కంటివెలుగు

గుండె ఊసుల చప్పుళ్ళు

కమ్మని కలలు కనే కళ్ళు

ఆశలు నిండిన లోగిళ్ళు

వెన్నెల కాంతుల తళుక్కులు

చూపు మందగిస్తున్న కళ్ళు

ఎఱ్ఱ బారుతున్న కళ్ళు

తల భారం తో భగ భగ మండే కళ్ళు

ఎడ తెరిపి లేకుండా నీరు కారే కళ్ళు

ఓ అన్నా! ఓ అక్కా!

ఓ చెల్లీ! ! ఓ తమ్మీ

అన్ని అవయవాల కన్నా కళ్లే ముఖ్యం

ప్రపంచాన్ని చూసే ఆ కళ్ళు జరభద్రం, పదిలం!

ఇంటి బాధ్యత మోసే పెద్దన్న వోలె!

నేనున్నానంటూ ఉద్యమ చంద్రుని లా

ఎంతో శ్రమించి తెచ్చిన, బంగారు తెలంగాణ లో

ఇంటింటా ‘కంటి వెలుగు ‘పథక కాంతులు ప్రసరిస్తున్నాయి.

తళ తళ మెరిసే సూర్య కిరణం వలె

రాష్ట్రమంతటా వెదజల్లే “కంటివెలుగు”

దేశానికే వన్నె తెచ్చే పథకం

అంధ రహిత రాష్ట్రం గా తల మానిక మయ్యే!

పేదల కన్నులలో వెలుగు నింపే సాధనం

ఉచిత శస్త్ర చికిత్స,కళ్లజోళ్లు, మందులు అందించే అపర ధన్వంతరి

ప్రగతి పథంలో కి దూసుకుపోతున్న తెలంగాణ కోటి నాదాలు వినిపించే రతనాల వీణ!!!

Mani Vadlamani

Mani Vadlamani

9654067891

2023-06-06T04:09:54Z dg43tfdfdgfd