ASHADA MASAM: ఆషాఢ మాసంలో ఈ ఒక్కటి చేసినా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది..!

సాధారణంగా తులసి మాతను పూజించేవారు ప్రతిరోజూ నీరు సమర్పిస్తూ ఉంటారు. అయితే.. ఈ ఆషాఢ మాసంలో తులసి మాతకు నీరు కాకుండా పాలు సమర్పించాలి.

ఆషాఢ మాసం అనగానే.. ఎలాంటి శుభకార్యాలు చేసుకోరు అని అనుకుంటారు. కానీ, ఈ మాసం విష్ణుమూర్తికి అంకితం చేశారు. అదేవిధంగా ఈ నెలలో తులసి పూజకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవచ్చారు. ఈ ఆషాఢ మాసంలో విష్ణువు, తులసి మాతను పూజించడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, అదృష్టం మాత్రమే కాకుండా.. లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని నమ్ముతారు. సంపద కూడా పెరుగుతుంది. మరి, ఈ ఆషాఢ మాసంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం....

సాధారణంగా తులసి మాతను పూజించేవారు ప్రతిరోజూ నీరు సమర్పిస్తూ ఉంటారు. అయితే.. ఈ ఆషాఢ మాసంలో తులసి మాతకు నీరు కాకుండా పాలు సమర్పించాలి. ఇలా పాలు సమర్పించడం శుభప్రదంగా పరిగణిస్తారు.జ్యోతిష్యం ప్రకారం, తులసికి పచ్చి పాలు నైవేద్యం పెడితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.శ్రేయస్సు వస్తుంది. ఆర్థిక లాభాల అవకాశాలు ఉన్నాయి.దానితో పాటు, గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఆషాఢ మాసంలో తులసికి పాలు నైవేద్యం పెట్టడం వల్ల లక్ష్మీదేవి,విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి.

జ్యోతిష్యం ప్రకారం, ఆషాఢ మాసంలో తులసి మొక్కకు ఎర్ర కలవ పూలను సమర్పించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. సంపద కూడా పెరుగుతుంది. ఎరుపు రంగు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడంలోనూ సహాయం చేస్తుంది.

ఆషాఢ మాసంలో, తులసి మొక్కకు పసుపును నైవేద్యం పెట్టడం ద్వారా , వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. దీనితో పాటు, వివాహం ఆలస్యం అవుతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించాలి. ఈ పరిహారం వివాహంలో అడ్డంకులను తొలగిస్తుంది. వివాహ అవకాశాలు పెరుగుతాయి.

2025-06-10T07:33:28Z