మొగన్ని కొట్టి మొగసాలకెక్కిందట

కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అన్నీ తెలిసే చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు. తీరా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక.. ముందే ఎందుకు చెప్పలేదని ఎదురుదాడికి దిగుతారు. ఇట్లాంటి చిత్రమైన మనుషులను ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెతే.. ‘మొగన్ని కొట్టి మొగసాలకెక్కిందట’. ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, వాళ్లే తప్పులు చేస్తారు, వాళ్లే శిక్షిస్తారు. మళ్లీ వాళ్లే సానుభూతి పొందాలని ప్రయత్నిస్తారు. విషయం నలుగురిలో పడగానే.. లేనిపోని మాటలన్నీ బొంకుతారు. తాము చేసిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అది చూసి జనం సానుభూతి కురిపిస్తారు. ఓ భార్య తన భర్తను తానే చితక్కొట్టి.. జనమంతా వచ్చేసరికి తాను ఏడుస్తూ కూర్చుందట. దీంతో చుట్టుపక్కలవాళ్లు ఆమెనే ఓదార్చారట. ఇలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత దూరం ఉండటం మంచిది.

-డప్పు రవి

2023-03-26T02:39:17Z dg43tfdfdgfd