సాధారణంగా సోషల్ మీడియాలో కుక్కల ప్రవర్తనను చూసినప్పుడు. అవి నెగిటివ్ బిహేవియర్ లో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఈ ప్రవర్తన వెనుక ఉన్న ప్రధాన కారణం వారి పెరుగుతున్న పళ్లే కావచ్చు. మానవ శిశువుల వలె, కుక్కలు కూడా పళ్ల మార్పు దశను ఎదుర్కొంటాయి. ఈ దశలో పాల పళ్లు ఊడిపోయి.. శాశ్వత పళ్లు వస్తుంటాయి. అందుకే కొంత అసౌకర్యం, నమలడం అనే అలవాట్లు సాధారణం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పళ్లు రావడం కుక్కలకు ఒక ముఖ్యమైన శారీరక పరిణామ దశ. ఈ సమయంలో పాల పళ్లు విడిపోతూ, శాశ్వత పళ్లు వచ్చేందుకు మార్గం సులభతరం అవుతుంది. ఈ దశలో కుక్కలకు కొంత బాధ కలుగుతుంది. కాబట్టి అవి వస్తువులను నమలడం ద్వారా తాము పడుతున్న అసౌకర్యాన్ని తగ్గించుకుంటాయి.
కుక్కల వయసు, జాతిపై ఆధారపడి పళ్ల మార్పు దశ మారుతూ ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 4 నెలల వయసులో పాల పళ్లు ఊడిపోతాయి. ఆ తర్వాత 6 నుంచి 8 నెలల లోపు పూర్తి స్థిరమైన పళ్లు వచ్చే దశ పూర్తవుతుంది. ఈ సమయంలో మీ కుక్కకు ఎక్కువగా చిరాకు ఉండటం, చిగుళ్లలో నొప్పి పడటం, కొన్నిసార్లు ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ కుక్క నమిలే అలవాటును సురక్షితమైన బొమ్మల వైపు మళ్లించడం చాలా ముఖ్యం. ట్రీట్స్ పెట్టి ఫ్రీజ్ చేసిన కాంగ్ బొమ్మలు లేదా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచే పళ్ల నమిలే బొమ్మలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
నమలడం ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ.. మీ పెంపుడు ప్రాణి అవసరం లేని వస్తువులను నమలకుండా చూసుకోవడం అవసరం. అందుకు వస్తువులను వాటికి అందకుండా దూరంగా ఉంచడం లేదా అవసరమైతే వాటిపై రుచికరంగా లేని స్ప్రేలను ఉపయోగించడం మంచిది. ఈ పరిస్థితుల్లో శిక్షణ చాలా అవసరం. పెంపుడు జంతువుల ప్రవర్తన నియంత్రణలో నిరంతర శిక్షణ, సహనం కీలకం.
అంతేకాకుండా ఇంట్లో వస్తువులను మరింత సురక్షితంగా ఉంచడానికి తాత్కాలికంగా పిల్లల కంట్రోల్ గేట్లు లేదా బోన్లు ఉపయోగించవచ్చు. కానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసం పాజిటివ్ రీఇన్ ఫోర్స్ మెంట్ ట్రైనింగ్ ద్వారా నమిలే అలవాటును సురక్షితమైన బొమ్మల వైపు మార్చే శిక్షణ అవసరం.
అందువల్ల మీ కుక్కపిల్ల ఎక్కువగా వస్తువులను నములుతున్నట్లయితే.. ఇది తక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా అవి అనుభవిస్తున్న పళ్ల సమస్యలను గమనించి సరైన మార్గదర్శకత్వం తీసుకోవడం చాలా అవసరం. వైద్య నిపుణుల సలహాలను అనుసరించడం ద్వారా మీరు మీ పెంపుడు కుక్కపిల్లను ఆరోగ్యంగా, సంతోషంగా పెంచుకోవచ్చు.
2025-06-09T14:55:50Z