Trending:


అలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకునే రాశుల వారు వీళ్లే.. కొంచెం కష్టమే..

మన జీవితంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు అమ్మ ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఆప్యాయతతో వడ్డించే భోజనం, ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసే సపర్యలు, కష్టం వచ్చినప్పుడు చెప్పే ధైర్యం.. ఇలా ఎన్నో సందర్భాల్లో అమ్మ మనకు తోడునీడలా ఉంటుంది. పెరిగి పెద్ద అయిన తరువాత పెళ్లి చేసుకోవడం సహజం. అయితే కొందరు మగవాళ్లు తమ జీవితంలోకి అమ్మ లాంటి వ్యక్తి భార్యగా రావాలని కోరుకుంటారు. భార్య కూడా తల్లిలా ప్రేమానురాగాలు చూపాలని భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. తల్లి లక్షణాలు భార్యలో ఉండాలని కోరుకునే రాశులు ఏవో చూద్దాం. మీనంమీనరాశి మగవారు, తల్లిలా ఇంటిని చక్కగా మెయింటెన్ చేసే వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరు చిన్నప్పుడు అమ్మ ఇంటిని చక్కబెట్టే విధానాన్ని దగ్గరి నుంచి చూస్తారు. ఆ ప్రభావంతో పెద్దయ్యాక పరిశుభ్రత, ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. భార్య కూడా ఇలాంగే ఉండాలనుకుంటారు. సురక్షితమైన, ప్రేమపూర్వక సంబంధం కోసం తమ మాతృమూర్తి లక్షణాలను బెంచ్‌మార్క్‌గా భావిస్తారు. వృషభంవృషభరాశి వారు అమ్మానాన్నల మాదిరిగా గొప్ప ప్రేమను చూపే భాగస్వామి తమ జీవితంలోకి రావాలని కలలు కంటారు. వీరు చిన్నప్పుడు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా నిశితంగా గమనించే అలవాటు ఉంటుంది. తల్లిదండ్రుల సంబంధాలను పరిశీలిస్తుంటారు. చాలా విషయాల్లో వారినే ఆదర్శంగా తీసుకుంటారు. అమ్మను ఎమోషనల్ సపోర్ట్‌గా భావిస్తారు. తమకు కాబోయే భార్యలో దయాగుణం ఉండాలనుకుంటారు. సున్నిత మనస్తత్వం, శ్రద్ధ వహించే మహిళలను ఇష్టపడతారు. కర్కాటకంకర్కాటక రాశివారు తమ కుటుంబ సభ్యులు చూపే ఆప్యాయతను మించిన ఆనందం మరోటి ఉండదని భావిస్తుంటారు. తమ జీవితంలో వచ్చే భార్య తల్లిలాగా ప్రేమను పంచాలని అనుకుంటారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశివారికి తమ తల్లులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వారితో స్నేహంగా మెలుగుతారు. ఈ ప్రత్యేకమైన చొరవతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటారు. అందుకే అమ్మతో మంచిగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఈ రాశివారు తమ బాల్యంలో తల్లులతో ఉన్న అనుబంధం, పెంపకం, అలాంటి వాతావరణాన్ని తిరిగి అందించే భాగస్వాములను కోరుకుంటారు. ఇంట్లో ఓదార్పును, ప్రేమను పంచే ఇల్లాలు ఉండాలనుకుంటారు. మేషంబాల్యంలో తల్లులు తమ పట్ల చూపిన శ్రద్ధ, అంకితభావం గురించి మేషరాశివారు ఆలోచిస్తుంటారు. స్కూల్ హోంవర్క్‌లో తల్లి చేసే సహాయం, లంచ్ బాక్స్‌లను సిద్ధం చేయడంలో తల్లిచూపిన శ్రద్ధను గుర్తుకు తెచ్చుకుంటారు. మేషరాశివారు తమ తల్లులను బాగా ఆరాధిస్తారు. బాల్యంలో తల్లులు చేసిన విధంగా తమ జీవిత భాగస్వాములు ఉండాలని, అదేవిధంగా సేవ చేయాలని కోరుకుంటారు. భార్యకు ఎమోషనల్ సపోర్ట్ అందించాలనుకుంటారు. ఇంటి పనులను విభజించుకుని పని భారం తగ్గించాలనుకుంటారు. ఎందుకంటే ఇంటి సంరక్షణ భారం పూర్తిగా ఏ జీవిత భాగస్వామిపైనా ఉండదని వారు భావిస్తారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?

అసలు బల్లులే లేకపోతే, కీటకాల జనాభా పెరిగిపోతుంది. దీంతో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. దోమలు విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటి పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి వాతవరణ మార్పులు కూడా ఒక కారణం.


ఐర‌న్ లోప‌మా.. ఇవి తినండి చాలు!

మీకు ఎక్కువ‌గా చెమ‌ట ప‌ట్ట‌డం, అల‌సిపోవ‌డం, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉంటే మీరు ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లే. ఐర‌న్ లోపం ఉన్న‌వారు తీసుకోవాల్సిన పోష‌కాహార‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కండరాలను దృఢంగా మార్చే వెజ్‌ ఆహారాలు!

కండరాలను ఆరోగ్యంగా, దృఢంగా మార్చుకునేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ కొన్ని వెజ్‌ ఆహారాల గురించి వివరించాం. ఇవి మీ కండరాలను బలంగా ఉంచుతాయి.


Monsoon Diet: వర్షాకాలంలో ఈ పప్పులు అస్సలు తినకూడదు...!

మనం రోజూ తినే పప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు , మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని పప్పులలో మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ , ఇనుముతో సహా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా, అనేక వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. మరోవైపు పప్పు తినడం వల్ల కూడా చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. అయితే అనుభవజ్ఞుడైన వైద్యుడు బిశ్వజిత్ సర్కార్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ఎలాంటి పప్పులు తినకూడదు అన్న విషయలు వివరించారు, అనేక ఇళ్లలో కందిపప్పు తినడం కనిపిస్తుంది. కానీ ఈ పప్పు జీర్ణం కావడం కష్టం. అందుకే తేమతో కూడిన వాతావరణంలో ఈ పప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. రాజ్మా దాల్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.. రాజ్మా తినడం వల్ల శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. అయితే, వర్షాకాలంలో అధికంగా తింటే రాజ్మా తినడం ప్రమాదకరం. చనగపప్పు అందరికీ ఇష్టమే. అయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పప్పును వర్షాకాలంలో తినకూడదు. ఎందుకంటే అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. గ్యాస్, ఉబ్బరం ఆమ్లత్వం ఏర్పడవచ్చు.


