పుడు కూడా పార్ట్‌నర్ కళ్లలోకి చూడలేరు. రహస్యంగా ఏదో తప్పు చేస్తున్నామని అనిపించేలా ప్రవర్తిస్తారు. ముందు ఎప్పుడూ లేని విధంగా, వారి ఫోన్‌కు లాక్ వేస్తారు. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు దూరంగా వెళ్లి లేదా వేరే గదిలోకి వెళ్లి మాట్లాడతారు. ఫీలింగ్స్ పంచుకోరు, అర్థం చేసుకోరుచీట్‌ చేసేవారు భాగస్వామికి దూరంగా ఉంటారు. ముందులా పార్ట్‌నర్‌తో ఫ్రెండ్లీగా ఉండరు. శారీరకంగా, మానసికంగా దూరమవుతారు. ముందులా హత్తుకోవడం లేదా ముద్దుపెట్టుకోరు. భార్య లేదా భర్త పట్ల వారి ప్రేమ తగ్గుతుంది. పార్ట్‌నర్‌తో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడరు, ఒంటరిగా గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొత్త సర్‌ప్రైజ్‌లుపార్ట్‌నర్ ఇచ్చే సర్‌ప్రైజ్‌లు లేదా బహుమతులు అందరూ ఇష్టపడతారు. కానీ ఇది వారు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి, వారిని అనుమానించకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారనే దానికి పెద్ద సంకేతం కావచ్చు. ఎప్పుడూ గిఫ్ట్ ఇవ్వనివారు సడన్‌గా అలా చేస్తుంటే, వారి మోసం బయట పడకుండా, అనుమానం రాకుండా ఉండటానికి అలా చేస్తున్నారని అర్థం. భాగస్వామిని మోసం చేసిన వారిలో కొంతకాలానికి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. దాన్ని పోగొట్టుకునేందుకు మంచి పనులు చేసి పార్ట్నర్‌ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలా తప్పు చేసినందుకు పశ్చాత్తాపం చూపిస్తారు. వారికి ప్రయాణం ఇష్టం లేకపోయినా సర్‌ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు లేదా ఖరీదైన దుస్తులు కొనిపించవచ్చు. చాలా రోజులు ప్రేమ చూపించకుండా ఒకేసారి ఇలా ప్రేమ చూపిస్తుంటే అనుమానించవచ్చు. ఇంటర్‌పర్సనల్ చేంజెస్పార్ట్‌నర్ మరొకరిని ప్రేమిస్తున్నారని లేదా మరొకరితో సంబంధం పెట్టుకున్నారని భర్త లేదా భార్య అనుమానిస్తే, చాలా కోప్పడతారు. చిన్న చిన్న విషయాలకే చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. వారికి భరోసా ఇవ్వడం మానేస్తారు. సమస్యలను పట్టించుకోరు, పార్ట్‌నర్‌తో సమయం గడపడానికి ఇష్టపడరు. పార్ట్‌నర్‌తో మంచిగా మాట్లాడాలని లేదా సమయం గడపాలని వారు కోరుకోరు.


వారాహి గుప్త నవరాత్రులు ఎలా చేస్తారంటే..

శరన్నవరాత్రుల గురించి తెలుసు..ఈ వారాహి నరవాత్రులు ఏంటి? వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా? అసలు వారాహీ దేవి ఎవరు? ఈమె గురించి పురాణాల్లో ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఆషాడ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ తొమ్మిది రోజుల పాటూ వారాహి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయొచ్చా? వారాహీ అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది? పురాణాల్లో వారాహి అమ్మవారిగురించి ఉందా అంటే.. బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్యపురాణం...ఈ మూడింటింలో వారాహీ దేవి మహిమల గురించి ఉంది. అని బలాత్రిపురసుందరిదేవి కాలభైరవ పీఠాధిపతి గణేష్ గారు లోకల్ 18 కు వివరించారు. శ్రీకాకుళం పట్టణంలో బలగలో ఉన్న బలాత్రిపురసుందరిదేవి కాలభైరవ ఆలయంలో వారాహి నవరాత్రులు కుంకుమ అర్చనలు ప్రతిరోజు హోమం వంటివి ఇక్కడ చేస్తారు. వారాహి అమ్మవారు ఆర్తులకు శుభాన్నిస్తుంది అహంకారం, అసూయ, ఈర్ష్య,ద్వేషంతో ఉండే ధూర్తులను దూరంగా పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు. అంటే.. తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి వెళ్లకూడదు. బ్రహ్మవిద్యా స్వరూపిణిగా ఎవ్వరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృత మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి.


