యాలకులు కొనడం మానేయండి.. ఇలా ఇంట్లో కుండీలోనే పెంచుకోండి
మనలో చాలా మందికి ఇంటి పెరట్లో, టెర్రస్ పైన, గార్డెన్‌లో పూల మొక్కలు, క్రోటాన్స్, మనీ ప్లాంట్స్ పెంచుకోవడంతో పాటు కూరగాయలు, ఇతర పండ్ల మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది. అయితే మసలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు ఇంట్లో, పెరట్లో పెంచవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే సుగంధ ద్రవ్యాల్లో యాలకుల మొక్కలు ఇంటి ఆవరణలోనే పెంచువచ్చు. మీరు మార్కెట్ నుండి మొక్కలను తీసుకురావడం ద్వారా యాలకులను పెంచవచ్చు. ఇది కాకుండా మీరు విత్తనాల సహాయంతో మొక్కలను కూడా సులభంగా పెంచవచ్చు. మంచి నర్సరీ నుండి విత్తనాలు కొనండి, లేకుంటే మీ శ్రమ వృధా అవుతుంది. మార్కెట్ నుండి తెచ్చిన విత్తనాలను ఒక చెంచా నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచండి. తరువాత ఒక గిన్నె సిద్ధం చేసుకోండి. మీ కుండ చాలా పెద్దదిగా లేదా చాలా చిన్నదిగా ఉండకూడదు. 20 రూపాయలకు, మీకు సరైన సైజులో ఒక ప్లాస్టిక్ కుండ లభిస్తుంది. ఒక కుండలో సగం ఎర్ర మట్టి , సగం నల్ల మట్టి కలపండి. తరువాత ఈ మట్టికి కోకోపీట్ , ఆవు పేడ కలపండి. ఈ వస్తువులన్నింటినీ బాగా కలపండి. నేలపై నీటిని చల్లండి. తరువాత విత్తనాలను మట్టిలో వేయండి. మొక్కలు మొలకెత్తడానికి 5 నుండి 7 రోజులు పట్టవచ్చు. మొక్క మొలకెత్తిన తర్వాత వాటిని పాడు చేయవద్దు. ఉదయం , సాయంత్రం నీటిని పిచికారీ చేయాలి. 30 నుండి 40 రోజుల తర్వాత మొక్కలు బాగా మొలకెత్తుతాయి. ప్రతి ఉదయం 2 నుండి 3 గంటలు యాలకుల మొక్కను ఎండలో ఉంచడం ముఖ్యం. మొక్కలు మొలకెత్తిన తర్వాతే కుండను ఎండలో ఉంచాలి. విత్తనాలు నేలలో ఉన్నంత కాలం, వాటిని ఎండలో ఉంచకూడదు, నీడలో ఉంచాలి. యాలకుల మొక్క ఫలాలు కాసేందుకు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే యాలకులుగా మారేందుకు ఆ టైం తీసుకుంటుంది. ఈ సమయంలో మీరు మొక్కను ఎండిపోకుండా, చనిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
2025-02-15T03:29:02Z
ఈ యువతి టాలెంట్ వేరే లెవెల్.. కుంచెతో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రావ్య..!