Chegodilu Recipe: చేగోడీలు ఇలా చేస్తే అసలు వదిలిపెట్టరు..!

Chegodilu Recipe In Telugu: చేగోడీలు రుచికరమైన స్నాక్‌. వీటిని మార్కెట్‌లో ఎక్కువగా కొంటూంటారు. కానీ వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇదీ కోసం కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. చేగోడీలను టీతో పాటు తింటే టేస్ట్ బాగుంటుంది.


మీ పుట్టిన తేది ఇదే అయితే.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. టెన్షన్ పెరుగుతుంది

Numerology: ఆందోళన పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలను జోడించండి.మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ నంబర్ ద్వారా మీ జూలై 18 2024 ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. Number 1: ఈ రోజు సీనియర్ మద్దతు పనిని సులభతరం చేస్తుంది. ఇంట్లో బయట ఆనందం, శాంతి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రశాంతత ఉంటుంది. మీ వ్యాపారంలో లాభిస్తుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. చెడు సహవాసాన్ని నివారించండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. చెల్లించడం సులభం. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఇంటి లోపలా, బయటా ఆనందం దొరుకుతుంది. Number 2: ఈరోజు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆందోళన ,ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. వ్యాపారం బాగుంటుంది. ప్రజల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం,సహాయం పొందుతారు. ధనం పొందేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. లగ్జరీ వస్తువులపై పెద్ద ఖర్చు ఉండవచ్చు. Number3: ఈ రోజు మీరు కుటుంబ ఆందోళనలతో ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. ఉత్సాహం,ఆనందం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి సమయం భావోద్వేగాల ప్రభావంతో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవద్దు. తెలివైన ఉపయోగం లాభాలను పెంచుతుంది. ఆదాయం మిగిలి ఉంటుంది. అలసట చెందుట. Number 4:ఈ రోజున కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. మీరు మీ పనిలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సమయం అనుకూలంగా ఉంటుంది. సోమరితనం ఆపడానికి ప్రయత్నించండి. శారీరక నొప్పి వచ్చే అవకాశం ఉంది. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆందోళన మరియు ఉద్రిక్తత ఉంది. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండండి. Number5: ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. సంతోషం ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించండి. లాభం పెరుగుతుంది. ఈ సంఖ్యలో ఉన్న వ్యక్తులు స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త స్నేహితులను పొందండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. తొందరపాటుతో నష్టపోయే అవకాశం ఉంది. శరీర నొప్పిని నివారించండి. Number 6: ఈ రోజు ఆందోళన,ఉద్రిక్తత ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ వ్యక్తులు వారి పనిలో పనిభారాన్ని కలిగి ఉండవచ్చు. ఆదాయంలో కచ్చితంగా ఉంటుంది. రోజంతా అనుకూలంగా ఉంటుంది కానీ బాధ్యతల నిర్వహణలో కొంత ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనిలో శ్రమ, మళ్లింపు, ఒత్తిడి ఉండవచ్చు. పనిలో గురుతర బాధ్యతల భారం పెరుగుతుంది. Number7: వృత్తి, వ్యాపారాలలో ఈరోజు ఆశించిన పురోగతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పనిలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. Number8: ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఇష్టమైన బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కుటుంబ పెద్దల ద్వారా సులభంగా పరిష్కరించబడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఒకట్రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా వస్తాయి. అనారోగ్యం నుండి కొంత ఉపశమనం పొందుతారు. Number 9: ఈరోజు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. చాలా కెరీర్లు మరియు ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. బంధువుల నుంచి ఇబ్బందులు ఉంటాయి.. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఎసిడిటీని తగ్గించే సింపుల్ చిట్కాలు మీకోసం!

మారుతున్న జీవ‌న విధానం, భోజ‌న‌వేళ‌ల్లో మార్పులు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన‌డం వ‌ల‌్ల చాలామంది ఎసిడిటీతో బాధ‌ప‌డుతున్నారు. అందుకే ఎసిడిటీని త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


జుట్టుకు నెయ్యి రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

నెయ్యి వ‌ల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నెయ్యి తిన‌డం వ‌ల‌్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నెయ్యిని జుట్టుకు రాయ‌డం వ‌ల‌్ల ఏం అవుతుంద‌ని చాలా మందికి సందేహం ఉంటుంది. అందుకే నెయ్యితో జుట్టుకు ఏమైనా ప్రయోజనం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ ఇండోర్ మొక్కలతో ఇల్లు సువాసనభరితం!

కొన్ని ఇండోర్ మొక్కలు ఇంటిని సువాసనభరితంగా మారుస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Beauty Tips: చెంపలపై గులాబీ రంగు మెరుపు కావాలా? ఈ గులాబీ రేకుల జెల్ వాడండి

Beauty Tips: ముఖంపై గులాబీ రంగు మెరుపుదనం కావాలా? అలాంటి అందమైన ముఖం కావాలంటే ప్రతిరోజూ రోజ్ జెల్ ఉపయోగించండి. దీన్ని నెల రోజులు వాడితే చాలు గులాబీ మెరుపు మీ ముఖానికి వస్తుంది.


ఒంటెలపై పెళ్లి ఊరేగింపు.. ఈ పెళ్లికొడుకు ఎంట్రీ మామూలుగా లేదు..!

