ప్రజలు తమ ఇళ్లను వారికి దొరికే సమయాన్ని బట్టి, అలవాట్లను, అభిరుచులను బట్టి శుభ్రపరుచుకుంటూ ఉంటారు.
కొందరు ఇళ్లను రోజూ శుభ్రం చేసుకుంటూ ఉంటే, కొందరు వారానికి ఒకసారి ఈ పని పెట్టుకుంటారు.
రోజూ చేసే క్లీనింగ్‌తో పాటు కొందరు ఇంటి మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటారు. కొందరు ఏడాదికి ఒకసారి ఇంటిని అద్దంలా తీర్చిదిద్దుకుంటారు.
‘డీప్ క్లీనింగ్’ పేరుతో ఆ రోజు ఇంటిని పూర్తిగా సర్దుకుని, శుభ్రపరుచుకుంటారు.
చాలా మంది కిచెన్‌ను, బాత్రూమ్ను తరచూ క్లీన్ చేస్తుంటారు.
ఓవెన్స్, టాయిలెట్స్, కార్పెట్లను శుభ్రపరుచుకునేందుకు ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. ఎందుకంటే, చాలా రకాల ఫంగస్‌లు, క్రిములు, బ్యాక్టీరియాలు, పురుగులు వంటివి ఇక్కడి నుంచే ఇంట్లోకి వ్యాపిస్తాయని భావిస్తారు.
అయితే, ఇంటిని శుభ్రపరుచుకునే సమయంలో కొన్ని వస్తువులను ప్రజలు మర్చిపోతుంటారు. వీటి నుంచి క్రిములు, బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు.
బ్యాక్టీరియాలు, క్రిములు, ఫంగస్‌లు వ్యాపించే ఆ నాలుగు వస్తువులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటి వరకి ఈ నాలుగు వస్తువులను మీరు తరచూ శుభ్రపరుచుకోకపోతుంటే, వాటిపై ఇక నుంచి శ్రద్ధ వహిస్తే మంచిది.
పరుపు శుభ్రం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ, ప్రతి రోజూ మనిషి శరీరంపై ఉండే మృతకణాలు ఈ పరుపుపైనే పడుతూ ఉంటాయి.
2018లో రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో, చింపాజీలు వాడే పరుపుల కంటే మనుషులు వాడే పరుపులపైనే 30 శాతం ఎక్కువ మృతకణాలు, సూక్ష్మక్రిములున్నట్లు గుర్తించారు.
దుమ్ము, ధూళి, చెమట వంటివి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి.
గత కొన్నేళ్లుగా పరుపులను శుభ్రపరుచుకునేందుకు వీలుగా పలు రకాల క్లీనింగ్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
పరుపును ఎండలో పెట్టి వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరుపును ఎండలో పెట్టడం వల్ల దానిపై ఉన్న తేమ తొలగిపోయి, క్రిములు పెరగడం తగ్గిపోతుంది.
దీని కోసం ఎప్పటికప్పుడు పరుపును వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకుంటూ ఎండలో ఆరబెడుతూ ఉండాలి.
వాతావరణ మార్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రోసరీలు, కూరగాయలు తెచ్చుకోవడానికి, షాపింగ్‌కు రీయూజబుల్ బ్యాగ్‌లను వాడాలని చెబుతున్నారు.
చాలా మంది గృహిణులు ఈ బ్యాగ్‌లను వాడుతున్నారు కూడా. కానీ, చాలా మంది వీటిని శుభ్రపరుచుకునే విషయంలో మాత్రం అంత ఆసక్తి చూపడం లేదు.
ఇలాంటి బ్యాగ్స్పైన ఈ-కోలి వంటి చాలా సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాలను గుర్తించినట్లు యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా మైక్రోబయాలజిస్ట్ చార్లెస్ పీ గెర్బా అన్నారు.
లోదుస్తుల మీద కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఈ బ్యాగ్‌లపైనే ఉన్నట్లు గుర్తించారు.
ఒకవేళ ఈ బ్యాగ్‌లను మీరు మాంసం, కూరగాయలు తెచ్చేందుకు వాడుతూ ఉంటే, మీరు బ్యాక్టీరియాలతో సలాడ్, డిన్నర్ చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలి.
వారంలో ఒకసారైనా ఈ బ్యాగ్‌లు శుభ్రం చేసుకోవాలని యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లీనినెస్ సూచిస్తోంది.
డిష్ స్పాంజ్‌ను మనం క్లీన్ చేసే వస్తువుగానే చూస్తాం. డిష్ వాషర్ సోప్‌గా మనం పరిగణిస్తాం.
సోప్‌తో దీన్ని వాడుతూ ఉండటం వల్ల, ప్రత్యేకంగా దీన్ని శుభ్రపరుచుకోవాల్సినవసరం లేదనుకుంటాం. కానీ, ఇది కరెక్ట్ కాదు.
జర్మనీలోని ఒక యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో, సింక్‌పై కంటే స్పాంజ్పైనే ఎక్కువ క్రిములు, బ్యాక్టీరియాలు ఉన్నట్లు తెలిసింది.
బాత్రూమ్ స్పాంజ్‌ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా కిచెన్ స్పాంజ్లపైనే ఉంటాయి. ఈ స్పాంజ్లపైన 362 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు ఒక అధ్యయనం గుర్తించింది.
దీనికి గల ప్రధాన కారణం ఈ స్పాంజ్ నిత్యం తడిగా ఉండటమే. ఈ స్పాంజ్లు చిన్నచిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. క్రిములు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందేందుకు ఈ రంధ్రాలు దోహదం చేస్తాయి.
ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియాలను నిర్మూలించేందుకు వారంలో ఒకసారైనా క్లోరిన్, బ్లీచ్‌తో ఈ స్పాంజ్‌లను శుభ్రపరుచుకుంటూ ఉండాలి.
యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ(ఎన్ఎస్ఎఫ్) నిర్వహించిన సర్వేలో వంటగదిలో ఎక్కువ సూక్ష్మక్రిములు కాఫీ మెషిన్లోనే ఉంటున్నట్లు తెలిసింది.
కాఫీ మెషిన్‌ను పరిశీలిస్తే, 67 రకాల సూక్ష్మక్రిములను రీసెర్చర్లు గుర్తించారు.
కాఫీ మెషిన్లను రెండు రకాల సమస్యలున్నాయి. వేడి నీళ్లు అన్ని సూక్ష్మక్రిములను చంపివేయవు. అంతేకాక, బ్యాక్టీరియాలు మరింత పెరిగేందుకు కెఫెన్ సహకరిస్తుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి కాఫీ మెషిన్‌ను శుభ్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాపుల్స్ను ఉపయోగించే మెషిన్లను 100 యూనిట్ల తర్వాత శుభ్రపరుచుకోవాలని చెబుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
2023-03-26T15:06:28Z dg43tfdfdgfd