BEST ANTI AGING CREAM: 60 ఏళ్లైన వృద్ధులు కూడా ఇలా 5 రోజుల్లో గ్లోయింగ్ స్కిన్ పొందొచ్చు!

Best Anti Aging Night Cream For 50s: మహిళలైన, పురుషులైనా అందంగా కనిపించేందుకు మూఖానికి పలు సౌందర్య లేపనాలు వినియోగిస్తూ ఉంటారు. అయితే దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ  30 ఏళ్లు దాటిన తర్వాత వాటిని వినియోగించినప్పటికీ మంచి ఫలితాలు పొందలేకపోతున్నారు. ముఖంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ వాడుతున్నారు. ఇలాంటి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి సహాజంగా కూడా ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల అందమైన చర్మాన్ని పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ క్రీమ్‌ను వినియోగించండి:

ఈ క్రీమ్‌కి అవసరమైన పదార్థాలు:

అలోవెరా జెల్

బియ్యం

కొబ్బరి నూనె

రోజ్ వాటర్

చిన్న డబ్బ

కొరియన్ గ్లోయింగ్ స్కిన్ రెసిపీ:

గ్లోయింగ్ స్కిన్ కోసం క్రీమ్‌ తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.  బియ్యాన్ని నీటిలో నానబెట్టి కొద్దిసేపు ఉంచండి.

తర్వాత నీళ్లలోంచి బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత.. ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో బియ్యాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

బియ్యంతో తయారు చేసిన ఈ పేస్ట్‌లో 1 టీస్పూన్ అలోవెరా జెల్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని డబ్బలో నిల్వ చేసుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే కొరియన్ మెరిసే చర్మం సులభంగా పొందుతారు.

ఉపయోగించే పద్ధతి:

కొరియన్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఈ క్రీమ్‌ను అప్లై చేసే ముందు.. మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.

దీని తర్వాత ముఖానికి బాగా అప్లై చేసి.. తేలికపాటి చేతులతో మసాజ్ చేసి, రాత్రంతా మీ ముఖం మీద ఉంచి నిద్రపోండి.

దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ చర్మం సహజంగా మెరుస్తుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Also read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

2023-03-26T09:07:56Z dg43tfdfdgfd