పెళ్లిళ్ల సమయంలో వరుడు హెలికాఫ్టర్ లో లేదా.. లగ్జరీ కారులోనే ఊరేగింపుతో రావడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. అయితే బీహార్ జలోర్ లోని బావ్త్రా గ్రామంలో జరిగిన ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లిలో ఊరేగింపు ఒంటెల బండిపై జరిగింది. వరుధు మాత్రమే కాదు.. వారి బంధువులూ ఒంటెల బండిపై వధువు ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి వరుడు ఒంటెపై ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చాడు. ఇలా ఒంటెల బండ్లపై ఊరేగింపుగా వరుడి బంధువులు రావడం చూసి.. స్థానికులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఆ పెళ్లి వేడుకను అందరూ తిలకించారు. నిజానికి వరుడు ఇలా ఒంటెల బండిపై ఎంట్రీ ఇస్తాడని.. వధువు తల్లి దండ్రులు కూడా భావించలేదంట. ఖరీదైన ఖారులోనో.. లేక రైళులోనే వస్తారని అందరూ అనుకున్నారు. అయితే తాము వినూత్నంగా ఈ వేడుకను జరుపుకోవాలని ఇలా ఒంటె బండిపై వచ్చినట్లు వరుడి తండ్రి వగ్తా రామ్ దేవాసి లోకల్ 18తో చెప్పారు. జలోర్ జిల్లాలోని బావ్త్రా నుంచి వలేరా వరకు వరుడు రాజు సంప్రదాయ ఊరేగింపు జరిగింది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఊరేగింపు కారుల్లో వెళ్తుంది, కాని పాత సంస్కృతి, ఆచారాలను సజీవంగా ఉంచడానికి రైకా సమాజం ఈ ఊరేగింపును అద్భుతంగా నిర్వహించిందని వరుడి బంధువులు తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారం అలంకరించిన ఒంటెలు.. ఒంటె బండ్లతో సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో సుమారు నలభై నుంచి యాభై ఒంటెలను ఉపయోగించారు. వరుడితో పాటు.. వారి బంధువులు కూడా వాటిపైనే ప్రయాణం చేశారు.


స్లీప్ విడాకుల వల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో తెలుసా?

స్లీప్ విడాకుల గురించి విన్నవారు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ దీన్ని ఫాలో అవుతున్న వారు మాత్రం చాలా మంది ఉన్నారు. అసలు ఏంటీ ఈ స్లీప్ విడాకులు, దీనివల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఈ మధ్య కాలంలో స్లీప్ డిరోర్స్ ట్రెండ్ బాగా పెరిగింది. భార్యా భర్తలు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి, నిద్రలేమిని తగ్గించుకోవానికి, సంబంధాలను మెరుగుపర్చడానికి ఒక ప్రత్యామ్నాయంగా స్లీప్ డివోర్స్ ను ఫాలో అవుతున్నారు. స్లీప్ డివోర్స్ అంటే...


Foods To Avoid: బీపీ, షుగ‌ర్ వ్యాధిగ్రస్తులు ఈ ప‌దార్థాలు అసలు తినకూడదు..!

High Bp And Diabetes Foods To Avoid: డయాబెటిస్‌, అధిక రక్తపోటు ఉండే వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.


Today Horoscope: ఓ రాశివారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:-అనుకోకుండా బంధువులతో గొడవలు...


Chicken Pulao: సింపుల్ అండ్ ఈజీ చికెన్ పులా రెసిపీ తయారు చేసుకోండి ఇలా!!

Chicken Pulao Recipe: చికెన్‌ పులావ్ ప్రతిఒక్కరికి ఇష్టమైన వంకటం. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


పుచ్చకాయ‌ గింజ‌ల‌ను తింటే లాభాలు!

చాలామంది పుచ్చకాయను ఇష్టంగా తింటుంటారు. కానీ గింజ‌ల‌ను మాత్రం తిన‌కుండా పార‌వేస్తారు. అయితే పుచ్చ‌కాయ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల‌్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


ఈ నేచురల్ సప్లిమెంట్లతో నిత్య యవ్వనంగా!

కొన్ని నేచురల్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


కిచెన్ లో నిమ్మకాయ ఇలా మాత్రం వాడకూడదు.. ఎందుకో తెలుసా?

ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. మనం దానిని ఆహార పదార్థంగా మాత్రమే కాదు... చాలా రకాల వస్తువులను క్లీన్ చేయడానికి కూడా వాడేస్తూ ఉంటాం. చాలా రకాల వస్తువులపై పడిన మొండి మరకలను కూడా నిమ్మకాయ ఈజీగా తొలగించేస్తుంది. అంతేకాకుండా.. నిమ్మకాయలో ఉండే స్పెషల్ వాసన కూడా.. మంచి క్లీనింగ్ ఏజెంట్ గా మనకు ఉపయోగపడుతుంది. అయితే.. ఇదే నిమ్మకాయను.. కొన్ని చోట్ల మాత్రం అస్సలు వాడకూడదట. అది కూడా కిచెన్ లోనే.. అది కూడా శుభ్రం...


Toilet Doors: ఆఫీసు లేదా మాల్స్ Toilet Doors పూర్తిగా క్లోజ్ చేసుండవు, ఎందుకో తెలుసా

Toilet Doors: ఆఫీసు లేదా మాల్స్ Toilet Doors పూర్తిగా క్లోజ్ చేసుండవు, ఎందుకో తెలుసా


అమ్మ ప్రేమను మించింది లేదు.. కుమారుడికి కాలేయం దానం చేసిన తల్లి..!

మాతృప్రేమ కంటే గొప్పదేది విశ్వంలో లేదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ.. అనుదినం కాపాడే తొలి రక్షకురాలు తల్లి. మాతృప్రేమకు మరొకటి సాటి రాదనే విషయం మరోసారి రుజవైంది. తన కుమారుడి ప్రాణం నిలబెట్టేందుకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడింది. కుమారుడికి లివర్ దానం చేసిన మరోసారి జన్మనిచ్చింది.


Chaturmas 2024 చాతుర్మాస వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...

Chaturmas 2024 తెలుగు పంచాంగం ప్రకారం, దేవశయని ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా చాతుర్మాస వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు.. ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Celebs dresses: సెలెబ్రిటీలు వేసుకునే బట్టలన్నీ వాళ్లవేనా? తెర వెనక జరిగేదిదే..

Celebs dresses: ప్రతిసారీ సెలెబ్రిటీలు కొత్త బట్టలతో ఎలా కనిపిస్తారో తెల్సుకోవాలని ఉందా.. బట్టలు సేకరించడం నుంచి ఫొటోలు దిగేవరకు ఏం జరుగుతుందో చూడండి.