Vastu Tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం అశుభం.. విషాదం జరిగే ప్రమాదం ఉంది..!

వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే అశుభంగా భావిస్తారు. ఇక పూజ లేదా ఇతర సమయాల్లో ఇంట్లో దీపం సరైన దిశలో ఉంచక పోతే వాస్తు దోషం ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. దీని ప్రభావం ఘోరంగా ఉంటుందని.. సంక్షోభాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని చెపుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో నిరంతర ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే.. అది వాస్తు లోపానికి సంకేతమంట. ఇంట్లో తప్పుడు దిశలో దీపం వెలిగించడం కూడా దీనికి కారణం అయ్యి ఉండవచ్చని చెపుతున్నారు. వాస్తు దోషాలు రాకుండా ఉండాలంటే ఇంట్లో, ఆఫీసులో, షాపులో ఏ దిశలో దీపం వెలిగించాలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. దీపం వెలిగించడానికి సరైన దిక్కు: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు ముందుగా దేవుని గది ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఈశాన్య దిశలో దేవుని గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఉదయించే సూర్యుని దిశలో భగవంతుని ప్రతిష్ఠ తూర్పు ముఖంగా ఉండాలి. దీపం వెలిగించడానికి తూర్పు దిక్కు కూడా అనువైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల నిర్మాణ లోపాలు తొలగిపోతాయంట అంతేకాదు అనుకోని ప్రమాదాలను కూడా నివారించ వచ్చని పండితులు అంటున్నారు. దీపం వెలిగించేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి - జ్యోతిషశాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు అనేక విషాద సంఘటనలకు దారితీస్తాయి. దీనిలో ఇంట్లోని దేవుని మందిరం వద్ద.. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం.. ఇది కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఘటనలు జరిగితే.. వెంటనే పండితులకు ఇంటిని చూపించి తగిన పరిష్కారం చేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో రోజువారీ పూజ-ఆచారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని సంతోషంగా ఉంచుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు రావు.. ఇక సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.. (గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష పరిజ్ఞానంపై ఆధారపడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. న్యూస్ 18 తెలుగు దీనికి హామీ ఇవ్వదు.)


మహిళా నృత్య కళాకారిణికి అపూర్వ గౌరవం.. ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించిన యునెస్కో..!

పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా.. కళ, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ చౌనృత్యం ఈ జిల్లా సంప్రదాయాలలో ఒకటి. పురూలియా నటి మౌషుమి చౌదరి దీనిని ప్రపంచ ఖ్యాతికి తీసుకు వెళ్లారు. రకరకాల మాటలకు, అవమానాలకు ఆమె భయపడలేదు. సమాజం ముందు ధైర్యంగా నిలబడి.. తన ప్రతిభను చూపింది. దీంతో అందరూ ఆ అద్భుత ప్రతిభకు దాసోహం అయ్యారు.. నేడు దేశ విదేశాల్లో ఆమె డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.మౌసుమీ జీవిత కథను ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ గుర్తించింది....


Potato Punugulu: బంగాళదుంప పునుగులు రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!

Potato Punugulu Recipe: బంగాళదుంప పునుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం ఎంతో సులభం. దీని కోసం ఇంట్లో తరుచు ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.


వ‌ర్షాకాలంలో ఆహారాల‌ను నిల్వ చేసే చిట్కాలు!

