అర్థ వివరణ

1.మాటల పందిరి = ఉత్తమాటలు

(వాడొట్టి కోతలరాయుడు. మాటలతోనే

పందిరి కడుతడు. వాణ్ని నమ్మి నానబాలు పోస్తే.. పుచ్చి బుడాలైతయ్‌ బిడ్డా..)

2. బదురుకొనుడు = అనుకున్నట్లు, పథకం ప్రకారం

(నేను ముందేచెప్పాగా.. వాళ్లంతా బదురుకొనే ఇదంతా చేస్తరని.

ఇప్పటికైనా నీ మట్టిబుర్రకు తట్టిందా?)

3.నీళ్లల్ల పోసినట్లు = ప్రయోజనం లేకపోవడం, వ్యర్థంగా మారడం

(ఏడాదంతా నువ్‌జేసిన కష్టం..

నీ మొగని వల్ల నీళ్లల్లబోసినట్లు అయిపాయె.. ఏం ఫాయిదా?)

4.కడుక్కతాగుడు = మొత్తం కాగొట్టడం, పూర్తిజేయడం, ఖాళీ చేయడం

(ఉన్న డబ్బులన్నీ కడుక్కతాగినవ్‌..

ఇప్పుడు చిప్ప

చేతులబెట్టుకొని

అడక్కతిను)

5.మూలకుపడటం = ఉపయోగంలో లేకపోవడం, పాడవటం (మా చిన్నోడు కొత్త బైక్‌

కొన్నకాన్నుంచి.. పాత సైకిల్‌ మూలకువడ్డది. ఎండకు ఎండి.. వానకు తడిసి

తుప్పుబట్టిపోతంది)

2023-03-26T02:39:17Z dg43tfdfdgfd