Raashi Khanna | టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఒంపులు చూస్తే పిచ్చెక్కాల్సిందే

raashi khanna, raashi kahanna pics, raashi khanna latest photoshoot, raashi khanna photoshoot. raashi khanna bikini, raashi khanna instagram, rashi khanna red dress pics, rashi khanna photos


Constipation: రాత్రి పూట ఈ డ్రింక్స్ తాగారంటే.. తెల్లారేసరికి మీ కడుపు క్లీన్.. మలబద్ధకం మ

Foods for constipation: ప్రజలు తరచుగా వారి ఆహారంలో చెడు ఆహారాన్ని చేర్చుకుంటారు, ఇది వారి మొత్తం జీర్ణ ప్రక్రియను పాడు చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల ప్రజల్లో మలబద్ధకం సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారిలో. ఇది కాకుండా, మద్యపానం, టీ, నిరంతర ఆకలి , ధూమపానం వంటివి కూడా మలబద్ధకానికి కారణాలు. ఈ రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం పూట మలవిసర్జనకు వెళ్లేవాళ్లు కడుపుని సరిగా శుభ్రం చేయడం లేదు. వారు తరచుగా మలవిసర్జన చేయాలి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో ఫైబర్ లేకపోవడం , చెడు ఆహారపు అలవాట్లు. చెడు ఆహారం కారణంగా ప్రజలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం , అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో, ఇది తీవ్రమైన మలబద్ధకాన్ని కలిగిస్తుంది. మంచి విషయం ఏమిటంటే, ఆహారాన్ని మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇవే కాకుండా రాత్రిపూట కొన్ని ఫుడ్స్ తింటే ఉదయానికి పొట్ట క్లియర్ అయ్యే కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తున్నాము. అవిసె గింజలు: అవిసె గింజలు కరిగే , కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫైబర్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారుతుంది. ఈ గింజల్లో ఉండే కరగని పీచు పేగులో కూరుకుపోయిన మలాన్ని మృదువుగా చేసి పొట్ట నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది. లిన్సీడ్లను పచ్చిగా తినవద్దు లేదా అవి గొంతులో చిక్కుకుపోవచ్చు. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు గోరువెచ్చని నీటిలో లేదా పాలలో రాత్రిపూట ఈ ఫ్లాక్ సీడ్స్‌ను నానబెట్టి తినవచ్చు. ఇసబ్గుల్: ఇసబ్గుల్ తీసుకోవడం కూడా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీకు దాని ప్రభావం త్వరగా కావాలంటే, గోరువెచ్చని పాలలో కొంచెం ఇస్బాగుల్ కలపండి , రాత్రిపూట త్రాగాలి. ఉదయం లేవగానే పొట్ట శుభ్రంగా ఉందని గమనించవచ్చు. త్రిఫల: త్రిఫల అనేది మూడు పదార్ధాలతో కూడిన ఆయుర్వేద రసాయన సూత్రం. త్రిఫల అనేది అమలకీ, బిభితక హరితకీ మిశ్రమం. ఇది మన పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది, పేగుల్లోని మురికిని శుభ్రం చేయడంలో త్రిఫల చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే పొట్ట శుభ్రంగా ఉండి, పొట్టలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. త్రిఫలం సేవించడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఉసిరి రసం: ఉసిరికాయను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరికాయను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి కానీ దాని తయారీని రాత్రి చేయాలి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉసిరికాయ వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే మరిగించి చల్లారాక తాగాలి. ఉసిరి నీరు కడుపుని శుభ్రపరుస్తుంది ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని సులభంగా తొలగిస్తుంది. ఖర్జూరం: మీకు మలబద్ధకం ఉన్నట్లయితే ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుని తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీని కోసం మీరు ఖర్జూరాలను దేశీ నెయ్యిలో కొంత సమయం పాటు నానబెట్టాలి. ఖర్జూరంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో, ఫైబర్ జీవక్రియను పెంచుతుంది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది కాకుండా, ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలాన్ని మృదువుగా చేస్తుంది, ఇది సులభంగా పోతుంది. ఆముదం: ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 4 నుండి 5 చుక్కల ఆముదం కలపండి . రాత్రి పడుకునే ముందు తినండి. అదే సమయంలో, మీకు పాలతో సమస్యలు ఉంటే లేదా మీ జీర్ణక్రియ తరచుగా చెడ్డది , పాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తే, మీరు తాజాగా వేడి చేసిన నీటిలో 2 టీస్పూన్ల ఆవనూనెను జోడించి తాగొచ్చు. ఈ పద్ధతి మెరుగ్గా పని చేస్తుంది కొన్ని రోజుల్లో మలబద్ధకం సమస్య నుండి మీకు పూర్తి ఉపశమనాన్ని అందిస్తుంది.


మహిళా నృత్య కళాకారిణికి అపూర్వ గౌరవం.. ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించిన యునెస్కో..!

పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా.. కళ, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ చౌనృత్యం ఈ జిల్లా సంప్రదాయాలలో ఒకటి. పురూలియా నటి మౌషుమి చౌదరి దీనిని ప్రపంచ ఖ్యాతికి తీసుకు వెళ్లారు. రకరకాల మాటలకు, అవమానాలకు ఆమె భయపడలేదు. సమాజం ముందు ధైర్యంగా నిలబడి.. తన ప్రతిభను చూపింది. దీంతో అందరూ ఆ అద్భుత ప్రతిభకు దాసోహం అయ్యారు.. నేడు దేశ విదేశాల్లో ఆమె డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.మౌసుమీ జీవిత కథను ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ గుర్తించింది....


పిల్లలు ఏడుస్తున్నట్లు కల వస్తే అర్థమేంటి..?

ప్రతిరోజూ మనకు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు అయితే మనకు అసలు ఎలాంటి సంబంధం లేనివిగా ఉంటాయి. తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు కూడా కలలో కనిపిస్తూ ఉంటారు. ఆ రోజు మనం చూసిన సినిమా ప్రభావమో, జరిగిన సంఘటనల ప్రభావం కూడా మన కలలపై ఆధారపడి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతి కలకి మన జీవితంతో కొంత సంబంధం ఉంటుంది. ప్రతి కల మీ జీవితంలో రాబోయే సంఘటనను సూచిస్తుంది. లేదా గత సంఘటనలను సూచిస్తుంది. ఈ కలల వివరణ మనకు భిన్నంగా ఉండవచ్చు. చాలా సార్లు మన కలలో...


Manushi Chhillar: చీరకట్టులో మరింత సొగసుగా మానుషి చిల్లర్ అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Manushi Chhillar: చీరకట్టులో మరింత సొగసుగా మానుషి చిల్లర్ అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..


ఇదొక్కటి కలిపితే... షుగర్ పేషెంట్స్ కూడా వైట్ రైస్ తినొచ్చు..!