వ‌ర్షాకాలంలో వైర‌ల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువ‌గా ఉంటుంది. తాజా ఆహారం కూడా ఎక్కువ‌సేపు నిల్వ ఉండ‌దు. ఇలా పాడైన ఆహారం తెలియ‌క తిన‌డం వ‌ల‌న రోగాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అందుకే వ‌ర్షాకాలంలో ఆహారాల‌ను నిల్వ ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాల తెలుసుకుందాం.


Ashadam: ఆషాఢమాసంలో ఆడవారు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాల ఇష్టంగా జరుపునే పండుగ కూడాఉంది అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే అమ్మాయిల చేతులకి అందం వస్తుంది అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం అమ్మాయిలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాడం వచ్చిదంటే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఇది ఈకాలం ఫ్యాషన్ కాదు.. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.అయితే ఇలా ప్రతీ ఏటా ఆషాడంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో మనం గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలు కూడా గోరింటాకు పెట్టుకుంటాారు. చేయి ఎర్రగా పండితే.. వాళ్లకు మంచి మొగుడు వస్తాడని కూడా అంటారు. ఇలాంటివి మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం.


Raashi Khanna | టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఒంపులు చూస్తే పిచ్చెక్కాల్సిందే

raashi khanna, raashi kahanna pics, raashi khanna latest photoshoot, raashi khanna photoshoot. raashi khanna bikini, raashi khanna instagram, rashi khanna red dress pics, rashi khanna photos


జుట్టుకు నెయ్యి రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

నెయ్యి వ‌ల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నెయ్యి తిన‌డం వ‌ల‌్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నెయ్యిని జుట్టుకు రాయ‌డం వ‌ల‌్ల ఏం అవుతుంద‌ని చాలా మందికి సందేహం ఉంటుంది. అందుకే నెయ్యితో జుట్టుకు ఏమైనా ప్రయోజనం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.


మీ జీవితాన్ని సులభతరం చేసే అలవాట్లు ఇవే!

కొన్ని అలవాట్లు మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. అలాగే నిండు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Parenting | సాయం చేయనిద్దాం.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పరుద్దాం

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.


పెరుగును ఉప్పుతో తింటే మంచిదా? చక్కెరతో తింటే మంచిదా?

పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది పెరుగును ఒక్క ఎండాకాలంలోనే తింటుంటారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుందని. కానీ పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. చలికాలమైనా, వానాకాలమైనా పెరుగును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలా మంది పెరుగును ఉప్పుతోనే తింటుంటారు. కానీ కొంతమంది మాత్రం చక్కెరతో తింటుంటారు. అసలు పెరుగును ఉప్పుతో తింటే మంచిదా? చక్కెరతో తింటే...


మహిళల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచే యోగాసనాలు!

మహిళల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.


మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు

మెడల్ పట్టుకొచ్చేదెవరు?..పారిస్ ఒలింపిక్స్ బరిలో ఆరుగురు రెజ్లర్లు ఏడాదికిపైగా ఇండియన్ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి మరో 8 రోజుల్లో ఒలింపిక్స్​ (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


ఆషాఢమాసంలో.. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరాల్సిందే..

అమ్మవారి నవరత్రి పూజలను ఎక్కువగా మనం దసరా నవరాత్రుల్లో చూస్తుంటాం.. కానీ కరీంనగర్, జిల్లా నగునూర్ గ్రామంలో ఉన్న శ్రీ పరివార సమేత దుర్గ భవాని అమ్మవారికి మాత్రం ఆషాఢం మాసంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాడ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కళలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్రబృందంతో కలిసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ శారదాపీఠం వారి ఆధ్వర్యంలోని వాళ్ళ సలహా సూచనల ప్రకారమే నిర్మించి దుర్గ దేవి అమ్మ వారితో పాటు సరస్వతి, గాయత్రి, ఎల్లమ్మ తల్లి పార్వతి దేవి.. ఇలా అందరు దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆషాఢ మాసం నవరోతోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాతులవుతున్నారన్నారు ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు..ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు. ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్ , వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్ , విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని కోరుకున్న వారికి కొంగుబంగారంగా అమ్మవారు కరుణిస్తున్నారని ఈ అమ్మవారి ఉత్సవాలు 15 రోజులు జరుగుతాయని గురు పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు పూజారులు తెలిపారు..


