కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటి పండ్లు: 2, ఉప్పు: అర టీ స్పూన్, పెరుగు: పావుకప్పు, బేకింగ్ సోడా: చిటికెడు, పంచదార: 1 లేదా 2 టీ స్పూన్లు, నూనె: డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర : ఒక టీ స్పూన్, మైదా: రెండు కప్పులు
తయారీ విధానం
పెద్ద గిన్నె తీసుకుని అందులో రెండు అరటిపండ్లు తొక్కతీసి వేసి, పంచదార వేయాలి. ఫోర్క్ సాయంతో దాన్ని మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. దానికి పెరుగు, జీలకర్ర, బేకింగ్ సోడా, ఉప్పు జోడించి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి మైదా కలిపి ముద్దలా చేసుకోవాలి. అయిదు నిమిషాలపాటు గట్టిగా కలుపుతూ ఉంటే పిండి మృదువుగా తయారవుతుంది. ఆ ముద్దకు నూనెను పై పూతగా పూసి మూత పెట్టి ఎనిమిది గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. కాస్త మైదా వేసి పూరీ కన్నా మందంగా ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యిమీద కడాయి పెట్టి నూనె మరిగించాలి. అందులో పూరీలు వేసి ముదురు గోధుమ రంగులో వచ్చేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. చట్నీ లేదా కుర్మాతో కలిపి వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
2023-03-22T19:34:25Z dg43tfdfdgfd