సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అదిరింది.. ఇందులో పోషకాలెన్నో..

నెత్తి మీద సూర్యుడు భగభగలాడుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్క నిమిషం బయటకి అడుగు పెట్టాలంటే భయంగా ఉంది పరిస్థితి. మరి మన కడపలో ఎండలు అంటే ఆమాత్రం ఉంటాయి. ఈ ఎండల భారీనుండి బయటపడడం ఎలా అనుకుంటున్నారా.. ఎండలను తప్పించుకోవడం కష్టమైన పనే, కానీఎండలకు తట్టుకోగలిగే ఆహారాలు, పండ్లు వేసవి ప్రారంభంనుండి మన అందుబాటులోనికి వచ్చేశాయి.

అలాంటి వాటిలో వేసవి నుండి మనల్ని కాపాడే పుచ్చకాయ ఎంతో ప్రత్యేకం.నగరంలో పలురకాల సర్కిల్స్ లో ఇరువైపుల ఈ పుచ్చకాయల వ్యాపారం జోరుగా సాగుతుంది. పలురకాల సైజులలో ఎర్రగా మాగిన పుచ్చకాయలు, దారినవెళ్ళే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ అమ్ముడుపోతుంటాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు రెండు నెలలకి ముందే ఈ పుచ్చకాయలు మనకి అందుబాటులో ఉంటాయి.

ఎప్పటి లాగే ఇప్పుడు కూడా పుచ్చకాయలు నగరంలో పలుచోట్ల మనకి అందుబాటులో దొరుకుతుండటంతో వేసవి తాపం నుండి తట్టుకోవడానికి ప్రజలు ఎగబడి కొంటున్నారు. ప్రజల ఆసక్తిని గమనిస్తున్న వ్యాపారులు ఈ పుచ్చకాయలని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని మనకి అందుబాటులో ఉంచుతున్నారు. మరి ముఖ్యంగా ఈ పుచ్చకాయలు నగర ప్రాంతాలలో అధికంగా అమ్ముడుపోతుండటం విశేషం.

ఈ పుచ్చకాయలు ఫిబ్రవరి నెల నుండి ఆగస్ట్ వరకు మార్కెట్ లో అందుబాటులో ఉండగా మార్చి, ఏప్రిల్, మే. నెలలలో అధికంగా అమ్ముడవుతాయని పుచ్చకాయల వ్యాపారులు చెపుతున్నారు. ఈ వేసవిలో పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తీసుకునే ఆహారంలో ప్రధానమైనది ఈ పుచ్చకాయ. ఈ పుచ్చకాయని ఆహారంగా తీసుకోవడం వలన మనిషి నుండి అలసట దూరమవుతుంది.

అంతేకాకుండా ఇందులో ఉన్న పలురకాలైన ఔషధగుణాల వలన మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.వేడి కారణంగా మనలో వచ్చే తలనొప్పి, చర్మ సమస్యలు, అలసట, వంటి వ్యాధుల నుండి మనకి త్వరిత ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలో చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A, C, E ఉన్నాయి, అలాగే అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది.

2023-03-26T05:11:22Z dg43tfdfdgfd