School Holidays: ఈరోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఈనెల్లో మరో 3 రోజులు హాలిడేస్‌!

Schools and Colleges Holiday: విద్యార్థులకు ఈనెలలో సెలవులు బాగానే వస్తున్నాయి. ఈరోజు (బుధవారం- జులై 17) మొహర్రం పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.


Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

Curry Leaves : కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే ఏంచక్కా తింటారు. అవేంటో తెలుసుకోండి.


పల్లీలు, నువ్వులని ఇలా తీసుకుంటే వెన్నునొప్పి దూరమై జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఇంట్లో తయారైన పౌడర్ తీసుకోవడం చాలా మంచిది. అదేంటో తెలుసుకోండి.


వర్షాకాలంలో మీ జట్టు చింపిరిగా మారి చిక్కులు పడుతోందా? అయితే ఈ టిప్స్‌ మీకోసమే

వర్షాకాలంలో వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురుకావచ్చు. ఈ సీజన్‌లో జుట్టు రాలిపోవడం, మాడు పొడిబారడం, చుండ్రు వంటివి కామన్‌ ప్రాబ్లమ్స్. దీనివల్ల జుట్టు చింపిరిగా మారి చిక్కులు పడవచ్చు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే హెయిర్ కేరింగ్‌పై దృష్టి పెట్టాలని చెబుతున్నారు ‘డాక్టర్ రాషెల్’ స్కిన్‌కేర్ బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు దేవ్‌జీ హథియా. ఇందుకు వర్షాకాంలో పాటించాల్సిన జాగ్రత్తలు, చిట్కాలను తాజాగా జాగ్రన్ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో షేర్ చేసుకున్నారు. అవేంటో చూద్దాం. వెడల్పాటి దంతాల దువ్వెన : సన్నని దువ్వెనతో పోలిస్తే, వెడల్పాటి దంతాల దువ్వెనతో జుట్టు దువ్వుకోవడం మంచిది. దీంతో చిక్కులను సరిగా విడదీయవచ్చు. తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే దువ్వేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేశాక హెయిర్‌కు కండీషనర్ లేదా సీరమ్ అప్లై చేస్తే కోంబ్‌ చేసుకోవడం ఈజీ అవుతుంది. చిక్కులు కూడా పడవు. స్కాల్ప్ క్లీన్‌గా ఉంచుకోవడం : ఈ సీజన్‌లో తలలో చాలా మురికి, ధూళి పేరుకుపోతాయి. ఇవి జుట్టు కుదుళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే వారానికి రెండు నుంచి మూడు సార్లు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు దెబ్బతీనకుండా, చిక్కులు పడకుండా ఉండాలంటే కెరటిన్ షాంపూ, కండీషనర్ వాడాలి. జుట్టుకు హాని కలిగించే కెమికల్స్ లేని నేచురల్ లేదా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. వర్షాకాలంలో స్కాల్ప్ నుంచి ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నూనె ఎక్కువగా రాసుకోకూడదు. ఆయిలింగ్ తప్పనిసరి : హెయిర్‌ హెల్త్ ప్రొడక్ట్ చేసుకోవడానికి నేచురల్ ఆయిల్స్‌ అప్లై చేసుకోవాలి. ఆనియన్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ వంటివి వాడటం మంచిది. పల్చని జుట్టు ఉన్నవారు నూనె రాస్తే జుట్టు మరింత పలుచగా కనిపిస్తుంది. అందుకే మందపాటి హెయిర్ ఉన్న వ్యక్తులు ఈ నూనెలను వాడవచ్చు. కర్లీ హెయిర్, ఇతర హెయిర్ టైప్స్‌కు జెల్ రాసుకోవచ్చు. తద్వారా హెయిర్ డ్యామేజ్ బ్రేకేజీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మైక్రోఫైబర్ టవల్ : వానాకాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మైక్రోఫైబర్ టవల్ వాడాలి. స్నానం చేసిన తర్వాత తువాలుతో జుట్టును బలంగా రుద్దుకోకూడదు. దీనివల్ల కుదుళ్లు దెబ్బతినడంతో పాటు జుట్టు చిట్లిపోతుంది. హెయిర్ వాల్యూమ్ తగ్గుతుంది. అవి వద్దు : హెయిర్ డ్రయర్, స్ట్రెయిటెనర్ వంటి టూల్స్‌ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడి నుంచి జుట్టును రక్షించే హీట్ ప్రొటెక్టంట్ కచ్చితంగా ఉపయోగించాలి. డైరెక్ట్ హీట్ కారణంగా కుదుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. హీట్ ప్రొటెక్టంట్ అనేది హీట్ నుంచి హెయిర్‌కు ఒక ప్రొటెక్షన్ లేయర్ అందిస్తుంది.


