BANANA FOR HAIR : అరటిపండులో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట..

చాలా మంది లైఫ్‌స్టైల్, తీసుకునే ఫుడ్ కారణంగా జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చిట్లడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి మారిన వాతావరణం కూడా కారణమవుతుంది. జుట్టు సమస్యలు రావడానికి ఒక్క కారణమంటూ ఏది ఉండదు. అనేక కారణాలు ఉంటాయి. ఇందుకోసం ఇంటి చిట్కాలు వాడడం చాలా మంచిది. అందులో ఒకటి అరటిపండు వాడడం. అది ఎలానో చూద్దాం.

అరటిపండ్లలోని పోషకాలు..

అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం , సిలికాన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకి చాలా మంచిది. పాడైన జుట్టుకి చాలా మంచిది. దీనిని ప్యాక్‌లా చేసి వాడడం వల్ల జుట్టుకి కండీషనర్‌లా ఉంటుంది. అంతే కాదు జుట్టు బౌన్సీగా ఉంటుంది. జుట్టు బలంగా మారుతుంది. దీనిని మాస్క్‌లా చేసి వాడడం వల్ల జుట్టుకి చాలా మంచిది. మరి అలాంటి మాస్క్‌ని ఎలా ప్రిపేర్ చేయాలంటే..

జుట్టు పాడవ్వడానికి కారణాలు..

హెయిర్ కలర్స్, స్టైలింగ్ ప్రోడక్ట్స్ వంటి కెమికల్స్ కారణంగా జుట్టు సమస్యలు ఎదురవుతాయి. అందుకోసం బెస్ట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఎంచుకోవాలి. ఇవి వాడడం వల్ల కెమికల్స్‌తో హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి జుట్టు సమస్యలని అరటిపండు మాస్క్‌తో దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

98973436

కావాల్సిన పదార్థాలు..

ఓ అరటిపండు

1 టీ స్పూన్ అలోవేరా జెల్

1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్

తయారీ విధానం..

వీటిని అన్నింటిని కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్టు‌లా చేసుకోవాలి. ఇది మంచి క్రీమీగా తయారవుతుంది. దీనిని జుట్టుకి అప్లై చేయాలి. రాసిన తర్వాత 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పదిహేను రోజులకి ఓసారి ఇలానే చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.

సెకండ్ ప్యాక్..

ఈ ప్యాక్‌ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

1 పండిన అరటిపండు

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

1 టీస్పూన్ అలోవేరా జెల్

తయారీ విధానం..

పదార్థాలన్నీ మిక్సీ జార్‌లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిని జుట్టుకి అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలానే ఉంచి శుభ్రం చేసుకోవాలి.

మూడో రకంగా..

ఇలాంటి జుట్టుని ఒకటి లేదా రెండు సార్లు క్లీన్ చేస్తే జుట్టు మొత్తం క్లీన్ అవుతుంది. అయితే మూడో విధంగా ప్యాక్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇందుకోసం..

కావాల్సిన పదార్థాలు..

ఓ టేబుల్ స్పూన్ కండీషనర్

సగం అరటిపండు

ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం

ఓ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ల పెరుగు

2, 3 చుక్కల లావెండర్ ఆయిల్

వీటన్నింటి కలిపి మంచి పేస్ట్‌లా చేయాలి.

జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడగాలి. దీని వల్ల మెరిసే జుట్టు మీ సొంతం.

99015930

నాలుగో హెయిర్ ప్యాక్..

ఇందుకోసం కావాల్సిన పదార్థాలు..

1 పండిన అరటిపండు

1 పండిన అవోకాడో

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

వీటిన్నింటిని కలిపి మెత్తగా చేసి 15నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి.

2023-03-27T16:17:18Z dg43tfdfdgfd