లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే..!

నిమ్మకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు, పంచదార కలిపిన టీ కంటే లెమన్ టీనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిమ్మకాయ విటమిన్ సికి గొప్ప వనరు. అందుకే రోగనిరోధక శక్తిని పెంచడానికి లెమన్ టీ ఉత్తమమైనదని నిపుణులు అంటుంటారు. లెమన్ టీని తయారుచేయడానికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. దీన్ని తయారు చేయడానికి ముందుగా నీటిని మరిగించి తర్వాత టీ పొడిని వేయండి. తర్వాత అందులో నిమ్మరసం కలపండి. ఇందులో బెల్లం లేదా తేనెను కలిపి తాగాలి. 

నిమ్మకాయలో విటమిన్ సి, బి6, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మకాయ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి, జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. అసలు లెమన్ టీని తాగితే ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి నిమ్మకాయ టీని తాగడం వల్ల, నిమ్మకాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లెమన్ టీ యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. ఇది ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. 

చర్మానికి మేలు

నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. లెమన్ టీ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మీ స్కిన్ తాజాగా, అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. 

జీర్ణక్రియ

లెమన్ టీ జీర్ణక్రియను సులభతరం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇవి శరీరంలో మెటబాలిజంను సులభతరం చేయడానికి కూడా ఉపయోగపడతాయి.

 

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి లెమన్ టీ బాగా సహాయపడుతుంది. ఈ టీ శరీరంలోని కొవ్వును తగ్గించి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అందుకే క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో లెమన్ టీ ని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

 

ఒత్తిడి 

లెమన్ టీలో పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి లెమన్ టీని తాగడం వల్ల ఒత్తిడిని తగ్గిపోతుంది. 

 

ఎసిడిటీ

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యల్లో ఎసిడిటీ ఒకటి. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి లెమన్ టీ ఎంతో  సహాయపడుతుంది. అందుకే ఎసిడిటీ ఉన్నవారు లెమన్ టీని డైలీ డైట్ లో చేర్చుకుంటే మంచిది. 

2023-05-26T02:01:02Z dg43tfdfdgfd