మొక్కజొన్న తింటే ఏమవుతుందో తెలుసా?

వర్షంలో వేడి వేడి మొక్క జొన్నపై నిమ్మరసం, ఉప్పు, కారం జల్లి తింటుంటే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో సాయంత్రం అయితే చాలు.. రోడ్డు పక్కనున్న బండి దగ్గర నిలబడి కాల్చిన మొక్కజొన్నను తింటుంటారు. కానీ మొక్కలను జొన్నలను తింటే ఏమౌతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా...


Jaggery Tea : బెల్లం టీ ఆరోగ్యానికి మంచిదని తాగుతున్నారా..

Jaggery Tea : కొంతమంది పంచదార బదులు బెల్లం వాడతారు. దీంతో టీ చేసుకుని తాగుతారు. దీని వల్ల లాభాలున్నాయో లేదో తెలుసుకోండి.


జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను చూడాల్సిందే!

లోయలు చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రపంచంలో అందంగా ఉండే వ్యాలీల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాలీల దగ్గర ప్రకృతి రమణీయంగా ఉంటుంది.


స్లీప్ విడాకుల వల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో తెలుసా?

స్లీప్ విడాకుల గురించి విన్నవారు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ దీన్ని ఫాలో అవుతున్న వారు మాత్రం చాలా మంది ఉన్నారు. అసలు ఏంటీ ఈ స్లీప్ విడాకులు, దీనివల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఈ మధ్య కాలంలో స్లీప్ డిరోర్స్ ట్రెండ్ బాగా పెరిగింది. భార్యా భర్తలు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి, నిద్రలేమిని తగ్గించుకోవానికి, సంబంధాలను మెరుగుపర్చడానికి ఒక ప్రత్యామ్నాయంగా స్లీప్ డివోర్స్ ను ఫాలో అవుతున్నారు. స్లీప్ డివోర్స్ అంటే...


ఈ ఇండోర్ మొక్కలతో ఇల్లు సువాసనభరితం!

కొన్ని ఇండోర్ మొక్కలు ఇంటిని సువాసనభరితంగా మారుస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Ekadasi 2024: ఇవాళ తొలి ఏకాదశి... స్త్రీలు ఈ పనులు పొరపాటున కూడా చేయోద్దు.. !

