జామ ఆకులు నిజంగా సంతానోత్పత్తిని పెంచుతయా?

జామకాయలను తినడం వల్ల మన శరీరంలో విటమిన్లు, మినలర్స్ లోపం పోతుంది.  అయితే జామ ఆకులు సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయిని కొందరు నమ్ముతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 

జామకాయల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈపండ్లు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగే దీని ఆకులు కూడా మనకు మంచి మేలు చేస్తాయి. అందుకే ఈ ఆకులను హెర్బల్ టీగా కూడా ఉపయోగిస్తారు. ఇది మన శరీరాన్ని ఎన్నో శారీరక సమస్యల నుంచి కాపాడుతుంది. రోజూ జామపండును తినడం వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం పోతుంది. ఈ పండు మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే సంతానోత్పత్తిని పెంచడానికి జామ ఆకులు కూడా సహాయపడతాయని ఎన్సీబీఐ పరిశోధనలో తేలింది. సంతానోత్పత్తితో సహా జామ ఆకులు మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

సంతానోత్పత్తిని పెంచడానికి జామకాయ ఉత్తమ మార్గమని నిపుణులు అంటున్నారు. దీనిని తీసుకోవడం వల్ల మహిళల్లో అండోత్సర్గము, సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం జామ పండ్లను తినొచ్చు. లేదా జామ ఆకులను మరిగించి హెర్బల్ టీగా తాగొచ్చు. ఇది స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జామ ఆకులు చల్లగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా ఆకులు దొరికితే వీటిని పేస్ట్ లా చేసి పొట్ట కింది భాగంలో అప్లై చేయడం వల్ల పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగేజామ ఆకులను పొడి చేసి రోజూ అర టీస్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి పోయి ల్యూకోరియా సమస్య నయమవుతుంది. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. అలాగే గర్భం దాల్చడం సులువు అవుతుంది. జామ ఆకులతో ఇంకా ఏం ప్రయోజనాలు కలుగుతాయంటే? 

 

పీరియడ్ తిమ్మిరి నుంచి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో పొట్ట, నడుము తిమ్మిరితో ఇబ్బంది పడుతుంటారు. అయితే వీరికి జామ ఆకుల రసాన్ని నీటిలో మరిగించి తాగితే ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హోం రెమెడీ సహాయంతో పొట్ట కింది భాగంలో పీరియడ్స్ తిమ్మిరిని దూరం చేసుకోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం.. 197 మంది మహిళలు పీరియడ్స్ సమయంలో 6 గ్రాముల జామ ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల వారు తిమ్మిరి నుంచి ఉపశమనం పొందారు.

జీర్ణవ్యవస్థను బలంగా

డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే జామపండును తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాదు. అలాగే పదేపదే ఆకలి అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. ఒక జామకాయ రోజుకు అవసరమైన ఫైబర్ అవసరాలలో 12 శాతం తీరుస్తుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉండే జామ ఆకుల రసం జీర్ణవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది. జామ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే మీ శరీరం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కు దూరంగా ఉంటుంది. 

గుండె ఆరోగ్యాన్ని..

జామ ఆకుల రసం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతోంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డయాబెటిస్ ప్రమాదాన్ని.. 

జామ ఆకు టీని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు 10 శాతం తగ్గుతాయి. జామ ఆకులతో తయారుచేసిన టీని రోజూ తాగొచ్చు. 

2023-10-01T07:47:08Z dg43tfdfdgfd