వినాయక చవితి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కువమంది జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని స్థాపన చేసి తొమ్మిది రోజులపాటు నవరాత్రి పూజలు చేసి ఆపై పదవరోజు విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.
మనం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించిన తొలి పూజ ఆ గణనాథుడికే చేస్తాం. అగ్ర పూజ అందుకునే దేవుడు, విజ్ఞాలను తొలగించేవారు ఆ వినాయకుడు. అందుకే వినాయక చవితి రోజున ఆ వినాయకుడిని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చకులు సాయి కృష్ణ శర్మ వెల్లడించారు.
Tirupati Laddu: మరింత రుచిగా తిరుపతి లడ్డూ... ఈ ఆలయాల్లో కూడా కొనొచ్చు
ప్రజలందరూ ఏకీకృతమై సమిష్టిగా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి గ్రామంలో వీధి వీధినా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఉండే ఫలితాలు ప్రతి మనిషిలో ప్రేమ తత్వాన్ని కలగాలని, ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులను ఆరాధించుకోవాలి. తల్లిదండ్రులను ఆరాధించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి.
అలాగే చెరువులో లభించే మట్టిని గణపతి ఆకృతిలో తయారు చేసుకొని ప్రకృతి నుంచి లభించే 21 పత్రాలను ఆ స్వామివారికి సమర్పించడం ద్వారా ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. వినాయక చవితి రోజున మట్టి గణపతిని తయారు చేసి 21 పత్రాలు పెట్టడం ద్వారా మనకున్నటువంటి శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి.
Tirumala Prasadam: తిరుమలలో శ్రీవారికి ఆదివారం మాత్రమే సమర్పించే ప్రసాదం విశిష్టత ఏంటో తెలుసా?
అదే విధంగా వినాయక చవితి రోజున గణపతికి 21 పత్రాలతో పాటు గరికలను సమర్పించాలి. ఆ స్వామివారికి గరికలను సమర్పించడం ద్వారా విద్య, ఉద్యోగం, వ్యాపార, వ్యవసాయ, ధనం, వస్తువు, వాహనాది, సమస్త విజ్ఞాలు తొలగించి సంపూర్ణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణ అనుగ్రహం తోటి ఆ గణపతి అనుగ్రహాన్ని మనం పొందుతాం. అందుకే ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి రోజున 21 పత్రాలతో పాటు స్వామివారికి ఆ గరికలతో ఆరాధన చేయాలి.
ఆ ప్రకృతి స్వరూపుడైనటువంటి ఆ గణనాథుడిని వినాయక చవితి రోజున ఆరాధించడం ద్వారా ప్రకృతి పరమైనటువంటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో పాటు మనం తలపెట్టేటువంటి సమస్త విజ్ఞాలు తొలగించేటటువంటి వరద వినాయక వ్రత కల్పము వినాయక వ్రతకల్పము. అందుకే వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాయక వ్రతాన్ని ఆచరించడం ద్వారా తమకుండేటటువంటి సమస్త విజ్ఞాలు తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు చెప్పారు.
2024-09-05T07:02:07Z dg43tfdfdgfd