వైట్ రైస్ తగ్గించేయమని, దాని బదులు జొన్నన్నం, చపాతీలు లాంటివి తినమని సలహా ఇస్తూ ఉంటారు. పాపం.. వాళ్లకు మామూలు అన్నం కాకుండా.. జొన్నన్నం, చపాతీలు తినడం చాలా కష్టంగా ఉంటుంది. మన దేశంలో ప్రధాన ఆహారం అన్నం. ప్రతి ఒక్కరం చిన్నతనం నుంచే అన్నం తింటూ పెరుగుతూ వస్తున్నాం. ఒక్కపూట అన్నం కాకుండా మరేదైనా తింటే.. అసలు భోజనం చేసిన అనుభూతి కూడా చాలా మందికి ఉండదు. ఒక్కముద్దైనా రైస్ పొట్టలో పడాల్సిందే. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాపం...


Parenting | సాయం చేయనిద్దాం.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పరుద్దాం

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.


Meat banned city: ప్రపంచంలో పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించిన పట్టణం ఇది, మనదేశంలో ఉన్న ఈ ఊరి గురించి తెలుసుకోండి

Meat banned city: ఏదైనా గ్రామంలో శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఉంటారు, కానీ మాంసాహారులే లేని గ్రామం ఒకటుంది. అది కూడా మనదేశంలోనే ఉంది. ఇది ఎక్కడుందో తెలుసుకోండి.


Malavika Mohanan | అందానికే అసూయ పుట్టేలా.. ట్రెండింగ్‌లో మాళవిక మోహనన్‌ స్టిల్స్‌

Malavika Mohanan | సోషల్ మీడియాలో షేక్ చేకే అతికొద్దిమంది భామల్లో టాప్‌లో ఉంటుంది మాళవిక మోహనన్‌ (Malavika Mohanan). హాట్ లుక్‌లోనైనా, ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో అయినా.. సంప్రదాయ చీరకట్టులోనైనా ఇంప్రెస్‌ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది మాళవిక మోహనన్‌.


Astrology 18-7-2024: ఈ రాశుల వారికి ఆ విషయంలో తిరుగుండదు..!

