ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​కు రెడీ.. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు

ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​కు రెడీ.. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు

మెహిదీపట్నం, వెలుగు: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశామని ఫిషరీస్  ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్  తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్​లోని మత్స్య శాఖ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  ఈనెల 8, 9, 10వ తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్​ నిర్వహి స్తున్నామని, ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన చెప్పారు.ప్రతి జిల్లాలోనూ 20 నుంచి 30 వరకు ఫిష్ ఫుడ్ స్టాల్స్  పెట్టామని, ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ స్టాల్స్ ఉంటాయన్నారు.  శుక్రవారం ఉదయం 8 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్  గ్రౌండ్ లో మంత్రి తలసాని చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తరు అని రవీందర్  పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T03:33:56Z dg43tfdfdgfd