ఆషాఢమాసం ప్రారంభం అయ్యిందంటే చాలు.. తెలుగువారికి వరుసగా పండగలే పండుగలు వస్తాయి. అందులో ముందుగా వచ్చేది ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు స్వామి వారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ రోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి. దేవశయని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణు మూర్తికి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసీ ఆకులు ఒకటి. తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ పూర్తి కాదని భక్తుల విశ్వాసం. కాబట్టి శ్రీమహా విష్ణు దర్శనానికి వెళ్లినా, పూజ చేసిన కచ్చితంగా తులసీ ఆకులు వాడాల్సిందే. ఇర ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఆహారం అస్సలే ముట్టుకోవద్దు. ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్దాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజు మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే ఇవి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్ట లేకపోవచ్చు. దానం చేయాలి: తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా... దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్పు పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. బ్రహ్మచర్యం పాటించాలి: తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజును మీరు విష్ణు మంత్రాలను పటిస్తూ.. రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉపవాసం ఉంటే మరింత మంచిది: తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు. అంటే ఉపవాసం ఉండాలని అర్థం. పండ్లు, ఫలాలు, తాగితే ఏం కాదు. కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి. ఈ రోజున ఈ రోజు స్త్రీలు నిండు స్నానం చేయకూడదు. గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం మానుకోవాలి. దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి. విష్ణు మంత్రాలు పఠించాలి దేవశయని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు.. ఓం నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఉపసవాసం పాటిస్తే.. విష్ణువు అనుగ్రహంతో పాటు.. లక్ష్మీ కటాక్షం కూడా దక్కుతుంది. అందుకే ఏకాదశి రోజున తప్పకుండా పైన చెప్పినవన్నీ పాటించాలి.


ఇంట్లో నెయ్యిని చాలా ఈజీగా ఎలా తయారుచేయాలి?

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని రోజూ ఒక టీ స్పూన్ తింటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. అందుకే మన దేశంలో నెయ్యని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. నిజానికి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది ఇంతకు మించి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వెన్నే నెయ్యిగా మారుతుంది. ఇది లాక్టోస్, కేసైన్ లేనిది. లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉన్నవారు నెయ్యిని తినకపోవడమే మేలు. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్ ఎ,...


అంబానీ కోడళ్లు.. ఎవరు ఏం చదువుకున్నారో తెలుసా..?

అంబానీ కొత్త కోడలి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. నెట్టింట ఎక్కువగా వెతుకుతున్నారట కూడా. మరి.. అంబానీ ఇంట అడుగుపెట్టిన ఇద్దరు కోడళ్లు.. ఏం చదువుకున్నారు..? వారి బ్యాగ్రౌండ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం.... మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా... ముకేష్ అంబానీ తన ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం చాలా గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అంబానీ కుటుంబానికి సంబంధించిన...


Litchi Fruit: లిచీ పండ్ల గింజ‌ల‌ను ప‌డేయ‌కండి.. దీని వల్ల కలిగే లాభాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు..!

Litchi Fruit Seeds: లిచీ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పండు మాత్రమే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


జుట్టును ఒత్తుగా మార్చే బయోటిన్ రిచ్ ఫుడ్స్‌!

ఒత్తైన జుట్టును అందర్నీ ఆకర్షిస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక్కడ చెప్పిన ఆహారాలు తింటే జుట్టు బలంగా, నల్లగా మారుతుంది.


అమ్మ ప్రేమను మించింది లేదు.. కుమారుడికి కాలేయం దానం చేసిన తల్లి..!

మాతృప్రేమ కంటే గొప్పదేది విశ్వంలో లేదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ.. అనుదినం కాపాడే తొలి రక్షకురాలు తల్లి. మాతృప్రేమకు మరొకటి సాటి రాదనే విషయం మరోసారి రుజవైంది. తన కుమారుడి ప్రాణం నిలబెట్టేందుకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడింది. కుమారుడికి లివర్ దానం చేసిన మరోసారి జన్మనిచ్చింది.


ఈ నేచురల్ సప్లిమెంట్లతో నిత్య యవ్వనంగా!

కొన్ని నేచురల్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


వర్షాకాలంలో చేపలు తింటే ఏమౌతుందో తెలుసా?

చేపలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది వారంలో ఒక్కసారైనా చేపలను ఖచ్చితంగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో చేపలను తింటే ఏమౌతుందో తెలిస్తే అస్సలు తినరు. చేపలు మంచి పోషకాహారం. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివని చాలా మంది వారానికి ఒక్కసారైన తింటుంటారు. నిజానికి చేపలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.కానీ వానాకాలంలో అయితే కాదు. అవును వానాకాలంలో చేపలను...