Rasi Phalalu:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్యనిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జూలై 18, 2024 గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేషం (Aries):మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. రొమాంటిక్ లైఫ్‌లో ఎలాంటి భయాందోళనలు లేదా అనుమానాలు పెట్టుకోకుండా పార్ట్నర్‌ను నమ్మాలి. నేడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది, కెరీర్ గ్రోత్‌కు బాటలు పడతాయి. ఆఫీసులో ఏవైనా గొడవలు ఉంటే, మీరు న్యూట్రల్‌గా ఉండాలి. మీరు కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు వస్తే బాధపడొద్దు. ఈ రోజు మీ మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి. మీ కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. మీ అదృష్ట సంఖ్య 25, అనుకూలమైన రంగు పసుపు. ఈరోజు ఇత్తడి గిన్నె అదృష్టాన్ని సూచిస్తుంది. వృషభం (Taurus):మీ రిలేషన్‌షిప్‌లో ఏవైనా గొడవలు ఉంటే, ఇద్దరూ అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలి. డీప్ లవ్, రొమాన్స్ వంటి ఫీలింగ్స్‌ను ఎంజాయ్ చేస్తారు. అనవసర ఆలోచనలు వదిలేసి ముందుకు సాగండి. ఈరోజు ఆఫీసు చర్చల్లో, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమావేశంలో చురుకుగా పాల్గొని, అధికారులకు సహకరించాలి. మీరు చిన్న విషయాలకు ఆత్మసంతృప్తి పొందకూడదు, ఇంకా మోటివేట్ అవ్వాలి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో లాభాల కోసం చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మీ కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి. మీ శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించుకోండి. ఈ రోజు మీ కుటుంబంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. మీ అదృష్ట సంఖ్య 52, అనుకూలమైన రంగు వెండి. ఈ రోజు తలపాగాను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మిథునం (Gemini):ఈ రోజు మీ సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయి. ప్రేమ విషయంలో భాగస్వామిపై అనవస అంచనాలను వదిలేసి ప్రాక్టికల్‌గా ఉండాలి. మీ కెరీర్‌ గ్రోత్‌ బాగుంటుంది. కొత్త అవకాశాలు, ఆలోచనలతో విజయాలు అందుకుంటారు. టీమ్ వర్క్‌ సరిగా చేయాలి. మీ కొత్త వ్యాపారాన్ని సరికొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలి. మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపితే, వారితో బంధాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 11, అనుకూలమైన రంగు ఊదా. ఈరోజు ప్యాక్ చేసిన సామాను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కర్కాటకం (Cancer):ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌లో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇది మీ జీవిత భాగస్వామితో డీప్ కనెక్షన్, సరైన అవగాహనను పెంపొందిస్తుంది. రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీ ప్రియమైన సహవాసాన్ని ఆస్వాదిస్తారు. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్‌లో సహనం, పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. సహోద్యోగులతో కలివిడిగా ఉండాలి. మీ కొత్త వ్యాపార సంస్థలో లాభాలు వస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శారీరక, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల అవసరాలు, భావోద్వేగాలకు విలువ ఇవ్వాలి. మీ అదృష్ట సంఖ్య 13, అనుకూలమైన రంగు చార్‌కోల్ గ్రే. ఈరోజు తేనెటీగను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. సింహం (Leo):ఈ రోజు సంబంధంలో మీ వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచుకోవాలి. నేను, నాకు అనే భావన విలేసి మనం అనే భావన బలంగా ఉందని భాగస్వామికి అర్థమవ్వాలి. లవ్, రిలేషన్‌లో ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ప్రియమైన వారితో ప్రస్తుత క్షణాలను ఆస్వాదిస్తారు. అయితే అనవసర ఎక్స్‌పెక్టేషన్స్ మంచివి కావు. మీ కెరీర్ గ్రోత్‌ ప్లానింగ్‌ను నమ్మాలి. ఈరోజు మీ ఆఫీస్ సహోద్యోగులకు సరిగా ప్రవర్తించాలి. అహంకారాన్ని వదిలి యూనిటీకి విలువ ఇవ్వాలి. ఇది మీ కొత్త బిజినెస్ వెంచర్‌కు ప్లస్ అవుతుంది. పెద్ద కలలు కనండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. ఈ రోజు మీ కుటుంబంతో సామరస్యంగా గడపాలి. మీ అదృష్ట సంఖ్య 23, అనుకూలమైన రంగు లేత గోధుమరంగు. ఈ రోజు బ్లాక్ కలర్ కర్టెన్‌ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కన్య (Virgo):ఈ రోజు రిలేషన్స్‌లో మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలంగా మారుతుంది. మీ ఫీలింగ్స్ వారితో షేర్ చేసుకోండి. ప్రేమించే వారితో కొత్త అనుభవాలు, జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, కెరీర్‌లో సవాళ్లను స్వీకరించాలి. ఆఫీస్ రాజకీయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోవద్దు, గొడవలకు దూరంగా ఉండాలి. మీ విజయాలను వేడుకగా జరుపుకునే సమయం ఇది. మీ కొత్త బిజినెస్ వెంచర్‌ డెవలప్ అవుతుంది. మీ ఆరోగ్యం గురించి ఏవైనా ఆందోళనలు లేదా ఒత్తిడి ఉంటే దూరం చేసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబంతో ప్రేమగా ఉండాలి. మ అదృష్ట సంఖ్య 12, అనుకూలమైన రంగు తెలుపు. ఈరోజు బూడిద రంగు పక్షిని చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. తుల (Libra):ఈ రోజు మీ రిలేషన్‌లో అనవసర ఎక్స్‌పెక్టేషన్స్ వదిలేసి, భాగస్వామిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. మీ మనసుకు సంబంధించిన విషయాల్లో క్లారిటీ ముఖ్యం. మీ భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడుతూ, వారితో అనుబంధాన్ని మరింతగా పెంచుకోండి. మీ సామర్థ్యాలు, ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. ఆఫీస్ పనుల్లో సక్సెస్ అవుతారు. వర్క్ ప్లేస్‌లో అందరితో కలసి మెలసి ఉండాలి. మీ క్రియేటివిటీని పెంచుకోవడానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. మీ ఎమోషన్స్‌పై శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వేడుకలు జరుపుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 6, అనుకూలమైన రంగు పింక్. ఈరోజు డైమండ్ రింగ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. వృశ్చికం (Scorpio):మీ రిలేషన్‌షిప్‌లో అనవసరమైన వివాదాలను దూరం చసుకుంటూ, సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ప్రియమైన వ్యక్తితో అనుబంధాన్ని మరింతగా పెంచుకుంటారు. భాగస్వామితో మంచి రొమాంటిక్ టైమ్ గడుపుతారు. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు. కెరీర్‌లో పాజిటివ్ మార్పులు లైన్‌లో ఉన్నాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. మీ ప్రత్యేకతలు, ఆలోచనలపై నమ్మకం పెంచుకొని కెరీర్ గ్రోత్‌కు ప్రయత్నాలు చేయండి. మీ టాలెంట్‌ను నమ్మండి. మీ కొత్త బిజినెస్ వెంచర్ సక్సెస్ బాటలోనే ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీలో కొందరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ అదృష్ట సంఖ్య 44, అనుకూలమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజు పచ్చని తోటను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. ధనస్సు (Sagittarius):ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌లో నమ్మకం, విధేయత ముఖ్యం. ఇవి మీ జీవిత భాగస్వామికి భద్రతకు భరోసా ఇస్తాయి. వారితో కనెక్షన్ మరింత పెంపొందిస్తాయి. ప్రేమించే వారికి స్వేచ్చ ఇవ్వాలి. మనసుకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలి. కొత్త అనుభవాలను అన్వేషించే ప్రయత్నాలు చేయాలి. మీ కెరీర్‌లో అనవసర అటాచ్‌మెంట్‌లు లేదా అంచనాలను లైట్ తీసుకోవాలి. అప్పుడే అవకాశాలు సహజంగా బయటపడతాయి. మీ సహోద్యోగుల పట్ల దయ, అవగాహనతో ఉండాలి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో సక్సెస్ అవుతారు. మీ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోగ్య పరంగా.. సానుకూల మార్పులు, సెల్ప్‌ కేరింగ్‌పై దృష్టి పెట్టాలి. మీ స్నేహితుల గురించి ఆలోచిస్తారు, మీరు గతంలో వారితో ఎంత క్లోజ్‌గా ఉన్నారో గుర్తుచేసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 7, అనుకూలమైన రంగు బంగారం. ఈరోజు మెటాలిక్ బ్రూచ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మకరం (Capricorn):నేడు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మీ రిలేషన్‌షిప్‌లో ప్రస్తుతం చాలా కేర్ చూపించాలి. పార్ట్నర్‌ఫై ప్రేమ కురిపిస్తూ వారికి దగ్గరవ్వండి. వారిని కంట్రోల్ చేయాలనే ఆలోచన వదిలేయండి. ఇది మీ కెరీర్‌లో గ్రోత్, వ్యాపార విస్తరణకు మంచి సమయం. ఆఫీస్ రాజకీయాలకు వీలైనంత దూరం పాటించండి, మీ సొంత పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ కొత్త బిజినెస్ వెంచర్ గురించి అంచనాలకు మించి ఆలోచించాలి. కొత్త ఆలోచనలు వృద్ధికి బాటలు వేస్తాయి. మీ శరీర అవసరాలను వినండి. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే డైలీ రొటీన్, అలవాట్లు ఫాలో అవ్వండి. మీ కుటుంబ సభ్యులతో సహనం ముఖ్యం. వారితో అవగాహన పెంచుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 80, అనుకూలమైన రంగు ఆరెంజ్. ఈరోజు పెద్ద హ్యాండ్‌బ్యాగ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కుంభం (Aquarius):ఈ రోజు మీ రిలేషన్‌షిప్ పార్ట్నర్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో డీప్ కనెక్షన్‌తో, గుర్తుండిపోయే క్షణాలను పెంపొందించుకోవాలి. మీ కోసం మీరు సమయాన్ని వెచ్చించాలి. మనసుకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించాలి. మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని స్వీకరించి, మీ బాటలో ముందుకు వెళ్లండి. కెరీర్‌ పరంగా మీ తెలివి, ప్రత్యేకతలు మీకు ప్లస్ పాయిట్ అవుతాయి. మీ ఆఫీస్‌లో అందరితో సామరస్యంగా ఉండాలి, వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి. అందరితో కలసి మెలసి ఉండండి. మీ కొత్త బిజినెస్ వెంచర్‌లో స్ట్రాంగ్ కనెక్షన్స్, బలమైన నెట్‌వర్కింగ్‌ను నిర్మించుకోవాలి. ఫీల్డ్‌లో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడి లేదా ఆందోళనలను వదిలించుకోవాలి. ఇందుకు యోగా లేదా మెడిటేషన్ వంటివి చేయవచ్చు. మీ సోషల్ సర్కిల్‌లో నమ్మకంగా ఉండాలి, అందరితో అవగాహన పెంచుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 10, అనుకూలమైన రంగు బ్లూ కలర్. ఈరోజు ఫోటో ఎగ్జిబిట్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మీనం (Pisces):మీ రిలేషన్‌షిప్‌లో అంతా ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో కలిసి వేడుకలు జరుపుకుంటారు. వారితో మీ ప్రేమ, కనెక్షన్‌ మరింత పెరుగుతాయి. ప్రేమించిన వారితో ఓపెన్‌గా మాట్లాడాలి. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోవాలి. మీ సహోద్యోగుల భావోద్వేగాలు అర్థం చేసుకోవాలి. వారిపై కనికరంతో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ కొత్త వ్యాపారంలో వృద్ధికి సరికొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. మీ కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని క్రియేట్ చేయండి. మీ అదృష్ట సంఖ్య 18, అనుకూలమైన రంగు టాన్. ఈరోజు జనపనార బుట్టను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా.. కారణం ఇదే..

