అమ్మవారికి అర్ధరాత్రి వేళ పూజలు.. ఈ ఆలస్య రహస్యాలను తెలుసుకోండి

ఉత్తరాఖండ్‌కు దేవభూమిగా పేరుంది. ఇక్కడ వేల సంఖ్యలో హిందూ ఆలయాలు ఉన్నాయి. ప్రఖ్యాతమైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. వాటిలో కేదార్‌ఘాటిలోని కాళీమఠ్ ఆలయం కూడా ఒకటి. ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాదు.. పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి చెందింది. సిద్ధపీఠ్ కాళీమఠ్ దేవాలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలోని కేదార్‌ఘటిలో సరస్వతి నది ఒడ్డున ఉంది. దీనిని భారతదేశంలోని ప్రధాన శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. స్కందపురాణంలోని కేదార్‌నాథ్ 62వ అధ్యాయంలో కాళీ మాత ఆలయం గురించి పేర్కొన్నారు. అంతే కాళీమాత.. తన సోదరీమణులు మహాలక్ష్మి, మహాసరస్వతి సమేతంగా ఉన్న ఏకైక ప్రదేశం ఇది.

Jammu and kashmir: చీనాబ్ వంతెనను పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వంటి 88 వేల మంది మహర్షులు ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలను పూజించారని ఆలయ పూజారి రమేష్ భట్ చెప్పారు. రక్తబీజుడిని చంపిన తర్వాత కాళీ మాత అతడి తలను ఉత్తరం వైపుకు విసిరివేసిందని... ఈ రోజు కూడా రక్తబీజుడి తల రాతి రూపంలో ఇక్కడ పడి ఉందని వెల్లడించారు. మహాష్టమి రోజున రాయిపై అగ్నిజ్వాలను వదిలేస్తారు. ఆ మరుసటి రోజు తెల్లవారుఝామున ఆ రాయిపై ఎర్రటి రక్తం లాంటి గుర్తులు కనిపిస్తాయి. అలాగే భగవతి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సిద్ధేశ్వర్ మహాదేవ్, భైరవనాథ్ ఇక్కడ కొలువై ఉన్నారని ఆలయ పూజారి రమేష్ భట్ పేర్కొన్నారు.

కాళీమఠ్‌లో రక్తబీజ్‌ని చంపిన తర్వాత కాళి మాత ఈ ప్రదేశంలో ఆత్మపరిశీలన చేసుకుంటుందట. దీని కారణంగా ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. కానీ కాళీ మాత యంత్రం  ఒక బొడ్రాయి రూపంలో పూజిస్తారు. అక్టోబర్ నెలలో నవరాత్రి అష్టమి నాడు.. అమ్మవారి యంత్రాన్ని అర్ధరాత్రి రుఖీ గ్రామంలోని నలుగురు పూజారులు శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మహాలక్ష్మి డోలీని తీసుకుని మహాకాళి ఆలయానికి వెళ్తారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అమ్మవారిని నాలుగు ప్రహార్లలో (ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి) పూజిస్తారు. నవమి నాడు కాళీ మాత అందరినీ ఆశీర్వదిస్తారని భక్తులు విశ్వసిస్తారు.

2023-03-26T12:00:57Z dg43tfdfdgfd