మొక్కలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మొక్కల పెంపకంపై అవగాహన పెరిగి ప్రజలు మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నారు. దాంతో పాటు గృహాలలో సైతం మొక్కలను పెంచే కల్చర్ అధికమైంది. అందుకే మొక్కల వ్యాపారాలు సైతం జోరందుకున్నాయి. ఇక్కడ ఓ వ్యక్తి మొక్కల పెంపకంపై ఉన్న మక్కువతో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి మొక్కల వ్యాపారిగా మారారు. వరంగల్ నగరానికి చెందిన ఖాజా అనే వ్యక్తి 2015 నుంచి నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసేవారు. 2020 కోవిడ్ తర్వాత ఉద్యోగంలో మార్పులు రావడంతో తానే స్వయం ఉపాధి కల్పించుకొని రావాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలోని హంటర్ రోడ్ ప్రాంతంలో నవభారత్ పేరుతో మొక్కల నర్సరీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఖాజా పేర్కొన్నారు. ఈ మొక్కల నర్సరీ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి కల్పించుకోవడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నర్సరీలో అన్ని రకాల మొక్కలు లభిస్తాయి. పండ్ల మొక్కలు, షో ప్లాంట్స్, గిఫ్టెడ్ మొక్కలు, బోన్సాయ్, పూల మొక్కలు, గార్డెనింగ్‌కి సంబంధించిన ఇలా అన్ని రకాల మొక్కలు ఉంటాయి.
WhatsApp Services in TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో టీటీడీ వాట్సప్ సేవలు
పండ్ల మొక్కల్లో పలు రకాలుగా ఉన్నాయి. మామిడి అనగానే కేవలం వేసవిలోనే కాస్తుంటాయి. కానీ ఇక్కడ లభించే పునసా మామిడి చెట్లు కాలానికి సంబంధం లేకుండా నిరంతరం కాస్తూనే ఉంటాయి. చెట్టు కూడా ఏపుగా పెరగకుండా చిన్నగానే ఉంటుంది. ఈ చెట్లను ఇంటి ముందు గానీ ఇంటి మిద్దెపై కూడా పెంచుకోవచ్చు. వీటి కాయలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటి ధర రూ.600 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. దీంతోపాటు విదేశీ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. అవకాడో, స్టార్ ఫ్రూట్, డ్రాగన్, కివి, ఆపిల్ బేర్స్, పియర్స్, ఫిగ్, లీచి ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలు అదేవిధంగా పలు రకాల ఆయుర్వేద మొక్కలు కూడా అందుబాటులో ఉంటాయి.
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... డీఆర్‌డీఓ తయారుచేసిన లడ్డూ కవర్స్ వినియోగం
ఇక్కడ రూ.50 నుంచి మొక్కల ధరలు మొదలై వేల రూపాయల వరకు ఉంటాయి. వీటిని హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలకు అందజేస్తున్నారు. ఇవన్నీ రాజమండ్రి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తెప్పిస్తున్నారు. కస్టమర్స్ ఎక్కడికో వెళ్లి మొక్కలను కొనాల్సిన అవసరం లేకుండా దేశ విదేశీ మొక్కలను నర్సరీలో అందుబాటులో ఉంచామని నిత్యం ఎంతో మంది వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి లాభదాయకంగానే కొనసాగుతుందని చెప్పారు.
2025-02-04T12:19:46Z