మనీప్లాంట్ ఇలా పెంచితే.. ఆదాయం పెరగదు.. మీ ఆయుష్షు కరిగిపోతుంది..!

చాలామంది ఇంట్లో అలంకరణగా గాజు సీసా, కుండలో మనీ ప్లాంట్ పెంచుతుంటారు. మీరు కూడా ఇలాగే మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే ఈ వార్తని ఖచ్చింగా చదవండి. మనీప్లాంట్ కారణంగా ఇంట్లోకి డెంగ్యూ దోమలు ప్రవేశించి.. మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనారోగ్యానికి గురవుతుందంట. మనీప్లాంట్ ని కొందరు గాజు బాటిళ్లలో నీరు వేసి పెంచుతారు. తమ ఇళ్లలో ఆర్థిక శ్రేయస్సు కోసం మనీ ప్లాంట్లను పెంచుతారు. ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందని ఉంచుతుందని చెబుతారు. అంతేకాక ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని కూడా శుద్ధి అంటారు. నిజానికి ఇలా జరగాలంటే మనీప్లాంట్ నాటిన గాజు బాటిల్ ను ఎప్పటికప్పుడు శుభ్రాం చేయాలి. నీటిలో మనీప్లాంట్ మొక్క పెంచుతున్నట్లు అయితే.. రాత్రి పడుకునే ముందు దోమతెరలతో పడుకోవాలి. చీకటి పడగానే కిటికీలు, తలుపులు మూసేయండి. అలాగే శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించండి. వర్షాకాలంలో సాధారణ దగ్గు, జ్వరం ఉన్నా వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలి. లేకపోతే ఈ సాధారణ జ్వరం కూడా తీవ్రంగా మారుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధుల భయం ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో మలేరియా, కామెర్లు, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం మనీ ప్లాంట్స్ మాత్రమే కాదు, ఇతర మొక్కల కుండీలు డెంగ్యూ దోమలను పెంచుకుంటాయి. వీటితో పాటు ఇంట్లోని నీటి పాత్రలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. నీటిని ఎక్కువగా నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమ నీటిలో ఒకేసారి 250 గుడ్లు పెడుతుందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ దోమ తన జీవితకాలంలో 3 సార్లు గుడ్లు పెడుతుంది. కాబట్టి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ గుర్తుంచుకోండి. (గమనిక: ఈ సమాచారం నిపుణులతో చర్చలపై ఆధారపడి ఉన్నాయి. మీ ఆరోగ్యం గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులని సంప్రదించండి.. ఏదైనా నష్టానికి న్యూస్ 18 తెలుగు దీనికి బాధ్యత వహించదు.)


హెయిర్ డ్యామేజ్‌ నివారించే జ్యూస్‌లు ఇదిగో!

జుట్టు డ్యామేజ్ తగ్గించి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో కొన్ని జ్యూస్‌లు సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఆప్రికాట్ ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటారు..!

ఆప్రికాట్.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? రుచికి చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా వీటిని అందరూ పెద్దగా తినరు. కానీ.. ఈ ఆ ప్రికాట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా రోజూ తింటారట. మనం ఆరోగ్యంగా ఉండేందుకు.. మన శరీరానికి ఎన్ని న్యూట్రియంట్స్ అవసరమో.. అన్ని న్యూట్రియంట్స్.. ఆప్రికాట్ లో పుష్కలంగా ఉంటాయట. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... ఆప్రికాట్స్ లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ,...


Nuts And Seeds For Skin: అందాని పెంచుకోవాలంటే ఈ నట్స్‌, సీడ్స్‌ తప్పకుండా తినాలి?

Seeds For Skin Whitening: ఆహారం నట్స్, విత్తనాలను చేర్చుకోవడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే ఎలాంటి నట్స్‌ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.


అలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకునే రాశుల వారు వీళ్లే.. కొంచెం కష్టమే..

