బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఇందులో ముఖ్యంగా గుండె సమస్యలు, ఇతర ప్రాణాంతక సమస్యలు. వీటన్నింటికి దూరంగా ఉండాలంటే ముందుగా బెల్లీ, అధిక బరువుని తగ్గించుకోవాలి. అందుకోసం కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. అవేంటో తెలుసుకోండి. కారణాలు..
బెల్లీ, అధిక బరువుని తగ్గించుకోవాలంటే ముందుగా ఆ సమస్యకి కారణాలని తెలుసుకోవాలి. అవి..అన్ హెల్దీ ఫుడ్ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంసరిగ్గా నిద్రపోకపోవడంఒత్తిడిపోషకాహారం లోపంఆడవారిలో థైరాయిడ్, పీసీఓడీ, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వంటివి. ఈ సమస్యలు దూరమయ్యేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి..
ఊబకాయాన్ని తగ్గించే వీరభద్రాసనం..
గోరువెచ్చని నీరు..
ఉదయం లేవగానే మనకి మలవిసర్జన అవ్వాలి. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ఇలా అవ్వాలంటే జీర్ణ వ్యవస్థ సరిగా ఉండాలి. అందుకోసం ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవాలి.
హెర్బల్ పౌడర్..
దీనికోసం.. కొన్ని పదార్థాలు కావాలి..అవి..జీలకర్ర 50 గ్రాములువాము 50 గ్రాములుసోంపు 50 గ్రాములు..వీటిలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో కలిపి చేసిన పొడిని తీసుకుంటే పొట్టలోని వ్యర్థాలు, ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. కొవ్వు పేరుకుపోదు.
పొడి ఎలా చేయాలి..
ముందుగా ప్యాన్ తీసుకుని ఒక్కో పదార్థాన్ని విడివిడిగా వేయించాలి. వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఈ పొడిని ప్రతి భోజనం తర్వాతం ఓ చెంచా తీసుకుని తినాలి. 10 నిమిషాల తర్వాత నీరు తాగాలి.
మొలకలు..
బెల్లీఫ్యాట్‌ని తగ్గించడంలో మొలకలు కీ రోల్ పోషిస్తాయి. మొలకెత్తిన పెసలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో జీవక్రియ పెరిగి మలబద్ధకం దూరమవుతుంది. మొలకలు తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో చాలాసేపు ఆకలి కంట్రోల్ అవుతుంది. దీంతో బరువు, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Fitness News and Telugu News