ఆషాఢ మాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం. ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం.. అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది. అదే గోరింటాకు పండుగ . ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీ లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే మహిళ చేతులకి అందం వస్తుంది. అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లో విశ్వహిందూ పరిషత్ మాత్రుశక్తి… జిల్లా సమియోజ్యక సూర్య దేవర జ్యోతి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ ప్రతి ఏటా ఆషాడమాసంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి ఎంతో ఆనందంగా గోరింటాకు వేడుకను పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు పెట్టుకుని ఆనందంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే గోరింటాకు పండుగ హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధతో ముందుగా గోరింటాకు చెట్టుకు పూజలు నిర్వహించి ఆ చెట్టు యొక్క కొమ్మలను ఒకచోటకు తీసుకొచ్చి సాంప్రదాయాల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు పూజ నిర్వహించి ఆ తర్వాత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రోలులో గోరింటాకును దంచుతారు. అలా దంచిన గోరింటాకు అక్కడున్న మహిళలంతా తలా ఇంత తీసుకొని ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ సాంప్రదాయంగా వస్తున్న గోరింటాకు పాటలను పాడుతూ ఆ రోజులు గోరింటాకు పండుగ రోజుగా జరుపుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా ప్రతి ఏడాది మహిళలు ఆషాడ మాసంలో గోరింటాకు పండుగను జరుపుకోవడంలో తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళలు అంటున్నారు. గోరింటాకు పండుగ నిర్వహించుకోవడంలో శాస్త్రీయంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని మహిళలు అంటున్నారు. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులకి ముఖ్యంగా మహిళలకు ఎప్పుడు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నీళ్లలో పని చేస్తుంటారు కాబట్టి వారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కలుగుతుందని మహిళలు తెలిపారు.


జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను చూడాల్సిందే!

లోయలు చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రపంచంలో అందంగా ఉండే వ్యాలీల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాలీల దగ్గర ప్రకృతి రమణీయంగా ఉంటుంది.


Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు

Floral Palanquin: పుష్ప పల్లకిపై శ్రీవారు


కొత్త జంటలు ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉంటారు?

హిందూ సంప్రయాలతో పెళ్లిళ్లు జరిపేందుకు మంచి ముహూర్తాలు చూస్తుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పంచాంగం చూసి అందులో బలంగా ఉన్న తేదీలను మాత్రమే శుభముహూర్తలకి కేటాయిస్తారు. అయితే హిందూ క్యాలెండర్ 12 మాసాలు ఉంటాయి. చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణంతో ముగుస్తుంది. ఇందులో కొన్ని మాసాలు మాత్రమే శుభమూహూర్తలు ఉంటాయి. ఆషాఢంలో దేవుళ్ళకి పూజలు నిర్వహించడానికి మంచి రోజులు అయినప్పటికీ పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఉండవు. ఆషాఢ మాసం జులై 6న ప్రారంభమైంది. ఆగస్టు 4న ముగియనుంది. అయితే ఈ మాసంలో శుభ ముహూర్తాలు ఎందుకు ఉండవు అనే సందేహాలు ఉంటాయి. పూజారి వామన శర్మ ఈ సందేహాలపై స్పష్టత ఇచ్చారు. ఆషాఢ మాసం ప్రారంభం అవడంతోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నవరాత్రులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా కూరగాయల మాలలతో అమ్మవారిని సత్కరించి ఆ కూరగాయలను భోజనం చేసుకుని తింటారు. అలా చేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక ఆషాఢం మొదలవగానే బోనాల పండుగ కనువిందుగా వాడవాడల్లో కన్నులపండువగా సాగుతుంది. అంటే ఈ మాసంలో ఉపవాసాలు దేవుళ్ళ పూజలకి, దైవ దర్శనానికి ఎంతో మంచివని తెలిపారు వామన శర్మ . ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పొద్దున్నే స్నానం ఆచరించి పితృ దేవతలకి దాన ధర్మాలు చేస్తారు. అలా చేయడం ద్వారా చనిపోయిన వారి శాంతి కలుగుతుందని నమ్ముతారు అందుకే ఈ మాసం పితృ దేవతలకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగా పని చేయకపోవడం వలన, ముఖ్యంగా ఈ మాసం శూన్యం కావడం, దైవ దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ప్రతి ఏడాది ఈ మాసంలో ముహూర్తాలు ఉండవు. అలాగే ఈ మాసం గర్భధారణకు మంచిది కాదని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే పెళ్లిళ్లు చేయరు. అలాగే పెళ్లి అయిన కొత్త జంటలను కూడా దూరంగా ఉంచుతారు.


మొక్కజొన్న తింటే ఏమవుతుందో తెలుసా?

వర్షంలో వేడి వేడి మొక్క జొన్నపై నిమ్మరసం, ఉప్పు, కారం జల్లి తింటుంటే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో సాయంత్రం అయితే చాలు.. రోడ్డు పక్కనున్న బండి దగ్గర నిలబడి కాల్చిన మొక్కజొన్నను తింటుంటారు. కానీ మొక్కలను జొన్నలను తింటే ఏమౌతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా...


Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

Curry Leaves : కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే ఏంచక్కా తింటారు. అవేంటో తెలుసుకోండి.


Litchi Fruit: లిచీ పండ్ల గింజ‌ల‌ను ప‌డేయ‌కండి.. దీని వల్ల కలిగే లాభాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు..!

Litchi Fruit Seeds: లిచీ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పండు మాత్రమే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలను ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఆప్రికాట్ ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటారు..!

