మాస్టార్లు

  • ఉమ్మడి జిల్లాలోని ఈ గురువులు.. ఆదర్శప్రాయులు
  • వృత్తికే వన్నెతెస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
  • వారి సేవలకు వరించిన రాష్ట్ర పురస్కారం
  • నేడు హైదరాబాద్‌లో సత్కారం

అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి.. అక్షర జ్ఞానాన్ని నింపేది గురువులు.. క్రమశిక్షణను అలవర్చి భవిత కు బంగారు బాటవేసేది వారే.. వేతనం కోసం కాకుండా విద్యార్థుల జీవన గమనాన్ని నిర్దేశిస్తూ.. ఉత్తమ ఫలితాల సాధనకు అంకితభావంతో పనిచేస్తూ ఎందరికో ఆదర్శ ప్రాయులుగా నిలుస్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ.. వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్న ఆణిముత్యాల్లాంటి ఉపాధ్యాయుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ని పలువురు మా‘స్టార్లు’ రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోనున్నారు. వారు విద్యాభివృద్ధికి చేసిన సేవలపై కథనం..

కందనూలులో ఇద్దరు..

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 4 : నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి ఇద్దరు టీచర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉ పాధ్యాయులుగా ఎంపికయ్యారు. కల్వకుర్తి మండ లం జీడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్న పి.రఘుమారావు, తెలకపల్లి మండలం చిన్నముద్దునూర్‌ ఎంపీయూపీఎస్‌లో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న జె.రాజశేఖర్‌రావు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ సం దర్భంగా ఉపాధ్యాయులను డీఈవో గోవిందరాజులు అభినందించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి వారిని సన్మానించనున్నట్లు డీఈవో తెలిపారు.

నిత్య కృషీవలుడు.. కిశోర్‌

విద్యార్థులతో కలిసిపోయే వ్యక్తిగా పేరు పొందిన పాలమూరు విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిశోర్‌ రాష్ట్ర స్థాయి ఉత్త మ అవార్డుకు ఎంపికయ్యారు. డా.కిశోర్‌ తల్లిదండ్రులు అనంత్‌రావు, ప్రేమలత, భార్య డా.శ్రీదేవి. ఈయన ఎంఎస్సీ పీహెచ్‌డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. పీయూలో 2009లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరిన అనంతరం అనేక రకాల బాధ్యతలు చేపట్టారు. ముఖ్య పర్యవేక్షకుడిగా, విభాగాధిపతిగా, కళాశాల డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కోఆర్డినేటర్‌గా, పీయూ పరిధిలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు డైరెక్టర్‌గా, పీయూ పాలక మం డలి సభ్యుడిగా, ఐక్యూఏసీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

అనేకమంది విద్యార్థులు పీహెచ్‌డీ సాధించేందుకు దోహదపడ్డారు. డిగ్రీ విద్యార్థుల ఉపయోగార్థం 5 తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు ఇంటర్నేషన ల్‌ గ్రంథాల్లో 22 పుస్తకాలు ప్రచురించారు. అనేక రకాలైన అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్ర స్తుతం ఔషధ మొక్కలు పెంచే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు అందుకొని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ పరిశ్రమలకు సైంటిస్టుగా, సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ యన సేవలు గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపిక చేసింది.

కవిత.. బోధనే వేరప్పా..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు నాటి, నేటి పద్ధతులను మేళవింపజేస్తూ విద్యార్థుల ఆసక్తి అభిరుచికి అనుగుణంగా సులభ రీతిలో విద్యను అందిస్తూ ముందుకు సాగుతుంది దేవరకద్ర మండలంలోని పెద్దరాజమూరు యూపీఎస్‌ ఉపాధ్యాయురాలు డి.కవిత. ఆమె స్వగ్రామం హన్వాడ మండలంలోని దాయపల్లి. అమ్మానాన్న వెంకటరంగారెడ్డి, వసంత దంపతులు. ఉపాధ్యాయురాలు కవిత 2000 లో ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు.

మద్దూరు, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర మండలాల్లో విధులు నిర్వర్తించారు. వినూత్న విధానంలో తనదైన శైలిలో ప్రత్యేకంగా పాఠశాల ఫ్లోరింగ్‌ను బోధన అభ్యాసన సామగ్రిగా వినియోగించుకోవడం (బిల్డింగ్‌ యాజ్‌ ఏ లెర్నింగ్‌ ఎయిడ్‌) ‘బాలా’ ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వైకుంఠపాళి, ఎక్కాల చట్రం, నెంబర్స్‌, ఆల్ఫాబేట్‌ కాన్సెప్ట్‌ గేమ్‌ను ఫ్లోరింగ్‌పై తానే స్వయంగా చిత్రీకరించిన గేమ్స్‌ ద్వారా విద్యార్థులు ఉల్లాసంగా ఆడుతూ బోధన విషయాలను ఆసక్తితో నేర్చుకునేలా బోధనలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ ముందుకు సాగుతున్నారు.

అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీఎల్‌ఎంను తయారు చేసి విద్యార్థులు బోధనాభ్యాస ప్రక్రియలో ఆసక్తిగా పాల్గొనేటట్లు చేస్తున్నారు. కళావిద్య, నోబ్యాగ్‌ డే, యోగా, బాలసభ, ఎండీఎం, వార్షిక స్వాగతోత్సవాలు నిర్వహించడం, టీఎల్‌ఎం మేళాలు, ప్రత్యేక రోజులకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వివరించడం, ఆరోగ్య పరీక్షలు చేయించడం, క్షేత్ర ప్రదర్శనలు, విద్యార్థుల ఆసక్తి అభిరుచికి అనుగుణంగా వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తుండడంతో ఆమెను రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది.

నోకాస్ట్‌.. లోకాస్ట్‌.. నర్సింహులు

ఉపాధ్యాయ వృత్తిలో 26 సంవత్సరాలుగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు కోళ్ల నర్సింహులు. ఈయన స్వగ్రామం నారాయణపేట జిల్లా మక్తల్‌. తల్లిదండ్రులు కోళ్లరాములు, కోళ్ల శంకర మ్మ అత్యంత నిరుపేద కుటుంబం. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తన ముగ్గురు బిడ్డలను కష్టపడి చదివించారు. వారి కష్టానికి తగ్గట్టుగానే ఇంటికి పెద్దవాడైన కోళ్ల నర్సింహు లు 1998 డీఎస్సీలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మొట్టమొదట గట్టు మండలంలోని సిద్ధోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం గట్టు. అప్పట్లో ‘చదువుకుందాం రా’ అనే కార్యక్రమంలో విస్తృతంగా విశేష సేవలు అందించారు.

అనంతరం ధరూర్‌, నవాబ్‌పేట మండలాల్లో పనిచేసి ప్రస్తుతం కోయిలకొండ మండలంలోని ఇబ్రహీంనగర్‌ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. గతేడాది టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామగ్రి)లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. విద్యార్థులతో మమేకమై సులభతరంగా గుణాత్మకంగా ఉత్తమ బోధన అందిస్తారనే పేరు ఉంది. నోకాస్ట్‌.. లోకాస్ట్‌.. పేరుతో టీఎల్‌ఎం ద్వారా తక్కువ ఖర్చుతో వివిధ రకాలైన బొమ్మలు తయారు చేసి విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో బోధనకు గానూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది.

ఉపాధ్యాయ ఆణిముత్యం సునీత

నారాయణపేటరూరల్‌, సెప్టెంబర్‌ 4 : మండలంలో ని కోటకొండ జీహెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న సు నీత రాష్ట్రస్థాయి ఉత్తమ జీహెచ్‌ఎం అవార్డుకు ఎంపికైం ది. ఈమె స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం. ప్రస్తు తం మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్నారు. 12 సంవత్సరాలు ఎస్‌జీటీగా మహబూబ్‌నగర్‌ బేసిక్‌ ప్రాక్టిసింగ్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 20 ఏండ్లపాటు స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల జరిగిన పదోన్నతుల్లో జీహెచ్‌ఎంగా కోటకొండ జెడ్పీహెచ్‌ఎస్‌కు వచ్చింది. నేడు రవీంద్రభారతిలో ఆమె రాష్ట్రస్థాయి అవార్డును అందుకోనున్నారు.

శభాష్‌.. శంకర్‌గౌడ్‌

వనపర్తి టౌన్‌/పెబ్బేరు, సెప్టెంబర్‌ 4 : పెబ్బేరు మం డలం యాపర్ల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పలుస శంకర్‌గౌడ్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. మూడు దశాబ్దాలకుపైగా విద్యాశాఖకు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆయన అవార్డు అం దుకోనున్నారు. శంకర్‌గౌడ్‌ పనిచేసిన ప్రతి పాఠశాలలో అక్షరదీక్ష , విలువల విద్య, బాల సాహిత్య సభలతోపాటు సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడిగా వివి ధ అంశాలకు సంబంధించిన దాదాపు 30వేలకు పైగా పుస్తకాలను సేకరించి శా ఖ గ్రంథాలయాలకు అందజేశారు.

2024-09-04T20:39:29Z dg43tfdfdgfd