వేసవిలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? వైద్యులు ఏం చెప్తున్నారు.!

Srinivas Ponnam, News18, Karimnagar

గత కొద్ది వారాలుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఎండల వేడికి తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు.. సాధారణ మనుషులకంటే గర్భిణుల శరీర ఉష్ణోగ్రత ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉస్నోగ్రత్త అధికంగా ఉంటుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గౌతమి రెడ్డి అంటున్నారు. అయితే, దీని వలన గర్భిణీ స్తీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎప్పుడు తడి వస్త్రంతో ముఖంపైన, మెడ కింద తుడుస్తూ ఉండాలని అంటున్నారు.

ఇక పోతే గర్భిణులు కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. చెమట రూపంలో నీటితో పాటు ఇతర లవణాలు బయటకు పోతాయి. కాబట్టి ఉప్పు కలిపిన నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి ఎక్కువగా తాగాలని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో వడగాలులు రాకుండా తలుపులు, కిటికీలకు పరదాలు వేలాడదీసి వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. చల్లటి నీటి కన్నా.. కాచి వడబోసిన నీళ్లు తాగడం మంచిది.

ఇది చదవండి: ఈ బుడతడి వయసు ఏడాదిన్నర.. జనరల్ నాలెడ్జ్ లో అద్భుత ప్రతిభ

గర్భిణీ స్త్రీ నెలలు పెరిగే కొద్దీ పొట్ట పెరుగుతూ చర్మం సాగుతుంది. కొంచెం వేడి తగిలినా కమిలిపోయి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఎండలోకి వెళ్ళే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. అలాగే డాక్టర్స్ రాసిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవని డాక్టర్స్ చెబుతున్నారు. ఏదయినా ఇబ్బంది అనిపించినప్పుడు దగ్గర్లోని డాక్టర్స్ ను సంప్రదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండావంటున్నారు స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ గౌతమి రెడ్డి.

2023-05-25T05:11:52Z dg43tfdfdgfd