ఆప్రికాట్.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? రుచికి చాలా బాగుంటాయి. రెగ్యులర్ గా వీటిని అందరూ పెద్దగా తినరు. కానీ.. ఈ ఆ ప్రికాట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా రోజూ తింటారట. మనం ఆరోగ్యంగా ఉండేందుకు.. మన శరీరానికి ఎన్ని న్యూట్రియంట్స్ అవసరమో.. అన్ని న్యూట్రియంట్స్.. ఆప్రికాట్ లో పుష్కలంగా ఉంటాయట. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... ఆప్రికాట్స్ లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ,...


ఇలా చేస్తే ఇంట్లో నుంచి ఎలుకలు బయటికి వెళ్ళిపోతాయి..

ఒక్క ఎలుక ఇంట్లోకి వచ్చిందంటే చాలు.. ఆటోమేటిగ్గా 100 ఎలుకలతో సమానం.. వీటిని ఇంట్లో నుంచి ఈజీగా ఎలా బయటికి పంపాలో తెలుసుకోండి.


అటవీ ప్రాంతంలో అకాడి సంబురం.. వన దేవతలకు ఆదివాసుల ప్రత్యేక పూజలు..

ఆదిలాబాద్ జిల్లా... పచ్చని చిక్కని అడవులకు పెట్టింది పేరు. అంతే కాదు ఆ అడవులే ఆటపట్టుగా జీవించే ఆదివాసి గిరిజనుల ఖిల్లా కూడా. ఇక్కడి ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. యేడాది పొడవునా ఇక్కడి గిరిజనులు ఏదో ఒక పండుగను, వేడుకను జరుపుకుంటుంటారు. అందులో ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ అకాడి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం వానాకాలంలో ఈ అకాడి పండుగను జరుపుకోవడం ఆదివాసి గిరిజనుల ఆచారం. తర తరాల నుండి అనాదిగా వస్తున్న ఆచారాల...


Dosakaya Pachadi: దోసకాయ పచ్చడి..వేడి వేడి అన్నంలోకి బెస్ట్‌ కాంబినేషన్‌

Dosakaya Pachadi Recipe: దోసకాయ పచ్చడి రుచికరమైన వంటకం మాత్రమే కాదు, అనేక ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం కూడా. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి? వీటి పోషకాలు ఏంటో తెలుసుకోండి.


Spicy Coconut Powder: అన్నం, ఇడ్లీలోకి ఎండు కొబ్బరి మసాలా పొడి ఒక్కసారి చేసుకుంటే నాలుగు నెలలు నిల్వ ఉంటుంది

Spicy Coconut Powder: ఇడ్లీ, దోశ వంటి వాటితో ఏదో ఒక పొడిని పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో కాస్త పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని చల్లి తింటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము ఎండు కొబ్బరి మసాలా పొడి రెసిపీ ఇచ్చాను.


Aloo Jeera: ఆలూ జీరా.. ఇలా కేవలం 20 నిమిషాల్లో ఎంతో రుచికరంగా తయారు చేసుకోండి..

Aloo Jeera Recipe: బంగాళదుంపతో వివిధ కూరలు వండుకోవచ్చు. దీంతో రుచి కూడా బాగుంటుంది. అయితే, బంగాళదుంప, జిలకర్ర వేసుకుని తయారు చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ రిసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


Bitter Gourd: వర్షాకాలంలో కాకరకాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలిస్తే షాక్ అవుతారు.!

Bitter Gourd: వర్షాకాలంలో కాకరకాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలిస్తే షాక్ అవుతారు.!


Lucky Zodiac Signs: 4 రాశుల అమ్మాయిలు అత్తారింటికీ అదృష్టాన్ని తీసుకొస్తారు.. మీ రాశి ఉందా..!

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు, గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అంతులేని అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందులో ఈ 4 రాశుల అమ్మాయిలు మాత్రం అత్తారింటికీ అంతులేని అదృష్టం తీసుకొస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.


Phool Makhana Kheer: ఫూల్ మఖానా పాయసం..ట్రై చేసి చూడండి..!

Phool Makhana Kheer Recipe: ఫూల్ మఖానా పాయసం ఒక ప్రసిద్ధ భారతీయ డెజర్ట్. దీనిని లోటస్ సీడ్స్ తో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాలతో నిండి ఉంటుంది.


నెలాఖరులో శుక్ర సంచారం, శుభవార్తలు అందే సమయం..!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, సౌక్యం, వైభవం, ఐశ్వర్యం, ఆనందానికి సంబంధించిన ఫలితాలు ఇస్తుందని చెపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తులు వారి జీవితంలో అన్ని రకాల సుఖాలు మరియు విలాసాలను పొందుతారంట. జూలై 07న శుక్రుడు కటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక జూలై 31 న, శుక్రుడు సింహరాశిలో, సూర్యుని రాశిలోకి ప్రవేశిచనున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెపుతున్నారు. అంతేకాదు వారి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం పొందుతారంట. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కలలు కూడా నిజం అవుతాయని పండితులు అంటున్నారు. శుక్రుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం: వృషభ రాశి వారు సింహరాశిలో శుక్రుని సంచారం వల్ల చాలా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రాశి నుండి నాల్గవ ఇంట ఉంటాడు. జాతకం యొక్క నాల్గవ ఇల్లు జీవితం యొక్క సుఖాలు, విలాసాలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. వాహన, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో సంబంధాలు బలపడతాయి. మిథునం: శుక్రుని సంచారం మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం విషయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరికి సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. సింహం: శుక్రుని సంచారం మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు పెద్ద పని చేయాలనుకున్నా, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమికులకు అనుకూల సమయంలో.. వివాహం వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉత్తీర్ణులు అవుతారు. కన్య: ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాదు మీ వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగుల హోదా, జీతం పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. మకరం: శుక్రుని సంచార ప్రభావం పని విస్తరణలో పురోగతిని ఇవ్వడమే కాకుండా సామాజిక హోదా మరియు ప్రతిష్టను పెంచుతుంది. ఈ కాలంలో మకర రాశి వారు రాజకీయ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆశించిన పనులు పూర్తవుతాయి. కుంభం: శుక్ర సంచారం కుంభ రాశికి కూడా మేలు చేస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం పండితుల వ్యక్తిగత అభిప్రాయం.. న్యూస్ 18తెలుగు దీనిని ధృవీకరించడం లేదు)