Belly Fat Reducing Tips | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను పాటిస్తుంటారు. అయితే బరువు తగ్గుతారు కానీ పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడం కష్టంగా ఉంటుంది. కొందరికి శరీరం మొత్తం సన్నగా ఉన్నా పొట్ట మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అధిక పొట్ట ఉండడం అనేది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో సైతం తేలింది. కనుక అధిక బరువు తగ్గడం మాత్రమే కాదు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కూడా కరిగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు గాను వ్యాయామం చేయడంతోపాటు కింద చెప్పిన ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో కొవ్వు కరుగుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు మొత్తం మాయమవుతుంది. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయం మీకు బెడ్ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి. అందుకు బదులుగా నిమ్మకాయ నీళ్లను తాగండి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి సేవించండి. ఇందులో రుచి కోసం దాల్చిన చెక్క పొడి, తేనెను కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపునే సేవించాలి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఉదయం నుంచే క్యాలరీలు కరగడం ప్రారంభమవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. లివర్ చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో కొవ్వు మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లను సైతం తాగవచ్చు. ఇది కూడా జీర్ణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. శరీరానికి కావల్సిన ద్రవాలు ఉదయమే లభిస్తాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ఈ నీటిలో చియా విత్తనాలు లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగండి. దీంతో ఇంకా మంచి ఫలితాన్ని పొందవచ్చు. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవాలంటే అందుకు వ్యాయామం కూడా ఎంతగానో పనిచేస్తుంది. దీనికి గాను ఉదయమే కార్డియో, యోగా, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ వంటివి చేయవచ్చు. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
ఉదయం మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల కండరాలకు శక్తి లభిస్తుంది. కొవ్వు కరిగేందుకు ఈ ఆహారాలు సహాయం చేస్తాయి. కోడిగుడ్లు, పెరుగు, నట్స్, విత్తనాలు, చీజ్, పనీర్ వంటి ఆహారాలను ఉదయం తింటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఇవన్నీ బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఇక ఉదయం చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, కూల్ డ్రింక్స్, పిండి పదార్థాలను తీసుకోవడం తగ్గించండి. ఇవన్నీ కొవ్వు పట్టేందుకు కారణం అవుతాయి కనుక వీటిని తీసుకోవడం తగ్గించండి. ఇలా పలు సూచనలు పాటిస్తే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు.
2025-02-04T15:29:20Z