పేపర్ పై సాధారణమైన బొమ్మలు గీయాలంటేనే ఎంతో సాధన చేస్తే కానీ చాలా కష్టం. అలాంటిది ఒక మనిషి రూపాన్ని గీయడం అంటే మాటలు కాదు. అట్లాంటిది ఫోటోలో కనిపిస్తున్న చిన్న పుట్టుమచ్చను కూడా పోనీయకుండా బొమ్మలను అద్భుతంగా గీస్తుంది ఈ యువతి. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ మీద ఉన్న బొమ్మను చూస్తే కలర్ జిరాక్స్ తీసుకున్నట్టే ఉంటున్నాయి. ఇంత అద్భుతమైన బొమ్మలు వేయడమే కాకుండా ఈ బొమ్మల ద్వారా సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది శ్రావ్య. మంచిర్యాల జిల్లా బలరావ్ పల్లి గ్రామానికి చెందిన శ్రావ్య డిగ్రీ వరకు చదువుకుంది. శ్రావ్యకి చిన్న వయసు నుండే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. కాలి సమయం దొరికిందా పెన్సిల్ పేపర్ పట్టి బొమ్మలు గీస్తూ ఉంటుంది. సరదాగా ఆమె వేసిన బొమ్మలు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. శ్రావ్య ఏకలవ్యుడిలా ఎవరూ తనకు నేర్పకుండానే స్వతహాగా ఆర్ట్ వేయడం నేర్చుకుంది. అలా నాలుగేళ్ళు పెన్సిల్ తో సాధన చేసి చివరికి సాధించింది. ఇప్పుడు ఎవరి ఫోటో ఇచ్చినా చకచకా అచ్చు గుద్దినట్టే గీసేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడానికి అమ్మ నాన్న ఆదర్శం అని శ్రావ్య తెలిపింది. నాన్న సమల వెంకటేష్, ఎలక్ట్రిషియన్ గా పని చేస్తారు.. అమ్మ లక్ష్మి ఇంటివద్దే ఉంటుంది. నాన్న బొమ్మలు గీసేవాడు, అమ్మ కార్టూన్ బొమ్మలు గీసేది. అలా వాళ్ళను చూసి నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగిందని శ్రావ్య తెలిపింది. గంటల తరబడి బొమ్మలు వేస్తూ ఉన్నా వారు నుండి వచ్చే సహకారం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రుల నుండి అంతటి సహకారం ఉంది కాబట్టే తాను ఆర్టిస్ట్ గా రాణించగలుగుతున్నానని శ్రావ్య తెలిపింది. శ్రావ్య పలు రకాల ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్, గ్రాఫైట్, చార్కోల్, పెయింటింగ్, పాస్టర్స్, ఆయిల్ పెయింటింగ్, కంకరచుల, ఇలా వివిధ రకాలుగా ఆర్ట్ వేస్తుంది. వీటితో పాటు వాల్ పెయింటింగ్ కూడా వేస్తుంది. దీనికి ఫోటో డిజైనింగ్, సింగిల్ డబుల్, ఫ్యామిలీ ఇలా ఫోటోను బట్టి ఉంటుందని తెలిపింది శ్రావ్య. శ్రావ్య లోకల్ 18 తో మాట్లాడుతూ భవిష్యత్తులో ఆర్టిస్ట్ రాణించాలనేది తన లక్ష్యమని తెలిపారు. అంతే కాకుండా ఆర్ట్ విషయంలో ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. చిన్నారులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటానని.. దీనిని త్వరలో ప్రారంభిస్తానని అంటోంది. శ్రావ్య తో మీ ఫోటోలను బొమ్మ గీయించుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి సంప్రదించండి. 7674037711
2025-02-15T13:44:15Z
వారఫలాలు.. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. 20వ తేదీ నుంచి శుభవార్తలు వింటారు!
Weekly Horoscope: రాశిఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవ హారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కల యిక ఆనందం కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఆర్థిక లావా దేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసు కోవడం మంచిది కాదు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, నిలకడగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవు తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరు ద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా చాలావరకు సానుకూలపడతాయి. శుభ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ది చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు బాగానే సాగిపోతాయి. రావలసిన సొమ్మును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూరపు బంధువులను కలుసుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్యమైన పనులు వాయిదా పడ తాయి. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. నిరు ద్యోగులు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగంతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభించకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి విస్తరిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆల యాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు తగ్గించుకుంటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగి స్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసు కుంటే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రు లతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రధానమైన పనులు, ప్రయత్నాల్లో విజయాలు సాధి స్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి కొద్దిగా సమస్యలుంటాయి. వృత్తి జీవితంలో రాబడి కొద్దిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. రావలసిన డబ్బును గట్టి ప్రయ త్నంతో వసూలు చేసుకుంటారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. విద్యార్థులకు శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోకుండా అపార్థాలు తలెత్తుతాయి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడ తాయి. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహా రాలు చురుకుగా పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ అధికారుల అండదండలుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడ తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. పెండింగు పనులు సకాలం పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజా వుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగం మార డానికి ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభి స్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత బాగా పెరుగుతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2025-02-16T01:29:11Z
ఆ గ్రహ మార్పుతో ఈ రాశులవారు శృంగారంలో రెచ్చిపోతారు.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి!