మన జీవితంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అమ్మ ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఆప్యాయతతో వడ్డించే భోజనం, ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసే సపర్యలు, కష్టం వచ్చినప్పుడు చెప్పే ధైర్యం.. ఇలా ఎన్నో సందర్భాల్లో అమ్మ మనకు తోడునీడలా ఉంటుంది. పెరిగి పెద్ద అయిన తరువాత పెళ్లి చేసుకోవడం సహజం. అయితే కొందరు మగవాళ్లు తమ జీవితంలోకి అమ్మ లాంటి వ్యక్తి భార్యగా రావాలని కోరుకుంటారు. భార్య కూడా తల్లిలా ప్రేమానురాగాలు చూపాలని భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. తల్లి లక్షణాలు భార్యలో ఉండాలని కోరుకునే రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి మగవారు, తల్లిలా ఇంటిని చక్కగా మెయింటెన్ చేసే వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరు చిన్నప్పుడు అమ్మ ఇంటిని చక్కబెట్టే విధానాన్ని దగ్గరి నుంచి చూస్తారు. ఆ ప్రభావంతో పెద్దయ్యాక పరిశుభ్రత, ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. భార్య కూడా ఇలాంగే ఉండాలనుకుంటారు. సురక్షితమైన, ప్రేమపూర్వక సంబంధం కోసం తమ మాతృమూర్తి లక్షణాలను బెంచ్‌మార్క్‌గా భావిస్తారు. వృషభంవృషభరాశి వారు అమ్మానాన్నల మాదిరిగా గొప్ప ప్రేమను చూపే భాగస్వామి తమ జీవితంలోకి రావాలని కలలు కంటారు. వీరు చిన్నప్పుడు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా నిశితంగా గమనించే అలవాటు ఉంటుంది. తల్లిదండ్రుల సంబంధాలను పరిశీలిస్తుంటారు. చాలా విషయాల్లో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అమ్మను ఎమోషనల్ సపోర్ట్‌గా భావిస్తారు. తమకు కాబోయే భార్యలో దయాగుణం ఉండాలనుకుంటారు. సున్నిత మనస్తత్వం, శ్రద్ధ వహించే మహిళలను ఇష్టపడతారు. కర్కాటకంకర్కాటక రాశివారు తమ కుటుంబ సభ్యులు చూపే ఆప్యాయతను మించిన ఆనందం మరోటి ఉండదని భావిస్తుంటారు. తమ జీవితంలో వచ్చే భార్య తల్లిలాగా ప్రేమను పంచాలని అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశివారికి తమ తల్లులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వారితో స్నేహంగా మెలుగుతారు. ఈ ప్రత్యేకమైన చొరవతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటారు. అందుకే అమ్మతో మంచిగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఈ రాశివారు తమ బాల్యంలో తల్లులతో ఉన్న అనుబంధం, పెంపకం, అలాంటి వాతావరణాన్ని తిరిగి అందించే భాగస్వాములను కోరుకుంటారు. ఇంట్లో ఓదార్పును, ప్రేమను పంచే ఇల్లాలు ఉండాలనుకుంటారు. మేషంబాల్యంలో తల్లులు తమ పట్ల చూపిన శ్రద్ధ, అంకితభావం గురించి మేషరాశివారు ఆలోచిస్తుంటారు. స్కూల్ హోంవర్క్‌లో తల్లి చేసే సహాయం, లంచ్ బాక్స్‌లను సిద్ధం చేయడంలో తల్లిచూపిన శ్రద్ధను గుర్తుకు తెచ్చుకుంటారు. మేషరాశివారు తమ తల్లులను బాగా ఆరాధిస్తారు. బాల్యంలో తల్లులు చేసిన విధంగా తమ జీవిత భాగస్వాములు ఉండాలని, అదేవిధంగా సేవ చేయాలని కోరుకుంటారు. భార్యకు ఎమోషనల్ సపోర్ట్ అందించాలనుకుంటారు. ఇంటి పనులను విభజించుకుని పని భారం తగ్గించాలనుకుంటారు. ఎందుకంటే ఇంటి సంరక్షణ భారం పూర్తిగా ఏ జీవిత భాగస్వామిపైనా ఉండదని వారు భావిస్తారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)