న్యూమరాలజీ సలహాలు.. నంబర్ 6తో 1 ఇంపార్ట్‌టెంట్.. 2 కంఫాటబిలిటీ ఇదే

Numerology:పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

6వ అంకె 3, 4 మధ్య అనుకూలత:

వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. నంబర్ 6కి 3, 4తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

నంబర్ 3:

నంబర్‌ 3, 6 రెండూ వరుసగా క్రియేటివిటీలో రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి. అందువల్ల ప్రపంచంలోని ఏ రూపంలోనైనా క్రియేటివ్‌ ఆర్ట్‌ లేదా ఆర్ట్‌తో వ్యవహరించే వ్యక్తులు ఈ కలయికతో పాలిస్తారు. భాగస్వాములుగా 3, 6 మధ్య వ్యక్తిగత జీవితం, వివాహం జీవితం యావరేజ్‌గా ఉంటుంది. ఎందుకంటే 3వ నంబర్‌ 6తో సహకరించడానికి అంగీకరించదు. అదే 4విధంగా 6వ అంకె 3తో న్యూట్రల్ రిలేషన్‌ కొనసాగిస్తుంది. ఇద్దరూ కలిసి వృత్తిపరంగా, తమకు ఆసక్తి ఉన్న రంగంలో, విభేదాలు రాని చోట మాత్రమే పని చేయవచ్చు. పెద్ద సమూహాన్ని ఆస్వాదించడం, మాస్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. వారు కమ్యూనిటీ ఓరియెంటెడ్ కాబట్టి ప్రభుత్వ శాఖలలో లేదా ప్రభుత్వంలోనే చాలా బాగా పని చేస్తారు. ఈ నంబర్‌లలో జన్మించిన వారు లేదా పరోక్ష ప్రభావం ఉన్నవారు గాయకులు, శాస్త్రవేత్త, డిజైనర్లు, రచయితలు, క్రీడాకారులు, పబ్లిక్‌ స్పీకర్‌లు, మోటివేషన్‌ హీరోలు, డిఫెన్స్‌ అధికారులు, హోమ్‌ మేకర్స్‌ విజయవంతంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తారు.

లక్కీ కలర్‌: పింక్, వైలెట్

లక్కీ నంబర్‌: 9

లక్కీ డే: శుక్రవారం

పరిహారం: నారాయణుడు, లక్ష్మీదేవికి కుంకుమ బియ్యం దానం చేయండి

నంబర్‌ 4:

నంబర్‌ 6 అనేది రాహువుకు చెందిన 4కి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది. 6వ అంకె ఉండటం రాహు గ్రహం అదృష్టానికి గొప్ప మలుపు. తన కష్టాన్ని తగ్గించుకోవడంలో ప్రోత్సహిస్తుంది, కుటుంబం, స్నేహితుల పూర్తి సపోర్ట్‌ ఇస్తుంది. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారి పుట్టిన తేదీలో 4, 6 ఉంటే గొప్పగా పని చేస్తారు. పెద్ద వ్యాపారవేత్త లేదా ప్రభుత్వ ప్రతినిధులు 4వ స్థానంలో జన్మించిన వారు 6లో పార్ట్‌నర్స్‌ కలిగి ఉన్నవారు గౌరవనీయులైన మంత్రి కేటీఆర్‌ తరహాలో ఫలితాలను అందించగలరు. అలాగే 4, 6ల కలయిక కలిగిన జంట ఇంటి విధులను ప్రకాశవంతంగా నిర్వర్తిస్తుంది. సామాజిక బాధ్యతలను ఆలస్యం లేకుండా పూర్తి చేసి అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అందువల్ల ఇతరుల ఆశీర్వాదాలు, నమ్మకాన్ని పొందుతారు.

లక్కీ కలర్‌: బ్లూ, ఆఫ్ వైట్

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

పరిహారం: దయచేసి హౌస్‌ కీపింగ్‌ మెటీరియల్‌ని ఇంట్లో హెల్పర్‌కి విరాళంగా ఇవ్వండి

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

2023-03-27T23:46:44Z dg43tfdfdgfd