శుక్ర గ్రహం ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్నున్నప్పుడు తప్పకుండా శృంగార భావనలను, సుఖ సంతోషాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషభ రాశిలో ఉన్న గురువుతో పరివర్తన చెందినందువల్ల శుక్ర గ్రహం కొన్ని రాశుల వారికి భారీగా సుఖ సంతోషాలను అనుగ్రహించే అవకాశం ఉంది. ఈ శుక్రుడు కొన్ని రాశులవారి మనసుల్లో ప్రేమ భావనలను రేకెత్తించడంతో పాటు ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు ప్రేరేపించే అవకాశం ఉంది. శుక్రుడు అనుగ్రహించే రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు. మకరం. కొత్త ప్రేమికులు, కొత్త దంపతులు ఈ సమయంలో ప్రేమ యాత్రలకు ప్లాన్ చేసుకునే పక్షంలోహ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. వృషభంఈ రాశిలో ఉన్న గురువుతో లాభ స్థానంలో ఉచ్ఛలో ఉన్న శుక్రుడు పరివర్తన చెందడం వల్ల ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు బాగా అవకాశం ఉంది. ఈ నెల 14 మొదలుకుని ఈ నెలాఖరు వరకు వీరు ఎప్పుడు ప్రేమ యాత్రలు చేసినా గరిష్ఠ స్థాయిలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఈ రాశివారు ప్రేమ యాత్రలకు ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్లడం మంచిది. కొత్త దంపతులు కూడా సరికొత్తగా ప్రేమ యాత్రలు చేయడం దాంపత్య జీవితానికి మేలు చేస్తుంది. మిథునంఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ప్రేమ భావనలు, శృంగార భావనలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. వీరు కొండ ప్రాంతాలను, హిల్ స్టేషన్లను తమ ప్రేమ యాత్ర లకు ఎంపిక చేసుకోవడం వల్ల బాగా ఆనందం పొందుతారు. ఈ నెల 14 నుంచి నెలాఖరు వరకు వీరికి ప్రేమ వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంది. ప్రేమ యాత్రల సందర్భంగా ప్రేమ భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కర్కాటకంఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్ర సంచారం జరుగుతుండడం, అది లాభ మస్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరికి ప్రేమ యాత్రలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుక్రుడితో పాటు, గురువు అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తున్నందువల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఈ రాశివారు తమ ప్రేమ యాత్రకలు, విహార యాత్రలకు జల, జలపాత ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం వల్ల అన్ని విధాలుగానూ ఉపయోగం ఉంటుంది. కన్యఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందడం వల్ల వీరు చేసే ప్రేమ యాత్రలు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతాయి. ప్రేమికుల మధ్య, యువ దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెంపొందుతాయి. ఈ రాశివారు ఈ నెలాఖరులోగా రెండు మూడుసార్లు ప్రేమ యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి చెందినవారు సాధారణంగా కొండ ప్రాంతాలకు, ఎత్తయిన ప్రాంతాలను వెళ్లడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ధనుస్సుఈ రాశివారికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో సంచారం చేస్తున్నశుక్రుడు తప్పకుండా ప్రేమ యాత్రలకు అవకాశం కలిగిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శృంగార సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెండు మూడు సార్లు ప్రేమ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశివారు తీర ప్రాంతాలను, అటవీ ప్రాంతాలను తమ ప్రేమ యాత్రలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠ స్థాయిలో హ్యాపీగా గడపడం జరుగుతుంది. మకరంఈ రాశిలో మూడవ స్థానం ఉన్న శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెంద డం వల్ల ఈ రాశికి చెందిన ప్రేమికులు, కొత్త దంపతులు అనేక పర్యాయాలు ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ నెల 14 నుంచి వీరి ప్రేమ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ యాత్రల విషయంలో ఈ రాశివారు సరికొత్త, వినూత్న ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వీరు జల పాతాలు, లోయ ప్రాంతాలకు ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ఠంగా సుఖ సంతోషాలు పొందగలుగుతారు.
2025-02-15T11:13:55Z